Ennenno Janmala Bandham ఆగస్టు 16 ఎపిసోడ్ 478: యు రాస్కెల్ ఏమన్నావ్ రా అని యష్ లేచి అభిమన్యం గల పడతాడు. ఏ మిస్టర్ ఎక్కడున్నా ఏం చేస్తున్నావ్ ఇది ఒకటి చాలు నువ్వు జైల్లో ఉండడానికి అని ఎస్పీ గారు అంటుంది. మేడం చూశారా మాళవికను అభిమన్యం చంపాడు ఇప్పుడే నాకు చెబుతున్నాడు మేడం అని యాష్ అంటాడు. మేడం చూశారా ఏం మాట్లాడుతున్నాడో మాళవికను చంపడం ఏంటి మేడం నేను ఎందుకు చంపుతాను నన్ను ఇరికించాలని చూస్తున్నాడు నన్ను కాపాడినందుకు థాంక్స్ మేడం అని అభిమన్యు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మేడం నిజంగానే చంపానని నాతో అన్నాడు అనియష్ అంటాడు.

కట్ చేస్తే వేద గుడికి వచ్చి పంతులుగారు యష్ మీద పూజ చేయించండి అని అంటుంది.ఇంతలో ఒక పిల్లాడు అమ్మ అని కింద పడిపోతాడు బాబు నీకేం కాలేదు కదా అని వేద అంటుంది వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి నువ్వు ఒకచోట తిన్నగా ఉండలేవా అని కొడుతుంది. ఏమండీ మీరు ఎందుకు తిట్టారో వాడికి తెలుసు కానీ వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళు పెరుగుతారు ఆ చిన్న వయసును బట్టి మీరు ఆనందపరచాలే గాని బాధ పెట్టకూడదు కన్నడం గొప్ప కాదండి కన్నబిడ్డల్ని కన్నీరు పెట్టకుండా చూసుకోవడమే గొప్ప అని వేద అంటుంది. అది కాదమ్మా నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళ అల్లరి తట్టుకోలేక ఇలా తయారయ్యాను నేను తల్లినని నాకు గుర్తు చేశావు ఇకమీదట నా పిల్లల్ని ఏమీ అనను తెలియని పిల్లవాడైన నువ్వు దగ్గరికి తీసుకున్నావు నిజానికి నీ పిల్లలు చాలా అదృష్టవంతులమ్మ అని అంటుంది ఆ పిల్లవాడి తల్లి. ఇంతలో వేద కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.

అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అయ్యో ఏమైంది అమ్మ కళ్ళు తెరువు అని మొహం మీద నీళ్లు చల్లుతారు నీళ్లు చల్లగానే వేదాలేచి కూర్చుంటుంది. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి అమ్మ తల్లి గర్భగుడి ముందు పడిపోయావు ఆ తల్లి నిన్ను అనుగ్రహించి నిన్ను తల్లిని చేసింది అని. అంటుంది ఆ గుడిలో ఒక పెద్ద ఆవిడ. అది విన్న వేద సంతోషపడుతూ అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని అక్కడనుండి వెళ్లిపోయి వేద జైలుకు వస్తుంది ఏవండీ మీకు ఒకటి చెప్పాలి అనుకుంటూ వేద యష్ దగ్గరికి వెళుతుంది. వేద వచ్చావా నేను నీకు ఒకటి చెప్పాలి కోర్టు బయట ఉండగా అభిమానం నా దగ్గరికి వచ్చి మాళవికను చంపింది నేనే అని నాకు చెప్పాడుఅని యష్ అంటాడు.

అయితే మనం ఈ కేసులో నుంచి బయటపడొచ్చు పగటిబందీగా ప్లాన్ చేసి మనం ఈ కేసు నుండి బయటపడొచ్చు మీరేం వర్రీ కాకండి నేను మళ్ళీ వస్తాను అని వేద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వేదా మళ్ళీ గుడికి వస్తుంది నిద్రపోతున్నావా అమ్మ హాయిగా సుఖంగా నువ్వు నిద్రపోతే ఈ లోకం కకావికలం అవుతుందని నీకు తెలియదా అమ్మ నా భర్త మీద నేరం మోపి శిక్షించాలనుకుంటున్నాడు నువ్వే కనుక నిద్రపోతే ఈ లోకం అరాచకం పెరిగిపోతుందమ్మా అలా జరగకూడదు అని వేద చేతిలో కర్పూరం పెట్టుకుని అమ్మవారికి హారతి వెలిగిస్తుంది.

ఇంతలో అక్కడికి నీలాంబరి వస్తుంది వేద అమ్మవారి దగ్గర హారతి ఇస్తున్నది చూసి వేద నువ్వు చేస్తున్న త్యాగం చాలా గొప్పది నా వంతు సాయం నేను చేస్తాను అని నీలాంబరి తన మనసులో అనుకుంటుంది.కట్ చేస్తే వేద ఒక సిగ్నల్ దగ్గర ఆగుతుందిఇక్కడే మాళవిక కనిపిస్తుంది వేదాకి.మాళవిక స్కూటర్ వేసుకుని వెళ్ళిపోతుంది. మాళవికను చూసిన వేద ఆగు మాళవిక అని తన వెనకాల పరిగెడుతుంది స్కూటీ కి అడ్డం తిరిగి ఆగు మాళవిక అని అంటుంది తన మొహం మీద . ముసుగుతీసి చూస్తే తానుమాళవిక కాదు మాకు తెలిసిన మనిషి అని అనుకున్నాను అని అంటుంది వేద.

కట్ చేస్తే ఇంటిదగ్గర వాళ్ళమ్మ అయ్యయ్యో వేద చేతికి ఏమైందమ్మా అని అడుగుతుంది.మూర్ఖత్వం అని మాత్రం అనకమ్మ తన భర్తకి కళ్ళు కనపడవు అని తను కళ్ళకు గంతులు కట్టుకున్న గాంధారిని ముర్కత్వం అంటావా అగ్నిపరీక్ష పెట్టిన సీతను రాముడు ముందు తలవంచిన సీతది మూర్ఖత్వం అంటావా లేదు కదా పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చిన ఆడపిల్లకి తన భర్త తోడు ఉన్నాడని ధైర్యం నాకు భగవంతుడు తోడు ఉన్నాడు ఈ ధైర్యం తోటే నేను ముందుకు వెళతాను ఈ ధైర్యంతోటే నా భర్తను క్షేమంగా తిరిగి తెచ్చుకుంటా అని వేద అంటుంది.నాకు తెలుసు వేద నీ ధైర్యం తెలుసు నేను తెగింపు తెలుసు నీ గెలుపు ఖాయమని నాకు తెలుసు మేమంతా నీకు తోడుగా ఉంటాం అడుగు ముందుకే వేయి అని సులోచన అంటుంది