NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి షాక్ ఇస్తున్న మరో ఎంపీ .. టీడీపీలో చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!

YSRCP: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులు సీఎం జగన్ కు వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడారు. బాలశౌరి జనసేన పార్టీలో చేరగా, శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల 22వ తేదీన టీడీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

ఇదే బాటలో మరో ముగ్గురు ఎంపీలు వైసీపీకి బైబై చెప్పి టీడీపీలో చేరనున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు  వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి లు కూడా పార్టీ వీడనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రం ఆ వార్తలను ఖండించారు. వైసీపీ నుండే తాను పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం వైసీపీని వీడి టీడీపీ లో చేరేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా వేమిరెడ్డి వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధిగా వేమిరెడ్డిని పార్టీ అధిష్టానం ఇటీవల ఖరారు చేసింది. అయితే తాను సూచించిన వారికి పార్లమెంట్ పరిధిలో టికెట్ లు ఇవ్వాలని వేమిరెడ్డి పార్టీ అధిష్టానానికి సూచించినా పట్టించుకోలేదు. దీంతో వేమిరెడ్డి పార్టీ అధిష్టానంపై అలకబూనారు. పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. రీసెంట్ గా సీఎం జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా అందుబాటులో ఉండాలని సమాచారం ఇచ్చినా వేమిరెడ్డి పట్టించుకోలేదు. ముందస్తు షెడ్యూల్ ఉందంటూ ఆయన దుబాయ్ వెళ్లిపోయారు.

దుబాయ్ నుండి వచ్చిన తర్వాత వేమిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో వేమిరెడ్డి చర్చలు జరిపినట్లు తెలుస్తొంది. వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు వేమిరెడ్డి. త్వరలోనే వేమిరెడ్డి తన వర్గంతో కలిసి టీడీపీలో చేరతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వేమిరెడ్డి దంపతులను టీడీపీలోకి ఆహ్వానించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. వేమిరెడ్డి పార్టీలో చేరితే నెల్లూరు లోక్ సభ అభ్యర్ధిత్వం ఖరారు చేసేందుకు చంద్రబాబు అంగీకరించినట్లుగా సమాచారం. వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా టీడీపీలో చేరనున్నారని చెబుతున్నారు. ఆమె టీటీడీ డైరెక్టర్ గా ఉన్నారు.

కాగా, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే కూడా వేమిరెడ్డి పార్టీ మార్పు ఖాయమేనని తెలుస్తొంది. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని, వైసీపీ నుండి పోటీ చేస్తానని చెప్పారు. అసెంబ్లీకా, లోక్ సభకా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వేమిరెడ్డితో పాటు, మాగుంటతోనూ తాను చర్చలు జరిపాననీ, వేమిరెడ్డి మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తన ప్రయత్నం ఫలించలేదని స్పష్టం చేశారు. వేమిరెడ్డి అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆదాల చెప్పారు.

మాగుంట మాత్రం పార్టీలో కొనసాగాలనుకుంటున్నారని ఆదాల చెప్పారు. వైసీపీ టికెట్ ఇస్తే మాగుంట పోటీ చేస్తానంటున్నారని తెలిపారు. గతంలోనే సస్పెండ్ అయిన నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. దాంతో పాటు తాజాగా బిగ్ షాట్ గా పేరున్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరితే ఈ జిల్లాలో పార్టీకి ఊపు రావడం ఖాయమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. తాజా రాజకీయ పరిణామాలతో నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వడంతో బోణీ కొట్టడం ఖాయంగా కనబడుతోంది.

YSRCP: ఆలూరు వైసీపీలో రగులుతున్న రగడ .. మంత్రి గుమ్మనూరు వర్సెస్ పార్టీ ఇన్ చార్జి విరూపాక్ష

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N