NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారిని సొంతం చేసుకున్న కృష్ణ . మరోసారి ఓటమిపాలైన ముకుంద..

Krishna Mukunda Murari Today Episode December 13 2023 Episode 339 Highlights

Krishna Mukunda Murari: మురారి ఒకపక్క కృష్ణ తులసి కోటకి పూజ చేస్తుంటే మరోపక్క మురారి పూజ చేస్తాడు. మురారి పూజ చేసేటప్పడు కూడా కృష్ణ ఏ విధంగా పూజ చేస్తే తను అలాగే చేస్తాడు. ఒకవైపు మురారి, మరోవైపు కృష్ణ ఇద్దరు కలిసి ఒకేసారి పూజ చేస్తారు. భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఒకేసారి పూజ చేసుకోవాలని ఉంటుందో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పూజ చేస్తుంటే చూడటానికి అంతా కన్నుల పండుగగా కనిపిస్తుంది. కృష్ణ దేవుడికి హారతి ఇవ్వగానే మురారి కూడా ఇస్తాడు. తల్లి లక్ష్మి దేవి విష్ణుమూర్తి స్వామి మీ ఇద్దరి దయవల్ల మీ ఆశీర్వాదాలతో మా ఆయన మా ఏసీబీ సార్ కి గతం గుర్తుకు వచ్చేలాగా చేయండి. మీ మీద మీ నమ్మకం మీద ఆధారపడి నేను ధైర్యంగా ఉంటున్నాను. కృష్ణ ఏం కోరుకుంటుంది అని మురారి కృష్ణ ని చూస్తూ ఉంటాడు. మురారి పూజ అయిపోయింది కదా వెళ్ళిపోదామని ముకుందా మురారిని లోపలికి తీసుకెళ్ళి పోతుంది.

Krishna Mukunda Murari Today Episode December 13 2023 Episode 339 Highlights
Krishna Mukunda Murari Today Episode December 13 2023 Episode 339 Highlights

ముకుంద భవాని దగ్గరకు వెళ్లి నాకు ఈ పెళ్లి జరుగుతుందని నమ్మకం లేదంటే.. ఒక్కోసారి నామీద నాకే విరక్తి అనిపిస్తుంది అని అంటుంది మల్లి ఏమైంది అని భవాని అడుగుతుంది. ఈరోజు మురారి నేను ఇద్దరూ కలిసి పూజ చేశామన్న పేరుకే గాని మురారి శ్రద్ధా ధ్యాస దేవుడా కానీ పూజ మీద గాని లేదు. తన శ్రద్ధంతా ధ్యాసంతా కూడా కృష్ణ పైనే ఉంది ఆ కృష్ణుని చూస్తుంటే నాకు చిరాకేస్తుంది అని భవాని అంటుంది. అప్పుడు నేను కృష్ణ గురించి మీకు ఒక మాట చెబుతాను అత్తయ్య మీరు నా గురించి ఏమీ అనుకోకండి. ఎందుకంటే మురారి కృష్ణ భర్త గురించి అడుగుతానని ఇంట్లో చాలా గొడవ చేశాడు. కానీ కృష్ణ ఖచ్చితంగా నిజం చెప్పలేదు అని మాత్రం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కృష్ణ నిజం చెప్పి ఉంటే ఈరోజు ఇలా ఇల్లు ప్రశాంతంగా ఉండి ఉండేది కాదు.

Krishna Mukunda Murari Today Episode December 13 2023 Episode 339 Highlights
Krishna Mukunda Murari Today Episode December 13 2023 Episode 339 Highlights

కృష్ణ ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ, ఈ ఇంట్లో గొడవ జరగకుండా మాత్రం చేసింది అత్తయ్య అది నాకు చాలా నచ్చింది. సారీ అత్తయ్య ఈ విషయం మీతో చెప్పొచ్చు చెప్పకూడదో నాకు తెలియదు కానీ, మురారి తో పాటు ఈ ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కృష్ణ చేసింది అని ముకుందా అంటుంది. నువ్వు సూపర్ ముకుంద సాటి ఆడదాన్ని ఈ విధంగా కూడా అర్థం చేసుకుని గుణాలు నీకు ఉన్నాయి. మురారికి భార్యగా కావాల్సిన అమ్మాయికి ఇలాంటి లక్షణాలు ఉండాలి. మీ ఇద్దరు పెళ్లి తప్పకుండా జరుగుతుంది. మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది అని భవాని ముకుంద కి భరోసా ఇస్తుంది.

Krishna Mukunda Murari Today Episode December 13 2023 Episode 339 Highlights
Krishna Mukunda Murari Today Episode December 13 2023 Episode 339 Highlights

మురారి కృష్ణ దగ్గరికి వచ్చి ఏంటి ఈ పిచ్చోడు ఏం చేస్తూ ఉంటాడు అని ఆలోచిస్తున్నారా అని అనగానే.. సార్ మీరు అలా మాట్లాడొద్దు అని చెప్పానా అని కృష్ణ అనగానే సారీ సారీ అని మురారి అంటాడు. ఏంటి ఏదో తెచ్చినట్టున్నారు అని కృష్ణ మురారిని అడగగా మీకోసమే తెచ్చాను అని అంటాడు. అప్పుడే ఏదో స్పెషల్ రెసిపీ లాగా ఆపిల్ ముక్కలు మామిడికాయ పచ్చడి అని చెప్పగానే కృష్ణ సంబరపడిపోతూ ఏసిపి సార్ కి గతం తాలూకు ఛాయలు గుర్తుకొస్తున్నాయి అని సంతోషిస్తుంది. ఇప్పుడే వస్తాను సార్ అని చెప్పి కృష్ణ గదిలోకి వెళ్లి డాన్స్ చేస్తుంది ఆ తర్వాత ఏమి తెలియనట్టు మురారి దగ్గరకు వచ్చి ఉంటుంది. ఇంకొక విషయం కృష్ణవేణి గారు నేను మీతో పాటు గుడిలో దీపాలు వదలడానికి రావచ్చా అని మురారి అడుగుతాడు. అప్పుడు కృష్ణ మీరు రాకపోయినా కూడా మీ ఇంట్లో వాళ్ళు కచ్చితంగా తీసుకువస్తారు అని కృష్ణ అంటుంది. సరే అక్కడ కలుద్దాం అని చెప్పి మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode December 13 2023 Episode 339 Highlights
Krishna Mukunda Murari Today Episode December 13 2023 Episode 339 Highlights

మురారి, మధు, నందు గౌతమ్, రేవతి అందరూ ముందుగా గుడికి వెళ్తారు ఇక అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగా.. కృష్ణ అక్కడికి వస్తుంది ఏంటి మీరందరూ ఇంత సరదాగా ఉన్నారు. పెద్ద మేడం రాలేదా అని కృష్ణ అడగగా.. పెద్ద మేడం వచ్చి ఉండి ఉంటే అందరూ ఎంత సంతోషంగా ఎక్కడ ఉంటారు అని మధు సెటైర్ వేస్తాడు. ఆ దెబ్బకి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. దూరంగా ఉన్నా ముకుందా భవాని ఇద్దరు వాళ్ళని చూస్తూ ఉంటారు. అప్పుడు ముకుందా చూసారా అత్తయ్య ఆ కృష్ణ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. మనం వెళ్తే చాలు మొఖం ముడుచుకొని ఉంటారు అని చెబుతుంది. ఇక భవాని వాళ్ళ దగ్గరికి వెళ్లి పదండి పదండి అందరూ గుడిలోకి వెళ్దాం అని అంటుంది. కృష్ణ నువ్వు మాత్రం రావద్దు అని చెబుతోంది. మురారి కృష్ణ ను చూస్తూ ముందుకు కదులుతాడు.ఆ తర్వాత మురారి ముకుందా చేత గుడిలో పంతులుగారు పూజ చేయిస్తూ ఉంటారు. ముకుందా మురారి ఇద్దరు కలిసి పూజ చేయడం ఇష్టం లేని నందిని అక్కడి నుంచి మెల్లగా తప్పించుకొని వస్తుంది. ఆ తర్వాత మధు కూడా వచ్చేస్తాడు. కృష్ణ దగ్గరకు వచ్చి నందు మధు ఇద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode December 13 2023 Episode 339 Highlights
Krishna Mukunda Murari Today Episode December 13 2023 Episode 339 Highlights

రేపటి ఎపిసోడ్లో కృష్ణ నేను నీకు ఏమి అన్యాయం చేశానని ఇంత చేస్తున్నావు అని ముకుందా కోనేట్లో దీపాలు వదులుతూ కృష్ణ ని అడుగుతుంది. అప్పుడు కృష్ణ నీళ్లలో పడిపోతుంది. ఏసిపి సార్ ఏసిపి సార్ అని పెద్ద పెద్దగా అరుస్తుంది. ఏసిపి సార్ అనే పదం మురారి వినగానే కృష్ణ అని పెద్దగా అరుస్తాడు. అంతేకాకుండా నీళ్లలో దూకి కృష్ణను కాపాడుతాడు. మూర్తి కృష్ణ అనే పిలవగానే భవాని షాక్ అవుతుంది. మురారి కి గతం గుర్తొచేసిందేమోనని భవాని ముకుందా కంగారు పడతారు. నిజంగా మురారికే గతం గుర్తుకొచ్చిందా రాలేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.కృష్ణ దేవుడి మీద నమ్మకం ఉంచింది. ఇప్పుడు ఆనందమే కృష్ణను గెలిపిస్తుందా అంటే.. నిజమే అనాలి. కృష్ణ నీళ్లలో పడి పెద్దగా పిలవడంతో మురారి వెళ్లి కృష్ణ నీ కాపాడతాడు. ఇదంతా చూస్తుంతే మురారికి గతం తాలూకు ఛాయలు గుర్తొస్తున్నట్లు అనిపిస్తున్నాయి. ఇక మురారితో ముకుందా పెళ్లి జరగదని అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే కృష్ణ నమ్మకమే గెలిచి మురారి గతం గుర్తొచేసిందేమో అనిపిస్తుంది. ఇక అదే నిజమైతే కృష్ణ మురారిని సొంతం చేసుకున్నట్లే.. మరోసారి ముకుందా ఓటమిపాలైనట్టే. ఇక ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N