NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Rajya Sabha Election: వెనక్కితగ్గిన చంద్రబాబు .. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం  

Rajya Sabha Election:  రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు పలువురు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అంశంపై చంద్రబాబు వద్ద ముఖ్యనేతలు ప్రస్తావించారు.

అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఈ మేరకు నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నిర్ణయంతో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. వైసీపీ నుండి నామినేషన్ లు దాఖలు చేసిన వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు.

tdp

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగా క్రాస్ ఓటింగ్ తో లాభపడవచ్చనే ఆలోచనతో రాజ్యసభ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని అందరూ భావించారు. ఇప్పటికే వైసీపీలో టికెట్ దక్కని చాలా మంది అసంతృప్తులు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకి అభ్యర్ధిని బరిలో దింపితే క్రాస్ ఓటింగ్ చేస్తామని సమాచారం ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.

chandrababu TDP

దీంతో టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపుతుందని అనుకున్నారు. ఆ క్రమంలోనే వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలను ఆ పార్టీ పెద్దలు బుజ్జగింపుల ప్రక్రియ ప్రారంభించారు. దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు మెత్తబడ్డారు. పార్టీ నిర్ణయానికి లోబడతామని చెప్పారు. గతంలో రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ వర్ల రామయ్య ను పోటీకి దింపి అభాసుపాలైంది. ప్రస్తుతం బలం లేకుండా పోటీకి అభ్యర్ధిని నిలిపినా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు అన్నీ ఆలోచించే చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెట్టకూడదని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

ఇదే సందర్భంగా రా కదలి రా.. సభలు, లోకేష్ శంఖారావం మీటింగ్ తో పాటు వివిధ రాజకీయ అంశాలపైనా ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికలు కేవలం ఇంకా 56 రోజులే ఉందని కావున నేతలు పూర్తిగా ఎలక్షన్ మూడ్ లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాగా, వైసీపీ నుండి ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారన్న ప్రచారంపై చంద్రబాబు వద్ద నేతలు ప్రస్తావించగా, వైసీపీలోని ముఖ్య నేతలు పార్టీకి టచ్ లోకి వచ్చిన మాట నిజమేనని చెప్పారు.

అయితే వైసీపీ నుండి వచ్చిన అందరినీ తీసుకోలేమని, అన్నీ ఆలోచించి నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. పొత్తులు, కొత్త చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుండో కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, కంభంపాటి రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

YSRCP: వైసీపీకి షాక్ ఇస్తున్న మరో ఎంపీ .. టీడీపీలో చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju