పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే కాదు ఆయన సినిమా టైటిల్స్‌కు యమా క్రేజ్ ఉంటుంది. అందుకే యంగ్ హీరోలు ఆయన టైటిల్స్‌పై కన్నేస్తుంటారు. ఇప్పటికే పవన్ టైటిల్ `తొలిప్రేమ`తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా చేసి సక్సెస్ అయ్యాడు. మొన్నామధ్య విజయ్ దేవరకొండ సైతం తన 11వ చిత్రానికి పవన్ సూపర్ హిట్ టైటిల్ `ఖుషి`ని ఫైనల్ చేసుకున్నాడు.
ఇప్పుడు అఖిల్ అక్కినేని కూడా వదలట్లేదు. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్.. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` అనే మూవీ చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తే.. మలయాళ స్టార్ మమ్ముట్టీ కీలకపాత్రను పోషించారు.
బన్నీ వద్దనుకున్న కథతో అఖిల్ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ మూవీ అనంతరం `వకీల్ సాబ్` డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో అఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజుల నుండీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మించబోతున్నారు.
అయితే ఈ మూవీకి `తమ్ముడు` అనే టైటిల్‌ను ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వేణు శ్రీరామ్ ఈ సినిమాను రూపొందించబోతున్నాడట. అందుకే `తమ్ముడు` టైటిల్ బాగా సెట్ అవుతుందని అనుకుంటున్నారట. కాగా, పవన్ కళ్యాణ్ హీరోగా 1999లో వచ్చిన `తమ్ముడు` ఎంత మంచి విజయం సాధించిందో తెలిసిందే. ఆయన కెరియర్ లోనే `తమ్ముడు` చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…