Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న కాజల్.. ప్రియుడు, ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రేమ వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించిన కాజల్.. గత ఏడాది గర్భం దాల్చించి. అప్పటి నుంచి నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ.. 2022 ఏప్రిల్ 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తనయుడికి నీల్ కిచ్లూ అంటూ నామకరణం కూడా చేసేశారు కాజల్ దంపతులు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తనయుడి ఫొటోలను కాజల్ ఇప్పటికే షేర్ చేసింది. కానీ, పసిబిడ్డ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా తన ఇద్దరు కుమారులతో కాజల్ మధుర క్షణాలను ఆస్వాదించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాజల్ కు ఉన్నది ఒక్కడే కుడుకు కదా.. రెండో తనయుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా..? నిషా అగర్వాల్ కొడుకు ఇషాన్. చెల్లెలు తనయుడు ఇషాన్, తాను జన్మనిచ్చిన నీల్ కిచ్లూలతో కలిసి కాజల్ టైమ్ స్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనే బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.