Prema: సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనదైన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల తారల్లో ప్రేమ ఒకటి. బెంగళూరులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. ఎయిర్ హోస్టెస్ కావాలని కలలు కన్నది. కానీ తల్లి ఆమెను నటిగా చూడాలని ఆశపడ్డారు. తల్లి ఆశ మేరకు ప్రేమ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. 1995లో సవ్యసాచి అనే కన్నడ మూవీతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా పరాజయం పాలైంది. అయినప్పటికీ ప్రేమకు కన్నడలో ఓం అనే చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రేమ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ధర్మచక్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రేమ.. దేవి మూవీతో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. రీల్ లైఫ్ లో నటిగా సూపర్ సక్సెస్ అయింది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం చాలా కష్టాలు పడింది. 2006లో ప్రేమ జీవన్ అప్పచ్చు అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట్లో వీరి కాపురం సవ్యంగానే సాగింది.
ప్రేమ యాక్టింగ్ కూడా ఆపకుండా వరుసగా సినిమాలు చేసింది. కానీ కొన్నాళ్ల తర్వాత ఇద్దరు మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అవి పెరిగి పెరిగి విడాకులకు దారితీశాయి. 2016లో జీవన్-ప్రేమ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయాక మానసికంగా ప్రేమ చాలా స్ట్రగుల్స్ ను ఫేస్ చేసింది. డిప్రెషన్ లో కూరుకుపోయి కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉంది. అదే సమయంలో ఆమెపై రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. ప్రేమ 40 ఏళ్ల వయసులో క్యాన్సర్ బారిన పడిందని.. అందుకే సినిమాలో కనిపించడం లేదంటూ రూమర్స్ సృష్టించారు.
ఆ రూమర్స్ ఆమెను మరింత కృంగతీశాయి. చివరకు కుటుంబ సభ్యుల సపోర్ట్ తో ఆమె లైఫ్ ను ఒక ఛాలింగ్ గా తీసుకుంది. పెళ్లనేదే జీవితం కాదని నిర్ణయించుకుంది. డిప్రెషన్ నుంచి బయటపడి మానసికంగా మళ్ళీ స్ట్రాంగ్ అయింది. 2009 నుంచి వెండితెరకు దూరంగా ఉన్న ప్రేమ