NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 30 2024 Episode 140: నిశిక నాటకాన్ని బయట పెట్టిన జగదాత్రి…

Jagadhatri Today Episode January 30 2024 Episode 140 Highlights

Jagadhatri January 30 2024 Episode 140: చెప్పు వదిన ఇంత భూమిలో మా అందరికీ వచ్చేది 30% నీకు మాత్రం 70 పర్సెంట్ వస్తుంది ఎందుకు అని నిషిక అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ ఇది సమయం కాదు వాళ్ళు వెళ్ళిన తర్వాత మాట్లాడు అని జగదాత్రి అంటుంది. నాకు తెలవాల్సిన లెక్కలు మాట్లాడాల్సింది చాలా ఉన్నాయండి అవన్నీ తేలే వరకు నేను సంతకం పెట్టను నేను సంతకం పెట్టకుండా ఈ డీల్ క్లోజ్ అవ్వదు అని నిషిక అంటుంది. నిషి సంతకం పెట్టు అని కేదార్ అంటాడు. నేను సంతకం పెట్టను అని నిషిక అంటుంది. సంతకం పెట్టి తీరాలి ఇవాళ అగ్రిమెంట్ అవుతుందని నేను వాళ్లకు మాటిచ్చాను మాట తప్పకుండా నువ్వు సంతకం పెట్టు అని కౌశికి అంటుంది. ఇందులో నాకు 70% వాటా ఇస్తానంటే సంతకం పెడతాను అని నిషిక అంటుంది.అమ్మాయి ఇప్పుడు ఎందుకు నిషితో రేపు మాట్లాడి పెట్టిద్దాం. ఈలోపు వాళ్ళని రేపు రమ్మని చెప్పు అని వైజయంతి అంటుంది. ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది వాళ్ళు సింగపూర్ వెళ్ళిపోతారు పిన్ని రేపటి వరకు ఉండరు అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode January 30 2024 Episode 140 Highlights
Jagadhatri Today Episode January 30 2024 Episode 140 Highlights

నిషిక ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇలా బయట వాళ్ల ముందు ఐక్యత చూపకపోతే ఇదే మనకు రేపు ఎదురు వచ్చి మన బిజినెస్ లాస్ వస్తుంది, ఏదైనా డీల్ అయిపోయాక మాట్లాడుకుందాం ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావ్ సంతకం పెట్టు అని సుధాకర్ అంటాడు. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి సంతకం పెడుతున్నాను అని నిషిక చెయ్యి కాలినట్టు యాక్టింగ్ చేసి సంతకం పెట్టలేక పోతుంది. వంట చేస్తుంటే చేయి కాలింది మామయ్య రేపటిలోపు తగ్గిపోతుంది రేపు సంతకం పెడతాను అని నిషిక అంటుంది. మేడం ఇంకొక గంట మీకోసం వెయిట్ చేస్తాం ఈలోపు ఆలోచించుకోండి మేడం అని వాళ్ళు వెళ్ళిపోతారు. గంటలో ఎలా చెప్పాలి అత్తయ్య కాలింది తగ్గాలంటే ఒక రోజైనా పడుతుంది కదా అని నిషిక అంటుంది.అయినా వంట గదిలోకి నువ్వు ఎందుకు వెళ్ళావు మమ్మీ? ఏమైనా కావాలంటే నేను చేసి పెట్టేదాన్ని కదా అని వైజయంతి తనని తీసుకొని రూమ్ లోకి వెళుతుంది. ధాత్రి ఈరోజు నిషిక చేసింది చాలా పొగరుగా అనిపించింది అని కేదార్ అంటాడు.నా చెల్లెలితో ఎలా సంతకం పెట్టించాలి అని జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 30 2024 Episode 140 Highlights
Jagadhatri Today Episode January 30 2024 Episode 140 Highlights

బాబాయ్ ఇదంతా చేస్తుంది అందరికోసం కాని నిషిక ఎందుకు అర్థం చేసుకోలేక పోతుంది అని కౌశికి బాధపడుతుంది. నిషి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కౌశికి నువ్వేం బాధపడకు అని సుధాకర్ అంటాడు. ఒక్క సంతకం పెడితే ఈ కాంట్రాక్ట్ అయిపోయేది బాబాయ్ అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,వదిన ఎంత మోసం చేసింది ఇన్నాళ్లుగా ఎంత దోచుకుంది ఇక మీదట అలా జరగనివ్వను బిజినెస్ లో నష్టం వచ్చేలా చేస్తాను అని నిషిక అంటుంది. అప్పుడు మనకే కదా అమ్మాయి నష్టం అని వైజయంతి అంటుంది. ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళందరూ ఊరుకోరు కదా అత్తయ్య కౌశికిని తిడతారు అప్పుడు తను కృంగిపోతుంది నేను సీఈఓ పోస్ట్లు అప్పుడు కూర్చొని నేను బిజినెస్ నడిపిస్తాను అని నిషిక అంటుంది. కౌశికి వదిన కుర్చీలో నుంచి నువ్వు కూర్చున్నావ్ అనుకో మా సపోర్టు నీకే అని కాచి బూచి అంటారు. నా సంతకం కోసం వచ్చే వదినకి నేను పెట్టే షరతులు చూసి మైండ్ పోతుంది అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 30 2024 Episode 140 Highlights
Jagadhatri Today Episode January 30 2024 Episode 140 Highlights

ఇప్పుడు ఆస్తి కోసం వజ్రపాటి కుటుంబం గొడవ పడుతుందంటే సమాజంలో మా కుటుంబం పరువు పోతుంది అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. మీరు ఇలా బాధపడడం చూడలేకపోతున్నాం వదిన వాళ్ళని రమ్మని చెప్పండి అని జగదాత్రి అంటుంది. నిషిక సంతకం చేయనని చెప్పింది కదా అని కౌశికి అంటుంది. నిషిక చేత నేను సంతకం పెట్టిస్తాను వదిన నువ్వు రమ్మని చెప్పు అని జగదాత్రి అంటుంది. దాత్రి ఏదైనా చెప్పింది అంటే చేసి తీరుతుంది అక్క మీరు ఫోన్ చేయండి వాళ్ళకి అని అంటాడు కేదార్ . కౌశికి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. జరగబోయే తమాషాని చూద్దురుగాని రండి వదిన అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 30 2024 Episode 140 Highlights
Jagadhatri Today Episode January 30 2024 Episode 140 Highlights

నిషి నీకేదో పార్సల్ వచ్చింది అని జగదాత్రి అంటుంది. నా ఫ్రెండ్ పెళ్లికి గిఫ్ట్ పంపిస్తాను అని చెప్పింది విలువైంది అయి ఉంటుంది అని నిషిక ఆ గిఫ్ట్ బాక్స్ ని తీసుకొని ఓపెన్ చేస్తూ ఉంటుంది అందరూ వచ్చి అది చూసి షాక్ అవుతారు. అది నిషిక ఓపెన్ చేయగానే నవ్వుతున్న లాఫింగ్ బుద్ధ కనపడగానే షాక్ అవుతుంది నిషిక. పెన్ను కూడా పట్టుకోలేని నువ్వు చెక్క పార్సల్ ఓపెన్ చేసావు అని కౌశికి అడుగుతుంది . నువ్వు ఇలా చీప్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావ్ అర్థం కావట్లేదు నిషి కాచి వెళ్లి ఫైల్ తీసుకురా, నిషి చేసిన రచ్చ చాలు వచ్చి సంతకం పెట్టు అని అంటుంది. వదిన దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని నన్ను ఇరికిస్తావా నీ సంగతి తర్వాత చెప్తాను అని నిషిక సంతకం పెడుతుంది. ఆ ఫైల్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తుంది కౌశికి . మేడం ఇది రిజిస్ట్రేషన్ చేయించి మీకు ఇంకో కాపీ పంపిస్తాం అని వాళ్ళు వెళ్ళిపోతారు. నిషి నువ్వు ఇందాక 70% అడిగావు కదా ఫార్టీ పర్సెంట్ ఇస్తాను అని కౌశికి అంటుంది. నిషిక చేత సంతకం పెట్టినందుకు చాలా థాంక్స్ అని కౌశికి అంటుంది. బయటి వాళ్ళ ముందు నిన్ను ఎలా తలదించుకొనిస్తాము అక్క నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిన నేను జగదాత్రి కాపాడుతూ ఉంటాం అని కేదార్ అంటాడు. నువ్వు ఇంటికి కొడుకుగా జగదాత్రి ఇంటి కోడలుగా ఉంటే ఎంత బాగుండు అని కౌశికి మనసులో అనుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నారు వదిన అని ధాత్రి అడుగుతుంది. సాక్ష్యాలు తీసుకువస్తానన్నారు కదా అవి లేకపోతే మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వలేను అని కౌశికి అంటుంది. సాక్షాలు లేకపోతే మేము కూడా ఇంట్లో ఉండము వదిన అని జగదాత్రి అంటుంది. కౌశికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్క మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతామేమోనని భయపడుతుంది ధాత్రి అని కేదార్ అంటాడు. ఇచ్చిన గడువులోపు సాక్షాలు తీసుకురావాలి కదా అని దాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 30 2024 Episode 140 Highlights
Jagadhatri Today Episode January 30 2024 Episode 140 Highlights

ఏంటి నిషి ఇల్లంతా ఇలా డెకరేట్ చేశారు అని అడుగుతుంది జగదాత్రి. నాకు జాబ్ వచ్చిన సందర్భంగా నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నాను అని నిషిక అంటుంది. ఇది వదినకు తెలుసా వదిన ఒంట్లో బాగోలేదు కదా ఈ టైంలో పార్టీ ఏంటి అని జగదాత్రి అంటుంది. ఆవిడకు ఒంట్లో బాగోలేకపోతే నన్నేం చేయమంటావ్ ఆవిడను ఏదో ఒక మూలన కూర్చోమను అని నిషిక అంటుంది. ఇంతలో దివ్యాంక వాళ్ళ టీం ని తీసుకొని కౌశికి వాళ్ళ ఇంటికి వస్తుంది.

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N