NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi అక్టోబర్ 23 ఎపిసోడ్ 234: కనకం దెబ్బకు రుద్రాణి బలి.. కోడలి మీద మరోసారి నోరు పారేసుకున్న అపర్ణ.. కళ్యాణ్ అనామికులను చూసి అప్పు బాధ..

Brahmamudi 23 October 2023 today 234 episode highlights
Share

Brahmamudi అక్టోబర్ 23 ఎపిసోడ్ 234: నిన్నటి ఎపిసోడ్ లో,రాహుల్ దొంగతనం చేస్తూ దొరికిపోవడం, స్వప్న కాపాడడం జరుగుతుంది. ఇక అప్పు కళ్యాణ్ అనామికులతో షాపింగ్ కి వెళ్లి తిరిగి వస్తుంది. రాజ్ కావ్య కు సహాయం చేస్తాడు. కావ్య ఒక్కతే చాలా పనులు చేస్తుందని అందుకే తనకి నడుము నొప్పి వచ్చిందని రాజ్ మనసులో ఆలోచన మొదలవుతుంది. ఇక రుద్రాణి ఎలాగైనా తన రూమ్ లో నుంచి కనకాన్ని పంపించేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

Brahmamudi 23 October 2023 today 234 episode highlights
Brahmamudi 23 October 2023 today 234 episode highlights

ఈరోజు 234 వఎపిసోడ్ లో, కనకమ్ నితన రూమ్ లో నుంచి ఎలాగైనా పంపించేయాలి అనుకుంటుంది రుద్రాణి. కనకం చీరలన్నిటిని, కత్తెరతో కట్ చేస్తుంది. ఇక కనకం ఆ చీరలన్నీ చూసుకొని ఇదేంటి ఇలా అయిపోయాయి అని అనుకుంటూ ఉంటే ఎప్పటిలాగా ఎలుకలు కొట్టేసినట్టున్నాయి అని చెప్తుంది రుద్రాణి. ఇక రుద్రాణియే ఇదంతా చేసిందని కనకానికి అర్థమవుతుంది తనని ఎలాగైనా రూమ్ లో నుంచి పంపించేయాలని రుద్రాణి ప్లాన్ వేసిందని కనుకమ్ అర్థం చేసుకుంటుంది.

Brahmamudi 23 October 2023 today 234 episode highlights
Brahmamudi 23 October 2023 today 234 episode highlights

కనకం దెబ్బకు రుద్రాణి హడల్

ఇక రుద్రాణితన బట్టలన్నీ కత్తెరతో కట్ చేసిందని అనుకున్న కనకం వెంటనే తన నోటికి పదును చెప్పడం మొదలుపెడుతుంది. ఎలుక వంక పెట్టుకొని రుద్రాణిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కనకం. దొంగ ఎలుక నా చీరలన్నీ కొట్టేసింది దాని మూతి పలు రాలగొట్ట దాన్ని దుంప తెగ అని అంటుంది. కనకం ఎలుకను తిడితే ఏమొస్తుంది అని అంటుంది రుద్రాణి. ఏమొస్తుంది అంటున్నారా నా చీరలన్నీ పాడు చేసింది అని అంటుంది కనుకమ్. చీరలు పాడు చేస్తే ఎలుకని తిడతారా నీ జాగ్రత్తలు నువ్వు ఉండాలి కానీ అంటుంది రుద్రాణి. నా జాగ్రత్తలో నేను లేనా అని అంటుంది.దానికి చావు తెలివితేటలు ఎక్కువ వదిన మూసి ఉన్న కబోర్డులో కర్రల సంచి తాళ్ళలో కట్టేస్తే అయినా లోపలికి వెళ్లి తాళ్లన్నీ తెంపుకొని చీరలు అని బయటకు తీసి కత్తిరించి అలా పడేసింది. దాని జిమ్మడి పోను దాని తొక్కి చంపేయాలి. నాకు గాని ఒక్కసారి ఆ ఎలుక దొరికితే దాని ఏ కీలుకా కీలు కత్తెరతో కట్ చేసి పడేస్తాను అని అంటుంది. ఇక రుద్రాణి ఆ మాటలకి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక ఎందుకు ఇప్పుడు అదంతా అంటుంది కాదు వదిన నీకు తెలియదు కానీ చంపేస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళను ఇదే రూమ్ లో ఉంటాను ఆ ఎలుక నా చేతిలో అయిపోయింది అని బూతులు తిడుతూ ఉంటుంది కనుకమ్. ఆ మాటలన్నీ వినలేక రుద్రాణి చెవులు మూసుకుంటుంది.

Brahmamudi 23 October 2023 today 234 episode highlights
Brahmamudi 23 October 2023 today 234 episode highlights

నోరు జారీ నిజం చెప్పిన కావ్య..

ఇక స్వప్నకు టాబ్లెట్ ఇచ్చే టైం అవుతుంది. కనకం స్వప్న టాబ్లెట్స్ వేసుకోమని ఇస్తుంది. అప్పుడే టాబ్లెట్ ఎందుకమ్మా అని అంటుంది స్వప్న. మీ నాన్నగారు మీరు కడుపులో ఉన్నప్పుడు నాకు ఇలానే గంట గంటకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ అన్ని ఇవ్వబట్టే మీరు ఇంత చక్కగా అందంగా పుట్టారు. నోరు మూసుకొని వేసుకో అంటుంది కనుకమ్. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి టాబ్లెట్ వేసుకోకుండా అని అనుకుంటుంది స్వప్న మనసులో అదే టైంకి కావ్య అక్కడికి వస్తుంది. కావ్యా నువ్వు వెళ్లి జ్యూస్ తీసుకురావే అని అంటుంది స్వప్న ఇప్పుడు నీకు ఎన్నో నెల అనుకుంటున్నావు నాలుగో నెల నిండిన తర్వాత ఆర్డర్స్ వేయొచ్చు ఇప్పుడు నువ్వు లేచి నీ పళ్ళు నువ్వు చేసుకోవచ్చు అన్ని పనులు కావేరి చెప్పాల్సిన అవసరం లేదని స్వప్నకి క్లాస్ పీకుతుంది కనుకమ్. అసలు నీకు జాగ్రత్తనే లేదు కడుపులో బిడ్డ ఉంటే ఎలా ఉండాలి ముందు ఇక టాబ్లెట్ వేసుకో, అయినా నీ పనులు చూసుకోవడానికి కదా నన్ను ఇక్కడ ఉంచింది నీకు అన్ని నేనే నర్సు నేనే అన్నీ నేనే, నేను ఉండగా నువ్వు ఎందుకు కావేరి పనులు చెబుతున్నావు ముందు చెప్పిన పని చెయ్ అని అంటే, నువ్వు ప్రజలు అయ్యేదాకా నా మాటే వినాలి నేను చెప్పింది చెప్పినట్లు వినాలి లేదంటే నా సంగతి తెలుసు కదా అని అంటుంది కనుక స్వప్నతో,టాబ్లెట్ వేసుకోబోతూ ఉండగా కావ్య అసలు కడుపు ఉంటే కదమ్మా, జాగ్రత్త ఉండడానికి అని అంటూ జ్యూస్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఆ మాటకి ఒకసారిగా షాక్ అవుతుంది కనకమ్, స్వప్న కూడా అంత మాట నేసిందేంటిది అని షాక్ అవుతుంది.స్వప్న కవర్ చేయడానికి వెంటనే అమ్మ నేను కేరళ ఉంటున్నాను కదా అందుకని కావ్య అలా మాట్లాడుతుంది అని అంటుంది.అబద్ధాలు అలవోకగా చెప్పేస్తున్నాం అక్క ఆ కల నాకు అలవాటు లేదులే అని కావ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే కనకం కావ్యా ని అరుస్తుంది.

కనకం కావ్య మీద ఫైర్..

శుభమా అని నేను శ్రీమంతం గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి ఇలాంటి మాటలు మాట్లాడావు. ఇలా అశుభాలు మాట్లాడితే ఎలా కుదురుతుంది అయినా స్వప్న కాదే ఇలాంటి మాటలు మాట్లాడేది మరి నీకేమైంది
నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలాగూ అనికనకం కావ్య ని తిడుతుంది. ఇక వెంటనే తొందరపడి నోరు జారింది ఏమవుతుందో ఏంటో ఎలా మాట్లాడాలో దానికి చెప్పమ్మా అంటూ స్వప్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడు లేనిది అలా నోరు జారిందేంటి అని కనకం కూడా ఆలోచిస్తుంది మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా బుద్ధి దాని కుండాలి కదా అమ్మ అంటుంది కనుకమ్. కావాలనే స్వప్న కనకంకావిని తిట్టాలి అన్నట్టుగా మాట్లాడుతుంది ఇక భగవంతుడా స్వప్న పండంటి బిడ్డకు జన్మనివ్వాలి. ఏమీ జరగకుండా చూడు తధాస్తు దేవతలు ఉంటారు మనం జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకొని భయపడుతూ ఉంటుంది కనుకమ్. ఇక కావ్య మాత్రం అదంతా చూసి కన్నతల్లిని కూడా మోసం చేస్తుంది స్వప్న ఎలాగైనా సరే వాళ్ళ అమ్మకి ఇదంతా తెలిస్తే ఏమవుతుందో అనే కంగారుగా బాధపడుతూ ఉంటుంది.

Brahmamudi 23 October 2023 today 234 episode highlights
Brahmamudi 23 October 2023 today 234 episode highlights

కళ్యాణ్ అనామికలను చూసి అప్పు బాధ..

ఇక అప్పు ని తీసుకొని కళ్యాణ్ అనామిక షాపింగ్ కి వెళ్లి, తర్వాత ఫోటోషూట్ కోసం ఒక మంచి ప్లేస్ కి వెళ్తాడు ఇక ఎలాగో ఫోటోలు తీసేది అప్పునే కావడంతో బిందాస్ గా ఫోటోలు తీయించుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు కళ్యాణ్ అనామిక, ఫోటోలకి దూరంగా నిలవడంతో కళ్యాణ్ డైలాగ్ చేస్తాడు మనం ఏమైనా రేషన్ కార్డు కోసం ఫోటో దించుకుంటున్నామా ఏంటి ఆ ఫీలింగ్ ఏది అని అంటాడు కళ్యాణ్ అనామిక తో, అన్ని ఫీలింగ్స్ అవే వస్తాయి లే ముందు మీరు వెళ్ళండి అని అంటుంది అప్పు ఇక అప్పు ఫోటోలు తీస్తుంది మనం మంచి ఫోజులిద్దం కదా అంటాడు కళ్యాణ్ అనామికతో ఇక ఇద్దరూ కలిసి మంచి ఫోజులిస్తూ ఉంటారు అప్పు చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ రొమాంటిక్గా అలా ఉండడం చూసి అపుడు చాలా బాధపడుతుంది. అనామిక చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని భుజం మీద తలవాల్చి ఇలా రకరకాలుగా ఫోజులిస్తూ ఒకళ్ళు కలలోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉంటే ఇదంతా చూసి అప్పు కన్నీళ్లు పెట్టుకునే ఎంత పని చేస్తుంది.

కోడలి పై నోరు జారిన అపర్ణ..

ఇక మరోవైపు కిచెన్ లోనికి వెళ్లిన కావ్య పాత పనిమనిషిని చూసి షాక్ అవుతుంది వామ్మో శాంతా వచ్చింది ఏంటి ఇప్పుడు గాని అత్తయ్య చూసిందా అని కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడే అక్కడ అపర్ణ వస్తుంది శాంతాన్ని చూసి కళ్ళు ఎర్ర చేస్తుంది. ఏమీ తెలియనట్టు కాదు అక్కడ నుంచి తప్పించుకోవాలని పైకి వెళ్తూ ఉంటే పనిమనిషిని చూసి పంచాయతీ మొదలు పెడుతుంది అపర్ణ ఏ ఆగు ఇటు రా అని కావ్య అని పిలుస్తుంది అమ్మ అయిపోయా నేను ఇప్పుడు అని అనుకుంటుంది కావ్య. వెంటనే పని మనిషిని కూడా ఇలా రా అని పిలుస్తుంది అపర్ణ ఇద్దరు వచ్చి అక్కడ నిలబడతారు నిన్ను ఎవరు రమ్మన్నారు అని అంటుంది. వెంటనే పనిమనిషి శాంతా ఏమీ మాట్లాడకుండా అలానే ఉంటుంది నిన్ను ఎవరు రమ్మన్నారు నిన్ను పనిలో నుంచి తీసేసాను కదా మళ్ళీ ఎవరు పిలిచారు ఈ కావ్య పిలిచిందా అంటూ అపర్ణ స్టార్ట్ చేస్తుంది. ఇదంతా అప్పుడే కిందకు దిగుతున్నారు ఇద్దరు చూస్తారు వెంటనే రుద్రాణి రాహుల్తో ఇప్పుడు చూడు నా డైరెక్షన్ ఎలా ఉంటుందో మంచి సీన్ మిస్ అవుతావ్ నేను పెట్టే అగ్గి ఎలా డ్రా చేసుకుంటుందో చూడు అని అంటుంది. వెంటనే రుద్రాణి ఏంటి వదిన ఏం జరిగింది అంటూ మొదలుపెడుతుంది కనిపించడం లేదా లేదంటే నేను అన్న మాటలు వినిపించట్లేదా అంటుంది అపర్ణ శాంత నువ్వేంటి ఇక్కడ నీకు నో ఎంట్రీ అని మా వదిన చెప్పింది కదా అయినా మళ్ళీ ఎలా వచ్చావు అంత ధైర్యం నీకు ఎలా వచ్చింది. నువ్వు ఇక్కడికి రావడానికి ఎవరు కారణం అంటూ రుద్రాణి అడుగుతుంది నువ్వేనా నువ్వు పని మనుషులని అపాయింట్మెంట్ చేసుకునే అంత పెద్దదానివి అయిపోయావు కావ్య అని అంటుంది. పనిమనిషి శాంత కాదమ్మా కావ్యమ్మగారు కాదు నన్ను పిలిచింది అని పనిమనిషి చెపుతుంది మరి ఎవరు నా మాట లెక్కచేయకుండా నా మాటకు విలువకుండా నిన్ను పనిలో పెట్టింది ఎవరు అని అపర్ణ ఒక రేంజ్ లో అరుస్తూ ఉంటుంది. వెంటనే రుద్రాణి కచ్చితంగా కావ్యయుంటుంది వదిన అని అంటుంది. ఇక కోడల్ని అపర్ణ కోప్పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి రాజీ ఎంట్రీ ఇస్తాడు.

Brahmamudi 23 October 2023 today 234 episode highlights
Brahmamudi 23 October 2023 today 234 episode highlights

కొడుకు మీద కూడా నోరు పారేసుకున్న అపర్ణ..

ఇక రాజ్ ఎంట్రీ ఇవ్వగానే నువ్వా నీకు ఒకప్పుడు ఇంట్లో ఏం జరిగిందో తెలుసు ఎంత రచ్చ జరిగిందో కూడా తెలుసు, మీ అమ్మ పనిమనిషిని ఇంట్లో నుంచి తీసేసింది అని తెలుసు అంతా చూసి మళ్ళీ తీసేసిన పనిమనిషిని తీసుకొచ్చామంటే మీ అమ్మకి ఇంట్లో విలువ ఉందా ఆమె అధికారానికి అర్థం ఉందా అంటూ రుద్రాణి రాజుతో అంటూ ఉంటుంది. రాజ్ ఇప్పుడు ఏం జరిగిందత్తా అని అంటాడు మా అమ్మని ఎందుకలా రెచ్చగొడుతున్నావ్ అంటాడు చూశావా వదిన నీ కొడుకు ఎంత మాట అంటున్నాడు నీ పర్మిషన్ తీసుకోకుండా నీతో ఒక మాట చెప్పకుండా పనిమనిషిని తీసుకురావడమే కాక నేను అడిగితే నిన్నే రెచ్చగొడుతున్నాను అంటున్నాడు వదిన ఇది నీకు ఎలా కనిపిస్తుందో అంటుంది. వెంటనే ధాన్యలక్ష్మి కావాలనే రుద్రాణిని మాగోడా నీ ఓవరాక్షన్ అర్థం అవుతుంది అని అంటుంది.అయినా ఇంట్లో నీ మర్యాదకు ఏం తక్కువ లేదులే అంటుంది దాని లక్ష్మి. అయినా నీకెందుకు అంత సంతోషం నీతోడి కోడల్ని మాట చెల్లకుండా ఇంట్లో పనిమనిషిని తీసుకొచ్చి పెడుతుంటే నువ్వు మాత్రం ఏమీ మాట్లాడవు అని కావాలని ధాన్యలక్ష్మిని అంటుంది రుద్రాణి. ఇక్కడ స్లేం జరుగుతుంది అని ప్రకాశం అంటూ ఉంటాడు ఇక్కడ ఏం జరిగినా అన్నయ్య ఆడవారి మాటలకు అర్ధాలే వేరు అన్నట్టు నీకు ఇక్కడ జరిగేది ఏమీ అర్థం కాదు ఈ మధ్యలో దూరమాకు అని అంటుంది అవును నాకేం తెలుస్తాయి ఈ ఒకళ్ళ మాటలు ఒక ఇంకొక లాగా అర్థం చేసుకొని చెప్పే నీకే తెలుస్తాయి లే అని అంటుంది ధాన్యలక్ష్మి.ఇంతలో అపర్ణాదేవి ఇంకా మీ గొడవ ఆపుతారా అని అంటుంది శాంత ఎందుకు వెళ్లిపోయిందో తెలుసా నేను ఎందుకు తీసేసానో తెలుసా అంటూ అపర్ణ అడుగుతుంది అపర్ణ రాజ్ ని, రాజ్ అమ్మా నాకు అంతా తెలుసు నువ్వు ఆరోజు శాంత పనిమనిషిని ఎందుకు తీసేసావో ఈ కళావతిని ఎందుకు అంటున్నావు అన్నీ నాకు తెలుసు నువ్వే ఇద్దరినీ అర్థం చేసుకోలేకపోయావు అంటాడు రాజ్. వెంటనే రుద్రాన్ని చూసావా వదిన వింటున్నావా ఇద్దరి తప్పు లేదంట ఆ పనిమనిషికి భార్యకి ఇచ్చేది బానే గౌరవిస్తున్నాడు నీ కొడుకు నీకు తప్ప అందరికీ గౌరవం ఇస్తున్నాడు అని రచ్చబడుతుంది రుద్రాణి. వెంటనే పిన్నిఅన్నట్టుగానే నువ్వు కావాలనే మా అమ్మని రెచ్చగొడుతున్నావు అని అంటాడు రాజ్.అయినా ఇది నాకు మా అమ్మకి జరిగే విషయం మధ్యలో నువ్వు రావాకు అత్త అని అంటాడు. అయినా ఇంట్లో గొడవ జరుగుతుంటే మా వదిన తరఫున మాట్లాడడానికి ఎవరూ లేకపోతే నేను మాట్లాడడం తప్ప అని అంటుంది రుద్రాణి. నువ్వు మీ అమ్మ పర్మిషన్ తీసుకోలేదు ఆమె నిర్ణయాన్ని నువ్వు అధికమించావు అది తప్పు కదా అయినా నేను మాట్లాడితే తప్పు వచ్చింది నాకు నిలదీసే స్వతంత్రం కూడా లేదా ఇంట్లో అని అంటుంది.

కళావతి వైపు మాట్లాడిన రాజ్..

ఇప్పుడు ఇదంతా అనవసరం రాజ్ జరిగిందేదో జరిగింది నేను అడిగే మాటలకి నువ్వు స్ట్రైట్ గా సమాధానం చెప్పు అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు నన్ను అడగకుండా ఈ పనిమనిషి ఎందుకు ఇంట్లోకి రానిచ్చావ్ నేను తీసుకునే నిర్ణయానికి ఎందుకు నువ్వు అడ్డుపడుతున్నావ్ అని అడుగుతుంది అపర్ణ.కళావతి కోసం ఈ ఇంట్లో ఒకరు కాఫీ తాగుతారు ఒకరికి తాగుతారు ఇక్కడ జ్యూస్ తాగుతారు ఒకరు ఇంకొక కూర నచ్చదు అంటారు ఒకరి ఇంకోటి ఏదో చేయమంటారు ఇంటిల్లిపాది అన్ని సమర్పించుకుంటూ ఇంటర్ జాకిరి మొత్తం కావ్య చేయాల్సి వస్తుంది అంటాడు రాజ్.అప్పుడు ఇంకో పని మనిషిని పెట్టుకోవచ్చు కదా మళ్లీ నేను తీసేసిన శాంతనే ఎందుకు తీసుకువచ్చావ్ అంటుంది అపర్ణ.కొత్త పనిమనిషి అయితే మళ్లీ అంతా మొదటినుంచి అని చెప్పి చేయించుకోవాలి ఈ శాంతకైతే అన్నీ తెలుసు కొత్తగా నేర్చుకోవాల్సిన పనిలేదు అంతే కాదు తాతయ్యకి ఏ టైం కి ఏ టాబ్లెట్ వేయాలో కూడా కళావతికి తెలుసు ఈ పనుల్లో బిజీగా ఉండి తాతయ్య సంగతి మర్చిపోవద్దు ఆలస్యం చేస్తూ దొరకడం ఏదైనా జరుగుతుంది అందుకే ఇంకో పని మనిషి పెట్టుకోవాలని ఆలోచన నాకు రాలేదు ఇంటి గురించి తెలిసిన మనిషి అయితే మంచిది అనుకున్నాను.అందుకే శాంతిని మళ్ళీ పిలిపించాను అంటాడు రాజ్. నువ్వు చేసిన పని తప్పు కాదు రాజ్, అవును రాజ్ మీ అమ్మకి చెప్పి చేయడం పోవడమే తప్పుఅని రుద్రాణి అంటుంది. నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు మీ అమ్మకు ఒక మాట చెప్పాల్సిందిఅని రుద్రాణి అంటే అమ్మమ్మ గారు వెంటనే,ఏంటి తప్పు ఎవరు తప్పు నీదా నీ కోడలుదా,కావ్య కూడా నీ కోడలే కదా, పడకగది దాటకుండా మంచాల మీదే అన్నీ తెప్పించుకొని తినే రకం అయితే అందరం ఆకలితో మాడి చచ్చేవాళ్ళు అన్ని పనులు తన్ను ఎత్తిన మీద వేసుకొని తన గదికి వెళ్లడానికి రాత్రి 11 దాటుతుంది తెల్లవారి ఐడెంటికే లేస్తుంది అందరికీ అన్ని ఇస్తుంది అలా అన్ని పనులు వేసుకొని చేస్తుంటే తన భార్య కష్టపడడం చూడలేక పాత పనిమనిషిని రప్పించాడు. మీరు అది అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే ఎలాగూ. అయినా ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకు అని అంటుంది ఇందిరా దేవి. ఇక రాజ్ తన గదిలోకి వెళ్ళిన తర్వాత కావ్యాన్ని పనులు కంప్లీట్ చేసి అప్పుడు తన గదిలోకి వెళ్తుంది.వెంటనే పరుపు మంచం పక్కన వేసుకొని పడుకుంటుంది. ఇందిరా దేవి పాలు కావ్య మర్చిపోయినందుకు తన గదికి తీసుకువెళ్లి డోర్ కొడుతుంది వెంటనే రాజ్ కంగారు పడతాడు ఎక్కడ అమ్మమ్మ గారు లోపలికి వచ్చి కావ్య విడిగా పడుకోవడం చూస్తుందో అని.

రేపటి ఎపిసోడ్ లో అమ్మమ్మగారి లోపలికి వచ్చే హడావిడిలో పరుపుని గోడ బయట పడేస్తాడు రాజ్. ఆ పరుపు ప్రకాష్ మీద పడి ప్రకాష్ కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే ప్రకాశం లేపడానికి కిందకు వెళ్దాం అనుకుంటే హాల్లో అందరూ ఉంటారు ఇక రాజ్ కంగారు పడుతూ ఉంటాడు.


Share

Related posts

Akkineni Akhil: మరో కొత్త ప్రాజెక్టు లైన్ లో పెట్టిన అక్కినేని అఖిల్..?

sekhar

BRO Movie Review: మెగా మల్టీస్టారర్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల “బ్రో” మూవీ రివ్యూ..!!

sekhar

Sarath Babu: కాస్త మెరుగుపడిన సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం..!!

sekhar