Naga Chaitanya: తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య మనందరికీ సుపరిచితమే. ఎన్నో అంచనాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతు పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. అయినప్పటికీ కృంగిపోకుండా తనపై తన నటనపై నమ్మకం ఉండడంతో ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
అదేవిధంగా నాచురల్ బ్యూటీగా పేరు పొందిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో అనేక సినిమాలు తెరకెక్కాయి. ఇక అవి సూపర్ హిట్స్ సైతం అయ్యాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ ” తండేల్ “. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకులు ఎంతగానో ఎట్రాక్ట్ అయ్యారు.
ఇక వాటిలోని చైతు డైలాగు ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ” బుజ్జి తల్లీ.. వచ్చేస్తున్నా కదే.. కాస్త నవ్వే ” అనే సాగే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇక దీనికి సాయి పల్లవి వెనక్కి తిరిగి నవ్వే వీడియోని ఒకటి యాడ్ చేసి చైతు తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.
ఇక నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈయన ఇలా చేయడంతో వదిన సూపర్ ఉంది అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
అదేవిధంగా అక్కినేని ఇంటికి మరో కోడలు రాబోతుంది అంటూ స్పందిస్తున్నారు. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి మరి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!