NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi March 22 2024 Episode 364: కావ్యను పుట్టింటికి తీసుకువెళ్తానన్న కనకం.. రాజ్ బిడ్డకు తల్లి ఎవరని ప్రశ్నించిన కావ్య?

Brahmamudi Today Episode March 22 2024 Episode 364 highlights

Brahmamudi March 22 2024 Episode 364: రాజ్, కావ్యల పెళ్లి రోజుకి అన్ని ఏర్పాట్లు చేస్తే రాజ్ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చి, ఒక బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డ నా రక్తం అని అందరికీ పరిచయం చేస్తాడు దుగ్గిరాల వారసుడిగా ఇకముందు ఈ ఇంట్లోనే పెరుగుతాడని షాక్ ఇస్తాడు. అదంతా చూసి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ రాజ్ ని నిలదీస్తారు ఈ బిడ్డ ఎవరని, రాజ్ వివరాలు ఏమి చెప్పకుండా ఈ బిడ్డ నా బిడ్డనని ఇకమీదట ఇక్కడే ఉంటాడని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక కావ్య మాత్రం రాజ్ దగ్గరికి వెళ్లి అందరూ ఈ బిడ్డ గురించి మాత్రమే అడుగుతున్నారని ఈ బిడ్డను కన్న తల్లి గురించి ఎవరు అడగడం లేదని అందరూ మర్చిపోయారు అని ఇప్పుడు మీరు ఈ బిడ్డకు కన్నతల్లి గురించి నాకు చెప్పాలని రాజ్ నీ నిలదీస్తుంది. రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు మిమ్మల్ని అడుగుతుంది ఈ బిడ్డకు తల్లి ఎవరు నేను అడిగే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి మీరు నేను నా జీవితానికి సంబంధించిన ఒక విషయాన్ని చెప్తాను అన్నారు అది ఈ విషయమే అని అడుగుతుంది. రాజ్ అందుకు సైలెంట్ గా ఉండిపోతాడు.

Brahmamudi Today Episode March 22 2024 Episode 364 highlights
Brahmamudi Today Episode March 22 2024 Episode 364 highlights

నిన్నటి ఎపిసోడ్ లో ఇక ఇందిరా దేవి ఏరా నువ్వు ఇదంతా అబద్ధం చెప్తున్నావు కదా నాటకాలు ఆడుతున్నావు కదా కావ్య ని ఏడిపించడానికి ఇలా చేస్తున్నావు కదా నువ్వు నీ బిడ్డ నీ బిడ్డని పరిచయం చేసి ఈ నెలల బిడ్డతో నువ్వు ఇలా రావడం ఏంటి అని ఇందిరాదేవి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అన్నయ్య నువ్వు వదిన ఆటపట్టించడానికి ఇలా చేస్తున్నావు కదా అని అంటాడు. రాజ్ నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు కానీ నువ్వు ఏదో నిజం దాచి పెడుతున్నావ్ అని మాత్రం అర్థం అవుతుంది నువ్వు చెప్పేది నిజం కాదు నీకు జీవితంలో మాకు ఎవరికీ తెలియని మరో చీకటి కోణం ఉందంటే మేము నమ్మము. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్మను రాజు అని ధాన్యం అంటుంది. వెంటనే ప్రకాశం చూసావా రాజ్ కళ్యాణ్ విషయంలో మీ పిన్ని వాడికి అన్యాయం జరిగిందని నేను అపార్థం చేసుకుంది కానీ నీ వ్యక్తిత్వం మీద నువ్వే మచ్చ వేసుకుంటున్నా కానీ తను నమ్మలేక పోతుంది తనే కాదు రాజ్ ని ఇంట్లో ఎవరూ నమ్మరు తప్పు చేశాడు అంటే ఎవరైనా నమ్ముతారు కానీ నువ్వు తప్పు చేశావంటే నువ్వు చెప్పినా కూడా మేము నమ్మలేకపోతున్నాము అని అంటాడు ఇక మరోవైపు కృష్ణమూర్తి దేవుడే తప్పు చేశాడు అంటే దేవుడికి గతం ఉంటుందంటే ఎవరైనా నమ్ముతారా ఇదంతా ఏదో మాయలా ఉంది నా మనసు ఒప్పుకోవడం లేదు బాబు అని అంటాడు. ఇక కనకం ముందుకు వచ్చి బాబు మీరు వస్తారని ఇద్దరూ కలిసి వేడుక జరుపుకుంటే చూసి ఆశీర్వదించి వెళ్దామని మేమంతా ఎదురు చూస్తుంటే నువ్వు ఇలా వచ్చి అందరి గుండెలు పగిలేలాగా ఇలా మాట్లాడుతున్నారు అసలు మా పరిస్థితి పక్కన పెడితే నా బిడ్డ ముఖం చూడండి ఒకసారి తను మౌనంగా నిలబడిపోయింది అని అంటుంది.

Brahmamudi Today Episode March 22 2024 Episode 364 highlights
Brahmamudi Today Episode March 22 2024 Episode 364 highlights

రాజ్ నేను అబద్ధాన్ని నిజమని చెప్పలేను అలాగని నిజాన్ని కూడా అబద్ధమని చెప్పలేను ఇది నిజం ఇదే నిజం ఈ బిడ్డ నా బిడ్డ ఇక నుంచి ఈ ఇంటి వారసుడు గానే పెరుగుతాడు అని అంటాడు ఇక వెంటనే కళావతి ఏడుస్తూ మౌనంగా అల్లాడిపోతుంటుంది ఇందిరా దేవి కూడా స్టేజ్ మీదకి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ రా మనిషిలాగ మాట్లాడు ఒక అమాయకురాలి గొంతుకు వస్తావా ఇంకో ఆడదానితో బిడ్డని కట్టావా నేను దీని కలలో కూడా నమ్మలేని రాజ్ అని అంటుంది. ఒకసారి కావ్య ముఖం చూడు ఆ భాగ్యరాలని చూసి తనని మోసం చేయలేవు నువ్వు అది నీకు చేతకాదు అని అంటుంది. అదేంటమ్మా వాడే స్వయంగా చెప్తుంటే ఇంకా నమ్మరేంటి ఇది ఎవరో చెప్పి నిజం కాదు వాడే స్వయంగా చెప్పిన నిజం అని రుద్రాణి అంటుంది. రుద్రాణి రెచ్చిపోతుంది ఇన్నాళ్లు నా కొడుకు నేను సరిగ్గా పెంచలేదని దుమ్మెత్తి పోసారు కదా ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు రాజ్ గురించి ఏమంటారు నువ్వు చెప్పు వదిన నీ కొడుకు నేను ఇలానే పెంచావు.

Brahmamudi Today Episode March 22 2024 Episode 364 highlights
Brahmamudi Today Episode March 22 2024 Episode 364 highlights

వాడికన్నా నా కొడుకైన తప్పు చేసిన ఆ తప్పు ఒప్పుకొని స్వప్నని పెళ్లి చేసుకున్నాడు. నీ కొడుకు భార్య ఉండగానే ఇంకో ఆడదాన్ని తల్లిని చేసి ఏకంగా బిడ్డని ఇంటికి తీసుకువచ్చాడు పైకి కనపడని మాయగాడు నీ కొడుకు ఇదేనా నీ పెంపకం అని అంటుంది రుద్రాణి. ఇంకా అల్లాడిపోతుంది అపర్ణాదేవి. రుద్రాణి మాత్రం మాటలు అంటూనే ఉంటుంది ఇదిగో అపర్ణ వదిన ఇన్నాళ్లు నా కొడుకు రారాజు మహారాజు ఇలాంటి వాడు ఈ లోకంలో లేడు, యుద్ధాలు చేసి రాజ్యాలు గెలుస్తాడు అని ఏదైతే చెప్పారు కదా ఇంకొకసారి నీ పెంపకం గురించి మా ముందు గొప్పలు చెప్పకు అంటూ కావాలని అపర్ణాదేవితో రుద్రాణి అంటూ ఉంటుంది. వెంటనే అపర్ణాదేవి చూశావా మీ అత్త ఏం మాట్లాడుతుందో వింటున్నావా వాళ్ళు అలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది నువ్వే ఇలాంటి పాపిష్టి పని ఎలా చేయగలిగావు నీకు నీ భార్య గుర్తుకు రాలేదా ఈ వంశం గుర్తుకు రాలేదా ఏంటి పరుగు ప్రతిష్టలు గుర్తుకు రాలేదా? అని అపర్ణాదేవి రాజ్ తో అంటుంది అయినా రాజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు ఏంటి మీరు అలా చూస్తూ ఉంటారు అడగరు ఏంటి అని అపర్ణాదేవి భర్తతో అంటుంది వెంటనే సుభాష్ వాడి నీ ఏం అడగాలి అపర్ణ తప్పుఒప్పు అన్ని తెలిసినవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అందరి ముందు దోషిగా నిలబడినంతమాత్రాన నిజం అబద్ధం అయిపోదు ఈ క్షణం గతం లాగా మారిపోదు తల్లిగా నువ్వెలా ఓడిపోయావో తండ్రిగా నేను అలానే ఓడిపోయాను. ఓడిపోయిన వాడి మాట్లాడి గెలవలేడు కానీ నా కోడలికి ఎవరు సమాధానం ఇస్తారు ఎవరు ఆ మనసుని సమాధాన పరుస్తారు అని ఆవేశంగా సుభాష్ అంటాడు వెంటనే కనకం స్టేజి మీద వెళ్లి కావ్య పక్కకు చేరి అల్లాడిపోతూ మాట్లాడుతూ ఉంటుంది అయ్యో మేము మా బిడ్డని ఇంటి కోడలిగా పంపించినప్పుడు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు కానీ మీరు అది కడుపులో పెట్టుకొని కష్టాల్లో ఆదుకున్నారు అలాంటి విశాలమైన మనసున్న మీరు ఇలాంటి పని చేయడం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు నా బిడ్డ గతి ఏమైపోవాలి అనుకుంటున్నారు అని కనకం అంటుంది.

Brahmamudi Today Episode March 22 2024 Episode 364 highlights
Brahmamudi Today Episode March 22 2024 Episode 364 highlights

వెంటనే కృష్ణమూర్తి కనకం మాటలకు అడ్డుపడతాడు. నువ్వు ఆవేశంతో ఏమీ అనొద్దు అని అంటాడు వెంటనే రాజ్ వైపు తిరిగి బాబు మాకు ముగ్గురు అమ్మాయిలు తర్వాత ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు అప్పటినుంచి మాకు అబ్బాయిలు లేరని మేము బాధపడుతూ ఉండేవాళ్ళ ఏరోజైతే నువ్వు వచ్చి మాకు కొడుకు లేని లోటు తీర్చావో ఆరోజు నుంచి మేము బాధపడలేదు. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే మేము ఏమైపోవాలి బాబు అని అంటాడు ఇక వెంటనే సీతారామయ్య ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవేంటి నువ్వు ఇలాంటి పని చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను రాజ్ అని అంటాడు. ఇంతమంది నమ్మకాన్ని నువ్వు ముక్కలు చేశావు అని ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అన్నయ్య నువ్వు రాముడివి అనుకున్నాను నేను మాత్రం లక్ష్మణ్ లాగే నీతో ఉన్నాను కానీ నువ్వు కూడా మామూలు మనిషి అయిపోయావా అని అంటాడు కళ్యాణ్ బాధగా అర్థమైంది నువ్వు ఎవరికి సమాధానం చెప్పవు చెప్పక్కర్లేదు కానీ నేను యెడల బతకాలని అనుకుంది ఆ పిచ్చిది దానికైనా సమాధానం చెప్పి తీరాలి అలాంటి బాధ్యత నీ మీద ఉంది ఏం సమాధానం చెప్తావో చెప్పుకొని భార్యకి అని అంటుంది ఇందిరాదేవి కోపంగా,నేను ఒక ప్రశ్నగా మారిపోయాను నా దగ్గర సమాధానం లేదు మీ అందరి ముందు దోషిగా నిలబడ్డాను నా దగ్గర పరిష్కారం కూడా లేదు అని అంటాడు రాజ్ వెంటనే రాజ్ కావ్య వైపు చూస్తూ ప్రతిసారి నీ దగ్గర గెలవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను చివరికి ఓడిపోయాను చిత్రంగా నువ్వు గెలవలేదు ఈ పరిస్థితుల్లో ఇద్దరం ఓడిపోయిన వాళ్ళం అయ్యాము అయినప్పుడు ఎవరిని ఎవరు ఓదార్చలి నాకు తెలియడం లేదు కళావతి అందరిని క్షమించమని అడగడం తప్ప నేనేంచెయ్యలేను ఇది మాత్రం నిజం ఇది నిజాన్ని మారదు ఈ పరిస్థితి మారదు ఈ సమస్య తీరిపోదు ఈ బిడ్డ నా బిడ్డ ఈ ఇంట్లోనే పెరుగుతాడు. దుగ్గిరాల వంశ వారసుడి గానే ఉంటాడు అని చెప్పి రాజు అక్కడ నుంచి బాబుని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక అంతా షాక్ అయి చూస్తూ ఉండిపోతారు.

Brahmamudi Today Episode March 22 2024 Episode 364 highlights
Brahmamudi Today Episode March 22 2024 Episode 364 highlights

ఇక మరోవైపు అపర్ణ కనకం ఇద్దరు, గొడవ పడుతూ ఉంటారు అసలు నీ కూతురు జైష్టా దేవి లాగా మా గడపలకి కాలుమోపిన తర్వాత నుంచే మా ఇంటికి దరిద్రం పట్టుకుంది అని అపర్ణ కోపంతో కనకం మీద అరుస్తూ ఉంటుంది. ఇక కనకం కూడా కోపంగా ఫస్ట్ టైం అపర్ణ మీద, అరుస్తూ ఉంటుంది అసలు నా కూతుర్ని తప్పుపడుతున్నారు ఇంత జరిగిన తర్వాత కూడా మీరు నా కూతుర్ని ఇంత మాట అంటున్నారు అంటే అన్యాయం చేసి పైనుంచి దాందే తప్పని మాత్రం మాట్లాడితే మీకు మర్యాదగా ఉండదు అని కనకం వార్నింగ్ ఇస్తుంది నీ కూతురికి ఇంత కష్టం వచ్చి ఉంది అని నువ్వు బాధపడితే నీ కూతురు కష్టాన్ని చూసి నీకు అన్న పేరు మిల్లి తిరిగిపోతుంటే ఇంకా నీ కూతురు ఇక్కడే ఎందుకు తీసుకుపో నీతో పాటు అని అపర్ణ దేవి అంటుంది కనకం కూడా కోపంగా పంపించండి తీసుకువెళ్లిపోతాను ఇప్పుడే పంపించండి అని అరుస్తుంది ఇక అంతలో కావ్య అక్కడికి వచ్చి అమ్మ అని గట్టిగా అరుస్తుంది. చూస్తుంటే కావ్య కోపంగా కనకనే తిట్టి అపర్ణ వైపు మాట్లాడేలా ఉంది. కావ్య ఎంత జరిగినా దుగ్గిరాల ఇంటిని వదిలిపెట్టి మాత్రం వెళ్ళదు ఎందుకంటే రాజ్ అంటే కావేకి చాలా ఇష్టం కాబట్టి ఇక మరోవైపు రాజ్, తను తీసుకొచ్చిన బిడ్డ గురించి నిజం మాత్రం ఎవరికీ చెప్పడు. ఎవరు ఊహించని విధంగా ఒక బిడ్డను తీసుకువచ్చి రాజు షాక్ ఇస్తాడు. కావ్య ఏదో ఊహించుకొని తన భర్త విడాకుల గురించి ఎక్కడ నిజం చెప్తాడు అని నిన్న చాలా కంగారుపడి ఉంటుంది. కానీ రాజు విడాకుల గురించి కానీ అసలు కావ్య చేసిన పని గురించి గానీ ఏమీ మాట్లాడకుండా బిడ్డను తీసుకువచ్చి షాక్ ఇస్తాడు ఆ బిడ్డను చూసి ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా రుద్రాణి లాంటి వాళ్ళు అపర్ణ మీద నిందలు వేసిన తల్లి కొడుకుల బంధం గురించి మాట్లాడినా కూడా రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఎవరు ఎన్ని అన్నా కానీ రాజ్ నోరు విప్పకుండా ఉండడం ఇప్పుడు సీరియల్ లో ఇంట్రెస్ట్ గా మారింది. నిజంగానే రాజ్ ఈ బిడ్డకి తండ్రి లేక రాజ్ కావాలనే ఈ బిడ్డను తీసుకువచ్చి ఎవరికైనా సహాయం చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.

author avatar
bharani jella

Related posts

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella