Nindu Noorella Saavasam March 19 2024 Episode 188: అక్క ఇక్కడ ఏం చేస్తున్నావ్ ప్రదక్షణ అయిపోయింది కదా 101 కొబ్బరికాయ నీ చేతులతో తెచ్చి కొడితే దీక్ష అయిపోతుంది ఇక నువ్వు హ్యాపీగా తినొచ్చు పదా అని భాగమతి అంటుండు. ఏంటి అక్క ఏమి మాట్లాడవు అని భాగమతి అడుగుతుంది. నా పక్కన ఉండి అక్క అక్క అంటుంటే నేను గమనించుకోలేకపోయాను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను కదా పెళ్లయితే మళ్లీ ఇంటికి రావాలి కాబట్టి నన్ను కాక పడుతున్నావ్ అనుకున్నాను నా గురించి నిజం తెలుసుకొని వచ్చావని నేను అర్థం చేసుకోలేకపోయాను అని మనోహరి అంటుంది.నిజం తెలిసిపోయింది కాబట్టి ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకు నీతో డైరెక్ట్ గాని మాట్లాడుతాను అని భాగమతి అంటుంది. ఆ ఇంటికి ఏ ధైర్యంతో వచ్చావు నాతో మాట్లాడడానికే భయపడతారు
నా గురించి అమర్ కి చెప్పి పెళ్లి జరగకు0డ చేయాలనుకుంటున్నావా అలా ఎప్పటికీ జరగదు నన్ను ఢీ కొట్టాలంటే నీవల్ల కాదు అని మనోహరి అంటుంది. నీ గురించి నిజం తెలిశాక ఇక్కడికి వచ్చాను అంటే నా గురించి నువ్వు తెలుసుకోవాలి మనోహరి అని భాగమతి అంటుంది. నేను అమర్ ని పెళ్లి చేసుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి అని మనోహరి అంటుంది. అది నా కుటుంబం కష్టంలో ఉంటే చూసుకొకుండ ఎలా ఉంటానోనాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఆదుకున్నది ఆ కుటుంబం అలాంటి కుటుంబాన్ని కష్టాల్లో ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను,నువ్వు ఆయన నీ పెళ్లి చేసుకుంటే పిల్లలని ఆయనకి దూరం చేస్తావని నాకు తెలుసు అందుకు పెద్దవాళ్లు అడ్డం వస్తే ఏం చేస్తావో కూడా నాకు తెలుసు కానీ నీ ఆటలు సాగనివ్వను నువ్వు ఆయనని పెళ్లి చేసుకోవాలంటే నన్ను దాటి వెళ్ళాలి అని భాగమతి అంటుంది.
నువ్వు నాకు అడ్డొస్తే చూస్తూ ఊరుకుంటానా నేను మాటలతో చెప్పేదాన్ని కాదు నిన్ను అడ్డు తొలగిస్తాను అని మనోహరి అంటుంది.నువ్వు నన్ను వెళ్ళగొడతావో నేను నిన్ను వెళ్ళగొడతాను చూసుకుందాం అని భాగమతి అంటుంది. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి అని మనోహరి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, గుప్తా గారు ఏదో ఒకటి చేసి ఆ ఫోటో అక్కడినుంచి తీసేయండి అని అరుంధతి అంటుంది. నేనేమీ చేయలేను బాలిక అని గుప్తా అంటాడు. అయినా భాగీ కి నిజం తెలిస్తే నాకే మేలు జరుగుతుంది గుప్తా గారు ఎందుకంటే ఫోటో చూడగానే భాగ్యకి నిజం తెలిసిపోతుంది అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ చెబుతుంది వాళ్ల కష్టం నాకు చెప్పుకోవచ్చు నా కష్టం వాళ్ళు వింటారు నాకు మంచే జరుగుతున్నప్పుడు ఆ ఫోటో ఎందుకు తీసేయాలి అని అరుంధతి అంటుంది. అలా జరగకూడదు ఆ ఫోటో నేను తీసేస్తాను బాలిక అని గుప్తా అంటాడు. ఇంతలో రాథోడ్ వచ్చి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లి పోయావు ఈ వేషం ఏంటి అని అంటాడు. చెప్పు బాగా ఇరుక్కుపోయారు అని అరుంధతి అంటుంది. ఇంతలో మనోహరి వచ్చి నువ్వెప్పుడొచ్చావ్ అయినా ఈ వేషం ఏంటి అని అంటుంది. మార్చుకుంటాను మేడం అని గుప్తా అంటాడు.
ముందు ఆ పని చెయ్ అని రాథోడ్ అంటాడు. కట్ చేస్తే, మనోహరి అరుంధతి ఫోటో చూసి షాక్ అవుతుంది. నువ్వు చచ్చి కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదే ఆరు నీ చెల్లి నా గురించి తెలుసుకొని పెళ్లి ఆపడానికి వస్తుంది అని కోపంగా మనోహరి నీలా ఇక్కడ ఫోటో పెట్టింది ఎవరు అని గట్టిగా అంటుంది. ఆరు ఫోటో హాల్లో ఉండకూడదా మనోహరి అని అమరేంద్ర అంటాడు.అంటే ఎవరు పెట్టారో తెలుసుకుని మెచ్చుకుందామని పిలిచాను అమర్ అని మనోహరి అంటుంది. పిల్లలు ఎప్పుడు స్కూలుకు వెళ్లిన వాళ్ళ అమ్మ ఎదురొచ్చేది ఇప్పుడు వాళ్ళ అమ్మ లేదు కాబట్టి తన ఫోటో అయినా చూసి వెళ్తారు అందుకే ఇక్కడ పెట్టాను అని అమరేంద్ర అంటాడు. చాలా మంచి పని చేశావు అమర్ నా మనసులో ఉన్నది నువ్వు చేశావు అని మనోహరి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, బాలిక ఆ బాలిక ఫోటో తీయొద్దంటుంది అని గుప్తా అంటాడు. ఇప్పుడు ఎలా గుప్తా గారుఏదో ఒకటి చేసి ఆ ఫోటో అక్కడి నుంచి తీసేయండి అని అరుంధతి అంటుంది.ఇంతలో పంతులుగారు వస్తారు. అతని చూసి ఆయనకి పెళ్లి ఘడియలు వచ్చాయని చెప్పింది ఈయనే కదా అని అంటుంది అరుంధతి.
లోపలికి వెళ్ళిన పంతులుగారు అయ్యా నేను చెప్పినట్టు పెళ్లి గడియలు వచ్చేసాయా అని అమరేంద్ర అని అడుగుతాడు. వచ్చేసాయి పంతులుగారు అని సంతోషంతో అంటుంది మనోహరి. ఆయనను చూస్తే పెళ్లి గడియలు వచ్చాయి ఈవిడకేమో పెళ్లి గడియలు లేవు అని పంతులుగారు ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే, భాగమతి అరుంధతిని చూసి అక్క నువ్వు ఏంటలా ఉన్నావ్ గుప్తా గారు మీ వేషం ఏంటండీ ఇలా ఉంది అని భాగమతి నవ్వుతుంది. ఈ బాలికను నువ్వు మాటలో పెట్టు నేను వెళ్లి ఫోటో తీసి ఎపిస్తాను అంటూ గుప్తా వెళ్ళిపోతాడు.సరే మిస్సమ్మ మనోహర్ని గుడికి తీసుకు వెళ్ళావు కదా అక్కడ ఏం జరిగింది అని అరుంధతి అడుగుతుంది. ఆ మనోహరి కి నా గురించి నిజం తెలిసిపోయింది అక్క అని భాగమతి అంటుంది. ఇప్పుడేం చేద్దాం మిస్సమ్మ అని అరుంధతి అంటుంది.
అక్క మనోహర్ని అడ్డుకోడానికి నీ సహాయం నాకు కావాలి అని భాగమతి అంటుంది. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నన్నే సహాయం అడుగుతున్నావా మిస్సమ్మ అని అరుంధతి ఆలోచిస్తుంది. కట్ చేస్తే, అయ్యా జాతకాలు బేసిగ్గా కలిశాయి అచ్చం మీ పెద్ద కోడలు అరుంధతి జాతకం ఉన్నట్టే ఈ జాతకం కూడా ఉంది అని పంతులుగారు అంటారు.మనోహరి అరుంధతి అక్క చెల్లెలు కాదు కదా పంతులుగారు అలా ఎలా ఒకలా ఉంటాయి అని అమరేంద్ర అంటాడు. తెలియదు బాబు కానీ జాతక మాత్రం బ్రహ్మాండంగా అలాగే ఉంది అని పంతులుగారు అంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!