Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమై ఐదు వారాలు కావస్తోంది. హౌస్ లో మంచి రసవతరమైన పోరు సాగుతోంది. బుల్లితెర నటీనటులంతా ఒకవైపు.. మరోపక్క రైతుబిడ్డ ప్రశాంత్ ఇంకా మరి కొంతమంది అమాయకుల గ్రూపు మరోవైపు అన్నట్టు పరిస్థితులు మారాయి. ఈ బుల్లితెర సీరియల్ బ్యాచ్ చేస్తున్న హడావిడికి బయట ప్రేక్షకులు చీదరించుకుంటున్నారు. ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పట్ల వాళ్లు వ్యవహరిస్తున్న తీరు.. షో చూసే ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తుంది. తక్కువ చేసి మాట్లాడటం తో పాటు మనిషిగా కూడా.. విలువ ఇవ్వకుండా మా టీవీ సీరియల్ బ్యాచ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మరి ఓవరాక్షన్ గేమ్ ఆడుతున్నారు.
ముఖ్యంగా అమర్ దీప్ నోటికి ఇష్టం వచ్చినట్లు అవతల వ్యక్తులపై ఐదో వారంలో మాటలు జారిన సందర్భాలు చాలా ఉన్నాయి. సీజన్ సెవెన్ మొట్టమొదటి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ నిర్వహించిన పోటీలలో.. ఫ్రస్టేషన్ కి గురై తన పరువు తానే తీసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ అందరికీ ఆరెంజ్ లో క్లాస్ పీకారు. దీనిలో భాగంగా శివాజీని ఫ్రూట్ నింజా టాస్క్ గురించి ప్రశ్నిస్తూ ప్రశాంత ఓ పక్క నుంచి చేస్తూనే ఉన్నాడు. అన్నా తొక్కలు వేశారు అని. వదిలేయరా అని అలా అంటావు శివాజీ అని నాగార్జున ప్రశ్నించారు.
దీనికి శివాజీ సమాధానం ఇస్తే ప్రతిదానికి గొడవకపోతే నాతోనే కాదు సార్ పైగా తొక్కలు వేయటం చూడలేదు. పక్కనుంచి తీయడం చూశాను అని చెప్తాడు. అయితే సంచాలక్ అమర్ దీప్ కి చెప్పొచ్చు కదా అని నాకు ప్రశ్నించగా అబ్బే అమర్ ఏది చెప్పినా వినయ్ వాడు కాదు సార్. హౌస్ లో మొదటి రోజు నుంచి వాడొక నెగిటివ్ ఫీలింగ్ లో ఉన్నాడు అదే పెట్టుకుని ఆడుతున్నాడు అంటూ శివాజీ.. నాగార్జున ముందు అమర్ గేమ్ గురించి ఒక మాటలో తీసి పక్కన పడేసినట్లు డైలాగులు వేశారు.