Virat Kohli: స్టార్ క్రికెటర్ మరియు స్టార్ హీరోయిన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలబడిందని చెప్పొచ్చు. ఎంతో అన్యోన్యంగా వీరి జీవితాన్ని సాగిస్తూ సినీ సెలబ్రిటీల జంటలకు ఆదర్శంగా నిలిచారు.
ఇక వీరి దాంపత్యానికి గాను ఒక బిడ్డ కూడా జన్మించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అనుష్క మరోసారి బిడ్డకి జన్మనిచ్చింది అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక వీటిపై అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ స్పందించకపోవడంతో ఈ వార్తలకి ఆద్యం పోసినట్లు అయ్యింది.
తాజాగా వీటిపై వీరి కుటుంబ సభ్యులు స్పందించి ఖండించారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు AB డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్ లో Q&A సెషన్ లో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ తన రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించాడు. అదేవిధంగా అనుష్క శర్మ ఇంకా బిడ్డకి జన్మనివ్వలేదని వెల్లడించారు.
వైరల్ అవుతున్న వాటిలో ఎటువంటి నిజం లేదు.. ఆ ఫోటోలు అన్ని పాతవి అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన విరాట్ అభిమానులు..” ఆ సంతోషాన్ని కొంచెం సేపు కూడా ఉండనివ్వకుండా చేశారు కదా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!