NewsOrbit
Cinema Entertainment News Global న్యూస్ సినిమా

Avantika Vandanapu: హాలీవుడ్ ను షేక్ చేస్తున్న అవంతిక వందనపు.. హ‌ద్దులు దాటిన ట్రోల‌ర్స్.. త‌న స్టైల్‌లో ఇచ్చిప‌డేసిన తెలుగు పిల్ల‌!

Avantika Vandanapu: అవంతిక వందనపు.. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు హాలీవుడ్ ను షేక్ చేస్తోంది. వరుస అవకాశాలు అందుకుంటూ అక్క‌డి నటీనటులతో పోటీ పడుతుంది. అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థిర‌ప‌డిన తెలుగు ఫ్యామిలీలో అవంతిక జ‌న్మించింది. చిన్న‌త‌నం నుంచి కూచిపూడి , భ‌ర‌త నాట్యాల‌లో శిక్ష‌ణ పొందింది. 2014లో జీ తెలుగు నార్త్ అమెరికాలో నిర్వ‌హించిన రియాలిటీ షో డాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ స్టార్స్‌లో పాల్గొన్న అవంతిక రెండో విజేత‌గా నిలిచింది.

ఆ త‌ర్వాత మ‌రికొన్ని డ్యాన్స్ షోస్‌లో పాల్గొని విజేత‌గా నిలిచింది. దాంతో అవంతిక‌కు ఇండియ‌న్ మూవీస్ లో అవ‌కాశాలు రావ‌డం ప్రారంభం అయ్యాయి. 2016లో బ్రహ్మోత్సవం చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అవంతిక‌(Avantika Vandanapu).. అటు పిమ్మ‌ట మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, బాల‌కృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి త‌దిత‌ర చిత్రాల్లో యాక్ట్ చేసింది. అలాగే ప‌లు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో మెరిసింది.

అవంతిక చేసిన పార్చూన్ అయిల్ యాడ్ ఆమెకు భారీ పాపుల‌రిటీ తెచ్చింది. కొన్నాళ్ల నుంచి హాలీవుడ్ పై ఫోక‌స్ పెట్టిన అవంతిక‌.. ఈ ఏడాది ఆరంభంలో నేరుగా నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌లైన మీన్ గర్ల్స్ అనే మ్యూజిక‌ల్‌ మూవీతో అక్కడ స్టార్ అయింది. ఇందులో క‌రేన్ శెట్టి పాత్ర‌లో అద‌ర‌గొట్టేసింది. హాలీవుడ్ లో యూత్ కు హాట్ క్ర‌ష్‌గా మారింది. అయితే మీన్ గర్ల్స్ ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో హాలీవుడ్ మీడియాతో అవంతిక వందనపు మాట్లాడిన తీరుపై.. ఆమె అమెరికన్ ఆక్సెంట్ మ‌రియు ఫేస్ ఎక్స్‏ప్రెషన్స్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది.

Avantika Vandanapu

ఇక్క‌డివారు హ‌ద్దులు దాటి అవంతిక‌ను ఓ రేంజ్ లో ఏకేశారు. అయితే తాజాగా ఓ తెలుగు ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అవంతిక‌.. త‌న స్టైల్ లో ట్రోల‌ర్స్ కు ఇచ్చిప‌డేసింది. విమ‌ర్శించిన వారికి బుద్ధి చెప్పింది. తాజాగా అవంతిక మాట్లాడుతూ.. `నేను అమెరికలో పుట్టి పెరిగాను.. మేము స్కూల్ కు వెళితే అమెరికన్ యాక్సెంట్ మాట్లాడతాము. ఇంట్లో ఉంటే ఇండియన్ యాక్సెంట్ లో మాట్లాడతాము.. దీనిని కోడ్ స్విచ్చింగ్ అంటారు.

దాని గురించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలియదని నాకు రీసెంట్‌గానే అర్థమయ్యింది. నేను అమెరికన్ ఆక్సెంట్ లో మాట్లాడ‌టం వ‌ల్ల‌ ఎంతో మంది ట్రోల్ చేశారు. కానీ నిజానికి అది నా ఒరిజిన‌ల్ ఆక్సెంట్‌. అమెరికాలో పెర‌గ‌డం వ‌ల్ల అక్క‌డి యాస‌ స‌హ‌జంగా నాకు వ‌చ్చింది. అయినా ఒక తెలుగు అమ్మాయి హాలీవుడ్ దాకా వచ్చి ఇక్కడ సినిమాల్లో స‌క్సెస్ అవుతుందంటే సపోర్ట్ చేయాలి. కానీ ప‌నికి రాని విష‌యాల్లో విమర్శించడం చాలా బాధాక‌రం` అని పేర్కొంది. త‌న మాట‌ల‌తో అంద‌రినీ ఆలోచ‌న‌లో ప‌డేసింది.

Avantika Vandhanapu: కాగా, మీన్ గర్ల్స్ మూవీ త‌ర్వాత‌ అంతర్జాలంలో టాప్ ట్రేండింగ్ యాక్ట్రెస్ జాబితాలో చేరిపోయిన అవంతిక‌.. ప్ర‌స్తుతం ఏ క్రౌన్ ఆఫ్ విషెస్ అనే టెలివిషన్ షో షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే మ‌రోవైపు అవంతిక న‌టించిన బిగ్ గర్ల్స్ డోంట్ క్రై అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగానే అవంతిక ఇండియాకు వ‌చ్చింది.

author avatar
kavya N

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju