NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ ని ప్రేమిస్తున్నాను అని ముకుంద కి నిజం చెప్పేసిన మురారి.. తర్వాత ఏమైందంటే!

Krishna Mukunda Murari 30 June 2023 today 197 episode highlights

Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా నడుస్తున్న సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుంద మురారి’.ఈ సీరియల్ ఆసక్తికరంగా సాగుతూ నేడు 197 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

Krishna Mukunda Murari 30 June 2023 today 197 episode highlights
Krishna Mukunda Murari 30 June 2023 today 197 episode highlights

Krishna Mukunda Murari: రాజ్ నర్స్ ని నిలదీసిన, మురారి.. ముకుంద కూడ ఫామ్ హౌస్ లో ఉందని కనిపెట్టిన మురారి..

స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిన కృష్ణ ని కాపాడిన మురారి:

స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిన కృష్ణ ని కాపాడి బయటకి తీసిన మురారి, ఎంతో ఆందోళన చెందుతూ ఆమె మింగేసిన నీళ్లను మొత్తం కక్కించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కృష్ణని ఎత్తుకొని లోపలకు తీసుకెళ్తున్నప్పుడు ముకుంద ఎదురుగా వస్తుంది. అబ్బా చూడడానికి ఎంత చక్కగా ఉందో, ‘నారి నారి నడుమ మురారి’ టైటిల్ అదిరిపోతోంది నీకు అంటుంది ముకుంద. నువ్వు ఏమి చేస్తున్నావు ఇక్కడ అని మురారి అడగగా, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు నన్ను వదులుకున్నా నేను నిన్ను వదులుకోలేదు అంటుంది ముకుంద. అన్నీ గమనిస్తున్నాను ముకుంద, చిన్న గ్యాప్ ఇవ్వు, ఏకాంతంగా కలుద్దాం అని అంటాడు మురారి. తప్పకుండ కలుద్దాం, నీతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయ్ అని బదులిస్తుంది ముకుంద.

Krishna Mukunda Murari 30 June 2023 today 197 episode highlights
Krishna Mukunda Murari 30 June 2023 today 197 episode highlights

ఆదర్శ్ గురించి మురారి ని ప్రశ్నించిన పెద్దమ్మ :

ఇక స్పృహ లోకి వచ్చిన కృష్ణ తో కాసేపు సరదాగా ఆటపట్టిస్తాడు మురారి. అప్పుడు ఆమె గారాలకు పొయ్యి అలగడం తో కాసేపు బ్రతిమిలాడుతాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఈ క్యూట్ మూమెంట్స్ జరుగుతాయి. అలా సరదాగా సమయం గడుపుతున్న సమయం లో పెద్దమ్మ మురారి కి ఫోన్ చేస్తుంది. నేను ఫోన్ చేస్తే కానీ నీకు గుర్తుకురానా అని అడగగా, అదేమీ లేదు పెద్దమ్మ నువ్వే మనసు ప్రశాంతం గా ఉండడం కోసం ఆశ్రమం కి వెళ్ళావు. నిన్ను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేకనే ఫోన్ చెయ్యలేదు అని బదులిస్తాడు. బానే కవర్ చేసావ్ అంటూ ఆదర్శ్ గురించి విచారణ ఎంత వరకు వచ్చింది అని అడుగుతుంది పెద్దమ్మ. మావాళ్లు అదే పని మీద ఉన్నారు, తొందర్లోనే చెప్తాను పెద్దమ్మ అని అంటాడు మురారి. అప్పుడు పెద్దమ్మ నీకు అసలు దీని గురించి పట్టింపే లేదు కదా, ఎంతసేపు ఆ తింగరి దానితోనే తిరుగుతుంటావు అని అంటుంది, ఒక్కటి గుర్తు పెట్టుకో మురారి నాకు ఎందుకులే అనుకుంటే ప్రతీ చిన్న పని కూడా బరువుగానే అనిపిస్తుంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది పెద్దమ్మ.

Krishna Mukunda Murari 30 June 2023 today 197 episode highlights
Krishna Mukunda Murari 30 June 2023 today 197 episode highlights

కృష్ణ ని ప్రేమిస్తున్నాను అని ముకుంద కి నిజం చెప్పేసిన మురారి :

ఇక మరోపక్క మురారి ఏకాంతంగా కలవమన్నాడు అని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ముకుంద. ఇక మురారి వచ్చిన తర్వాత ఎందుకు ఏకాంతం గా కలవమన్నావు అని ముకుంద అడగగా, ఇక నుండి ఎప్పుడు ఇలా కలిసే సందర్భం మన మధ్య రాదు అని చెప్పడానికే పిలిచాను అని అంటాడు మురారి. ఈమధ్య నువ్వు నన్ను హర్ట్ చెయ్యడమే పని గా పెట్టుకున్నావు అని అంటుంది ముకుంద. ఇదంతా కాదు నేను నీకు ఒక నిజం చెప్పాలి అని అంటాడు మురారి. ఎక్కడ కృష్ణ ని ప్రేమిస్తున్నాను అని చెప్తాడో అని భయపడుతూ ఉంటుంది ముకుంద. మురారి కూడా ఇబ్బంది పడుతూనే నేను కృష్ణ ని ప్రేమిస్తున్నాను ముకుంద, నువ్వు కూడా నీ భర్త ని ప్రేమించు అని చెప్తాడు.

Krishna Mukunda Murari 30 June 2023 today 197 episode highlights
Krishna Mukunda Murari 30 June 2023 today 197 episode highlights

ఎంత ధైర్యం ఉంటే అలా చెప్తావు అని అంటుంది ముకుంద. అది నిజం కాబట్టి చెప్పక తప్పడం లేదు అని బదులిస్తాడు మురారి. అప్పుడు ముకుంద నువ్వు నా విషయం లో అన్యాయం చెయ్యలేదా అని అంటుంది, అప్పుడు నా ప్రాణ స్నేహితుడి కోసం నిన్ను వదులుకున్న విషయం నేను చేసింది తప్పే, కానీ ఇప్పుడు నా ప్రాణ స్నేహితుడి భార్యవి, నిన్ను నేను ఇక నా ప్రేయసి గా ఊహించుకోలేను అని అంటాడు. అప్పుడు ముకుంద నువ్వు కృష్ణ ని ఎలా ప్రేమిస్తావో నేను చూస్తా అని అంటుంది, ఎలా ఆపుతావో నేను కూడా చూస్తా అంటాడు మురారి.

Related posts

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N