బిగ్ బ్రేకింగ్: సినీ నిర్మాత బండ్ల గణేష్ మనందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన బండ్ల గణేష్ అనేక సినిమాలలో నటించాడు కూడా. అదేవిధంగా బండ్ల గణేష్ నిత్యం ఎవరో ఒకరిపై వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ఇక తాజాగా బండ్ల గణేష్ గురించి బిగ్ బ్రేకింగ్ ఒకటి వినిపిస్తుంది. బండ్ల గణేష్ కి ఏడాది పాటు జైలు శిక్ష పడినట్లు తెలుస్తుంది.
చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు కి చెందిన ముప్పాళ్ళ వెంకటేశ్వరరావు వద్ద నుంచి 95 లక్షలు తీసుకున్న బండ్ల గణేష్ కు.. 95 లక్షల పదివేలు కోర్టు ఖర్చులు కింద చెల్లించాలని తీర్పునిచ్చింది. అదేవిధంగా ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష ని కూడా విధించింది కోర్ట్.
2019లో నగదు పెట్టి చెక్కులు తీసుకున్న బండ్ల గణేష్.. డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో హై కోర్ట్ కి ఎక్కారు బాధితుడు. పలు వాయిదాల అనంతరం కోర్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. 30 రోజుల లోపు అతనికి మొత్తం డబ్బు చెల్లించాలని ఆదేశించింది. హై కోర్ట్ కు వెళ్లే ఆలోచనలో బండ్ల గణేష్ లాయర్లు ఉన్నారు. ఇక తనకి ఇచ్చిన గడువు ముగియడంతో బండ్ల గణేష్ కు ఏడాది పాటు జైలు శిక్షతో పాటు 95 లక్షల పదివేలు జరిమాణం కూడా విధించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!