Brahmamudi 9 ఆగస్ట్ 170 ఎపిసోడ్: దుగ్గిరాల కుటుంబానికి చెందిన కోడలు , ఇలా బయట పనిచేస్తుందంటే పెద్ద న్యూస్ అవుతుంది ఇది తనకి బాగా పనికి వస్తుంది అని అనుకుంటాడు రాహుల్.. కావ్య తన పుట్టింట్లో తన కుటుంబ సభ్యులతో కలిసి మట్టి తొక్కుతుంది. వాళ్ళతో సరదాగా డాన్స్ చేస్తుంది. అప్పు నీళ్లు పోస్తుండగా కావ్య వాళ్ళ నాన్న అమ్మ అందరూ మట్టి తొక్కుతారు.

ఆ సీన్స్ ను చూసి రాహుల్ సంతోషిస్తాడు. ఆ వీడియో ను అర్జెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఒక వీడియోను క్రియేట్ చేసి అది సోషల్ మీడియాలో వచ్చేలాగా చేయమని తన మనిషికి చెబుతాడు రాహుల్. ఆ మాటలు విన్నా రుద్రని ఆ వీడియో ఏది నాకు చూపించమని అడుగుతుంది. ఈ వీడియో మనకు చాలా ప్లస్ అవుతుంది అని రుద్రాణి అంటుంది.

కావ్య చేస్తున్న పనులను మీడియా లో చూపించి దుగ్గిరాల కుటుంబం నరకయాతన పెట్టడం వల్లే కావ్య ఇలాంటి పనులు చేస్తుందా అని మీడియాలోకి వస్తుంది. పైకి మాత్రమే వాళ్ళు కావ్య ని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకుంటున్నారు. తను తన నాన్నతో కలిసి మట్టి పని చేస్తూ ఉండగా ఆ వీడియోను లో ఆ సీన్స్ కొన్ని సెట్టింగ్స్ వస్తాయి కాళ్లకు ఎంత కష్టం వస్తే తన కుటుంబంతో కలిసి మట్టి పని చేస్తుంది. మీరే ఒకసారి ఆలోచించండి . ఆ కుటుంబం తనని ఎంతగా ఇబ్బంది పడుతుందో అంటూ మీడియాలో దుగ్గిరాల కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతూ కావున హైలెట్ చేస్తూ ఉంటారు . టీవీలో ప్లే అయ్యేలా రాహుల్ చేస్తాడు ఇక ఆ వీడియోను రుద్రాణి అందరూ చూసే లాగా పెడుతుంది. ఇదేంటి వదిన నీ కోడలు టీవీలో కనిపిస్తుంది అంటూ రుద్రాణి రాజు వాళ్ళ అమ్మను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది.

Krishna Mukunda Murari: ముకుంద గుచ్చిన నల్లపూసలు కృష్ణ మెడలో వేసిన మురారి.. సూపర్ ట్విస్ట్..
దాంతో రుద్రాణి అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఈ విషయం గురించి మాట్లాడతారు. ముందుగా రాజ్ వాళ్ళ అమ్మ ఈ విషయంపై చాలా సీరియస్ అవుతుంది కోడల్ని పుట్టింటితో సంబంధం ఉండకూడదు అంటే మీరు ఎవరు నా మాట వినలేదు ఇప్పుడు చూసారా ఏమైందో వాళ్ల వల్లే మన ఇంటి పరువు పోతుంది. ఇన్నాళ్లు నేను ఇంటి కోడలుగా వచ్చాక ఏ రోజైనా ఇలాంటివి జరిగిందా వీళ్ళు వచ్చాక ఇలా జరిగిందా అంటూ రాజ్ వాళ్ళ అమ్మ కావ్యను చెడమడ వాయిస్తుంది. తను వచ్చాక మాట్లాడుకోవచ్చు అంటూ అందరూ సీరియస్ గా ఉంటారు.

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…
సరిగ్గా అదే సమయానికి కావ్య తన ఇంటి నుంచి బయలుదేరుతుంది. వాళ్ళ అమ్మ రాజ్ కి ఇష్టమైన సున్నుండలు చేసి కావ్యకు ఇస్తుంది. కావ్య సున్నుండలు తీసుకుని ఇంటికి వస్తుంది. తను ఇంట్లోకి వచ్చేసరికి అందరూ సీరియస్ గా ఉంటారు. ఏమైంది చిన్న అత్తయ్య అని కావ్య అడుగుతుంది. చెప్పాల్సిన వారు చెబుతారు అని అంటుంది ఆమె. అంతలోకి రాజ్ వాళ్ళ అమ్మ కావ్యను అరుస్తుంది. అసలు ఏం జరిగిందో అర్థం కాక కావ్య సతమతమవుతూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి నువ్వేం చేసావో నీకు తెలియదా ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అంటూ వాళ్ళ నాన్నతో కలిసి మట్టి తొక్కిన వీడియోను చూపిస్తుంది. ఇందులో తప్పేముంది అన్నట్టుగా తను అంటుంది మా కుటుంబ పరువు తీసేసావని అందరూ చివాట్లు పడుతూ ఉంటారు.

మరోవైపు రాజ్ వాళ్ళ మేనేజర్ వచ్చి సర్ ఒక్కసారి ఈ వీడియో చూడండి అంటూ కావ్య మట్టి తొక్కిన వీడియోను చూపిస్తాడు. ఆ వీడియో చూసిన రాజ్ కోపంగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతాడు. ఇంట్లో కావ్య తనను తాను సమర్ధించుకోవడం చూసిన రాజ్ తనకి చివాట్లు పెడతాడు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.