NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema రివ్యూలు

Thika Maka Thanda Review: ఊరు మొత్తం మతిమరుపు.. కామెడీ డ్రామా “తికమక తండా” సినిమా రివ్యూ..!!

Thika Maka Thanda Review: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలిసారి కవలలు హీరోగా పరిచయం చేసిన సినిమా “తికమక తండా”. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. “రాజన్న” సినిమాలో బాలనటిగా నటించిన యాని హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ గా రేఖ నిరోషా నటించింది. పూర్తి కామెడీ నేపథ్యంలో కుటుంబ ప్రేక్షకులతో చూడదగ్గ ఈ సినిమా డిసెంబర్ 15వ తారీకు విడుదలయ్యింది.

సినిమా: తికమక తాండ
నటీనటులు : హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్ తదితరులు..
ఎడిటర్: కుమార్ నిర్మలాసృజన్
సినిమాటోగ్రఫీ: హరికృష్ణన్
సంగీతం: సురేష్ బొబిల్లి
నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు
దర్శకత్వం: వెంకట్
విడుదల తేది : 15/12/2023

పరిచయం:

కవలలు హరికృష్ణ రామకృష్ణ హీరోలుగా యాని, రేఖ నిరోషా హీరోయిన్ లుగా నూతన దర్శకుడు వెంకటదర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “తికమక తాండ”. ఈ సినిమాలో ఊరు మొత్తనికి మతిమరుపు జబ్బు ఉంటే.. జరిగే సంఘటనలను కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. టిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై తిరుపతి శ్రీనివాసరావు నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. మతిమరుపు వల్ల ఊరు ఎటువంటి సమస్యలలో చిక్కుకుంది..? దాని నుంచి చివరకు ఎలా బయటపడింది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. డిసెంబర్ 15వ తారీకు ఈ  సినిమా విడుదల కావడం జరిగింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

thika maka thanda movie review is a comedy movie village people suffer with amnesia

కథ:

తికమక తండా అనే గ్రామంలో నివసించే ప్రజలందరికీ మతిమరుపు సమస్య ఉంటుంది. దీంతో ఆ సమస్య కారణంగా ఊరిలో.. ఎక్కడికక్కడ స్పష్టంగా.. బోర్డులు ఉంటాయి. ఆ సమస్యతో ఊర్లో ప్రజలు ఏమీ మర్చిపోకుండా… అన్ని పేర్లు పలకల మీద రాసుకునే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో మతిమరుపు సమస్య జయించడానికి ఆ ఊరి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దీనిలో భాగంగా ఊరిలో ఉన్న అమ్మవారికి జాతర చేయాలని భావిస్తారు. సరిగ్గా ఆ జాతర చేయాలనుకునే ముందు ఆ ఊరిలో ఉన్న అమ్మవారి విగ్రహం ఒక్కసారిగా మాయమైపోతది. అలాంటి సమయంలోనే ఊరినీ  కొన్ని కష్టాలు, సమస్యలు చుట్టుముడతాయి. దీంతో కవలలు అయినా హీరోలు ఏ రకంగా ఆ సమస్యలను ఎదుర్కొన్నారు..? మతిమరుపు సమస్య ఊరికి ఎలా వచ్చింది..? అమ్మవారి విగ్రహం ఎవరు దోచేశారు..? అసలు ఆ ఊరిపై ఎవరికీ కన్ను ఉంది..? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

thika maka thanda movie review is a comedy movie village people suffer with amnesia

విశ్లేషణ:

తెలంగాణలో ఓ మారుమూల గ్రామంలో ఈ సినిమా జరిగింది. సినిమాలో నటీనటుల యాస భాష మొత్తం తెలంగాణకి సంబంధించింది. “తికమక తండా” మొదటి భాగం మతిమరుపు ట్రాక్ తో కామెడీ సాగింది. ఇదే సమయంలో హీరోల ప్రేమ కథ కూడా ఆకట్టుకోవడం జరిగింది. మొదటి సినిమాతోనే హరికృష్ణ మరియు రామకృష్ణ ఇద్దరు కవలలు నటనతో మెప్పించారని చెప్పవచ్చు. రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన యాని ఈ సినిమాలో హీరోయిన్ గా మల్లిక పాత్రలో నటించింది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాలలో యాని నటన అందరిని ఆకట్టుకుంటూ ఉంటది. సినిమా విడుదల కాకముందు పుత్తడి బొమ్మ సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. సిద్ రామ్ పాడిన ఈ పాట యూట్యూబ్ లో 11 లక్షల వ్యూస్ సాధించింది. సినిమాలో కూడా అదే తరహాలో చిత్రీకరణ ఉంది. పుత్తడిబొమ్మ సాంగ్ లో యాని నిజంగా పుత్తడి బొమ్మలా అనిపించింది. మరో హీరోయిన్ రేఖ నిరోషా.. కూడా తన పాత్రకి తగ్గ న్యాయం చేయడం జరిగింది. సినిమాకి అన్నిటికంటే ప్లస్ పాయింట్ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి. గ్రామీణ నేపథ్యంలో లొకేషన్స్ కి తగ్గ విధంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో సక్సెస్ చేయడని చెప్పవచ్చు. దర్శకుడు వెంకట్ మొదటి సినిమాతోనే అతని చాలా అద్భుతంగా చూపించడంతోపాటు అన్ని టెక్నికల్ వాల్యూస్ నీ చాలా కరెక్ట్ గా వాడుకున్నాడని అనొచ్చు. అమ్మవారి విగ్రహం పోయాక సెకండ్ హాఫ్ పై ప్రేక్షకుడికి చాలా క్యూరియాసిటీ పెంచేలా చేయటంలో దర్శకుడు కథని నడిపించిన తీరు అద్భుతం. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సాగదీత  సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉన్నాయి. కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు కూడా అక్కడక్కడ తారసపడ్డాయి. దర్శకుడిగా వెంకట్ కి ఈ సినిమా మొదటిది అయినా గాని సెలెక్ట్ చేసుకున్న కథను.. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వెండితెరపై ఆవిష్కరించాడు. “తికమకతాండ” టైటిల్ కి తగ్గ సినిమా కంటెంట్ చూపించాడు.  హరికృష్ణ ఫోటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో లొకేషన్స్.. చాలా అద్భుతంగా ఉన్నాయి.

 

ఓవరాల్ గా: కామెడీ నేపథ్యంలో “తికమకతాండ”.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పవచ్చు.

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu