NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 12 2023 Episode 944: శైలేంద్ర గురించి నిజం తెలిసిన అనుపమ శైలేంద్రను ఏం చేయనుంది.

Guppedantha Manasu Today Episode December 12 2023 Episode 944 Highlights

Guppedantha Manasu December 12 2023 Episode 944: ముకుల్ ఇన్ని రోజులు జగతి మేడం కేసును చాలా ఈజీగా తీసుకున్నాను కానీ ఇప్పుడు ఆ కేసును ఈజీగా తీసుకోను మేడం జగతి మేడం కేసులో సాక్ష్యం దొరికినట్టే దొరికి తప్పించుకుంటుంది ఇప్పటికీ ఇలా చాలాసార్లు జరిగింది కానీ ఇప్పుడు వదిలిపెట్టను కచ్చితంగా నిరూపిస్తాను అంటాడు ముకుల్. అనుపమ అంటే ఏంటి ముకుల్ గారు మీరు చెప్పేది. ముకుల్ అవును మేడం ఆ వాయిస్ కచ్చితంగా శైలేంద్రది కానీ చాలా తెలివిగా తప్పించుకున్నాడు అంటాడు.అనుపమ వాయిస్ రికార్డు విని అది ఖచ్చితంగా శైలేంద్రదే అని ఎలా చెప్పగలవు టెక్నాలజీ అనుకోవచ్చు కదా అది శైలేంద్ర ఉపయోగించి మీ వాయిస్ రికార్డు కూడా వినిపించాడు కదా మరి అలాంటప్పుడు శైలేంద్ర ప్రధాన నిందితుడని ఎలా చెప్పగలను ముకుల్ అంటుంది అనుపమ. ముకుల్ అవును మేడమ్ కచ్చితంగా ఆ వాయిస్ శైలేంద్రది మనల్ని నమ్మించి తను తప్పించుకోవడానికి నాలాంటి వాయిస్ రికార్డ్ చేయించాడు అంటాడు.

Guppedantha Manasu Today Episode December 12 2023 Episode 944 Highlights
Guppedantha Manasu Today Episode December 12 2023 Episode 944 Highlights

అనుపమ సరే ముందు అది పక్కన పెట్టు ఇప్పుడు రిషి కనిపించకుండా పోయాడు కదా రిషి కేసులు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా ఏమైనా ఆధారాలు దొరికాయా అంటుంది. అంకుల్ అవును మేడం ఎంక్వయిరీ స్టార్ట్ చేశాను రిషి సార్ గురించి కొన్ని ఆధారాలు దొరికాయి. శైలేంద్ర గారు ఉన్న హాస్పటల్ చుట్టుప్రక్కలోనే రిషి ఫోన్ సిగ్నల్స్ వచ్చాయి తరువాత కాసేపటికి ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయాయి తర్వాత మళ్లీ ఇక ఎక్కడ ఫోన్ సిగ్నల్స్ అందలేదు. నాకెందుకు రిషి సార్ కిడ్నాప్ ఆయాడని అనిపిస్తుంది అలాగే సిటీ అవుట్స్ కట్ లో రిషి సార్ కారు ఆగి ఉన్నట్టు కనిపించింది అందులో రిషి సార్ లేరు ఒకవేళ రిషి సార్ అయితే కిడ్నాప్ అన్నా అవ్వాలి లేదంటే ఏదైనా ప్రమాదం అన్నా జరిగి ఉండాలి అంతే మేడమ్ అంటాడు ముకుల్. అనుపమ అవునా ఇదంతా అయోమయంగా ఉందే సరే ముకుల్ గారు మీరు ఎలాగైనా ఈ కేసును త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక కొలిక్కి తీసుకురావాలి అప్పుడే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది మీకు ఏమైనా పొలిటికల్ పలుకుబడి కావాలంటే నాకు చెప్పండి నేను నాకు చేతనైనంత వరకు మీకు సహాయం చేస్తాను అంటుంది. ముకుల్ సరే మేడం.

Guppedantha Manasu Today Episode December 12 2023 Episode 944 Highlights
Guppedantha Manasu Today Episode December 12 2023 Episode 944 Highlights

కట్ చేస్తే శైలేంద్ర తను రౌడీలను పెట్టి తనమీద అటాక్ చేయించుకున్న వాళ్లతో సీక్రెట్ గా మాట్లాడుతుండగా ధరణి చూస్తుంది. ధరణి అదేంటి ఆరోజు నన్ను మా ఆయనను కొట్టి మా ఆయనను పొడిచి వెళ్లిన రౌడీలు కదా మరి ఈయన వాళ్లతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని వెళ్లి చాటుగా వినడం మొదలు పెడుతుంది ధరణి.
శైలేంద్ర వావ్ మీ నటన నాకు చాలా బాగా నచ్చింది రా మీరు సినిమాలో కానీ సీరియల్స్ లో కానీ వెళ్లండి బాగా పేరు తెచ్చుకుంటారు అంటాడు. విలన్స్ సార్ అంతా మీరు చెప్పినట్టే చేసాము కదా మాకు ఇదే ఫస్ట్ టైం సార్ అంటారు. శైలేంద్ర నేను చెప్పిన పని చెప్పినట్టుగా పొల్లు పోకుండాచేశారు పైగా కత్తి దింపారు కానీ ప్రాణం పోకుండా దింపారు వావ్ నీ చేతులకు జోహార్లు రా మీరు వెళ్లేటప్పుడు ఒక డైలాగ్ చెప్పి వెళ్లారే మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టము అనె ఆ డైలాగ్ ఇంకా అదిరిపోయింది రా నేను రాసి చెప్పిన స్క్రిప్ట్ కంటే మీరు చెప్పిన స్క్రిప్ట్ చాలా పండింది దానివల్లే కథ మొత్తం మలుపు తిరిగింది అంటాడు శైలేంద్ర. విలన్స్ సరే సర్ మొన్నటి దానికి పైసలు ఇస్తే మేము వెళ్ళిపోతాం అంటారు.శైలేంద్ర ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నాకు మళ్ళీ ఎప్పుడైనా పని పడ్డప్పుడు ఫోన్ చేస్తాను తప్పకుండా చేసి పెట్టాలి అంటాడు. విల్లన్స్ సరే సర్ తప్పకుండా చేసి పెడతాం అంటారు. శైలేంద్ర సరే ఇదిగో ఈ డబ్బు తీసుకోండి మీరు అడిగిన దాని కంటే పదింతలు ఎక్కువగా ఇచ్చాను సంతోషమా ఇక వెళ్ళండి ఎక్కువసేపు మనం ఇక్కడ ఉంటే ఎవరైనా చూస్తారు త్వరగా వెళ్లండి అంటాడు.

Guppedantha Manasu Today Episode December 12 2023 Episode 944 Highlights
Guppedantha Manasu Today Episode December 12 2023 Episode 944 Highlights

కట్ చేస్తే ధరణి అంటే ఈనా నేను మారిపోయాను మంచిగా ఉంటున్నాను అని చెప్పినవన్నీ అబద్ధాల నన్ను నమ్మించడానికి ఇంత నాటకం ఆడాడు అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఈ విషయం ఇప్పుడే వసుధార కు చిన్న మామయ్యకు చెప్పాలి అంటూ పరిగెత్తుకుంటూ వసుధార వాళ్ళ ఇంటికి వెళ్లి చిన్న మామయ్య గారు చాలా ఘోరం జరిగిపోయింది చాలా ఘోరం జరిగిపోయింది చిన్న మామయ్య గారు నన్ను క్షమించండి ఇదంతా నా వల్లే అంటూ బాధపడుతుంది ధరణి. మహేంద్ర ఏంటి ధరణి ఎందుకు ఏడుస్తున్నావ్ ఏమైనా ప్రాబ్లమా చెప్పు ఏమైంది అమ్మ అంటాడు మహేంద్ర.వసుధార మేడం ఏంటి మీరు ఎందుకు అలా ఏడుస్తున్నారు అని అడుగుతుంది. ధరణి పొరపాటు జరిగిపోయింది మామయ్య గారు జగతి అత్తయ్య ను చంపింది నా భర్త శైలేంద్రనే మీరు ఆయనను అనుమానిస్తుంటే నేను నమ్మలేదు కానీ ఇప్పుడు కళ్ళారా చూశాను ఇదంతా నిజం మామయ్య గారు అని ఏడుస్తుంది. మహేంద్ర అదేంటి అమ్మ నీకెలా తెలుసు అంటాడు.

Guppedantha Manasu Today Episode December 12 2023 Episode 944 Highlights
Guppedantha Manasu Today Episode December 12 2023 Episode 944 Highlights

ధరణి ఇప్పుడే నా భర్త శైలింద్ర రౌడీలతో మాట్లాడుతూ ఉండగా నా కల్లారా నేను చూశాను మామయ్య గారు విన్నాను తను జగతి అత్తయ్యను చంపించడానికి రౌడీలకు డబ్బులు డబ్బులు ఇస్తుంటే నేను కల్లారా చూసాను కానీ మధ్యలో తను మారిపోయినట్టు చాలా నటించాడు కదా అదే నిజమేమో అని అనుకున్నాను మామయ్య గారు కానీ ఒక మూడు రోజుల క్రితం తన మీద జరిగిన ఎటాక్ మొత్తం అంతా అబద్ధం మామయ్య గారు తను డబ్బులు ఇచ్చి రౌడీలతో పొడి పెంచుకున్నాడు జగతి అత్తయ్య కేసులో వాయిస్ రికార్డ్ దొరికిందని తెలవగానే ఎక్కడ దొరికిపోతానో అని రౌడీలను పెట్టి తనమీద ఎటాక్ చేయించుకున్నాడు మామయ్య గారు ఇప్పుడే ఆ రౌడీలతో మాట్లాడుతుంటే వాళ్లకి డబ్బులు ఇస్తుంటే అది కూడా కళ్ళారా చెవులారా విని వస్తున్నాను మామయ్య గారు అంటూ ఏడుస్తుంది ధరణి.

Guppedantha Manasu Today Episode December 12 2023 Episode 944 Highlights
Guppedantha Manasu Today Episode December 12 2023 Episode 944 Highlights

అదే సమయంలో అక్కడికి వచ్చినా అనుపమ ధరిని చెప్పిన మాటలు మొత్తం విని షాక్ అవుతుంది. అనుపమ ఏంటి ధరణి నువ్వు చెప్పేది జగతి చావుకు కారణం శైలేంద్రనా ఇదంతా నిజమా అసలు నేను నమ్మ లేకపోతున్నాను అంటుంది అనుపమ. ధరణి అవును మేడం నేను చెప్పేదంతా నిజం నా భర్త శైలేంద్ర మారలేదు మారినట్టు నన్ను నమ్మించి నన్ను తనకు ఆయుధంగా మలుచుకున్నాడు నేను అదంతా నిజమని తనను వెనకేసుకు వచ్చాను నన్ను క్షమించండి మామయ్య గారు అంటుంది ధరణి. మహేంద్ర విన్నావు కదా అనుపమ నీ ఫ్రెండు జగతి చావుకు కారుకులెవరు ఇప్పుడైనా తెలిసింది కదా అంటాడు

 

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N