Intinti Gruhalakshmi: అవును దివ్య ఇక నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని అభి అడుగుతాడు. నువ్వు డాక్టర్ అయిన కొత్తలో అమ్మ నీతో ఒక హాస్పటల్ పెట్టించి ఫ్రీగా వైద్యం అందించాలి అని అనుకుంది. ఇప్పుడు నేను అదే చేస్తాను అని దివ్య అంటుంది. అలా అని నిన్ను బ్లెమ్ చేయడం కాదు. అది నేను చేయాలని అనుకుంటున్నాను అని దివ్య చెప్పగానే.. అయితే నేను ఇంటర్వ్యూ కి నేను గతంలో పనిచేసిన హాస్పిటల్ కి రిఫర్ చేయనా అని అభి అనగానే లేదు అన్నయ్య. ఇంటర్వ్యూ కి నాకు ఎలాంటి రికమండేషన్ అవసరం లేదు. నేనే వెతుక్కుంటాను అని దివ్య చెబుతుంది.

ఆ మాటలకి తులసి పొంగిపోతుంది ఇక దివ్య రెడీ అయ్యి ఇంటర్వ్యూకి బయలుదేరుతుండగా నందు వచ్చి నా కారులో డ్రాప్ చేస్తాను అని అంటాడు లేదు నాన్న నేను అమ్మతోపాటు బైక్ మీద వెళ్తాను అని చెబుతుంది లాస్య పక్కనే ఉండగా నందు కాళ్లకు దండం పెడుతుంది దివ్య నాకు కూడా పెట్టొచ్చు కదా అని మనసులో అనుకుంటుంది లాస్య ఇక తులసిని తీసుకొని దివ్య ఇంటర్వ్యూ కి వెళ్తుంది ఆ హాస్పిటల్ ఎండి వస్తున్నారని చూసుకోకుండా దివ్య ఆవిడ వస్తున్నప్పుడు లేచి నిలబడదు ఆమె సీరియస్గా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

దివ్య ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవుతుంది. కానీ ఆ టెస్టు ఈ టెస్టులు అని పేషెంట్స్ దగ్గర డబ్బులు గుంజాలని వాళ్ళు చెబుతారు. ఆ పని నేను ఎప్పటికీ చేయనని దివ్య అంటుంది. మా అమ్మ నేర్పిన సంస్కారం నాలో ఉంది. అంటూ ఆ ఉద్యోగాన్ని వద్దు అని వదిలేసి వస్తుంది. తులసి కూడా అంతే తప్పు ఎక్కడ జరుగుతున్నా తను సహించదు. ఎదిరించి పక్కకు వస్తుంది

మరోవైపు తులసి ఆ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ గా ఉండిపోకోకుండా తులసి అందరూ ఉద్యమించేలా చేస్తుంది అక్కడే బయట నుంచి కూర్చొని అందరూ ఈ విషయం గురించి మాట్లాడండి అంటూ న్యాయం వైపు నిలబడుతుంది. ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.