NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుందకి నగ సెలక్ట్ చేసిన రేవతి.. కమిషనర్ ని కలిసిన క్రిష్ణ, మురారి

Krishna Mukunda Murari Today Episode December 19 2023 Episode 344 Highlights

Krishna Mukunda Murari: ముకుంద ఒంటరిగా నిలబడి అసలు ఈ పెళ్లి జరుగుతుందా జరగదా అని ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణ మురారి ఇద్దరు జైలుకు కూడా వెళ్లి ప్రభాకర్ ని అడిగి నిజా నిజాలు తెలుసుకున్నారు ఇప్పుడు వీలు తీగ లాగితే దేవ్ డొంకంతా కదులుతుంది. దేవ్ నా కోసమే ఇదంతా చేశాడని పెద్దత్తయ్యకు తెలిస్తే నన్ను షూట్ చేయడానికి కూడా ఆలోచించరు. ఇప్పుడు నేను ఏం చేయాలి. ఎలా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి భవాని వస్తుంది.

Krishna Mukunda Murari Today Episode December 19 2023 Episode 344 Highlights
Krishna Mukunda Murari Today Episode December 19 2023 Episode 344 Highlights

ముకుందా ముకుందా అని ఎంత పిలిచినా పలకదు. ఏమైంది ముకుందా? ఏం ఆలోచిస్తున్నావు అని భవాని అనడంతో ముకుందా ఈ లోకంలోకి వస్తుంది. ఏం లేదు అత్తయ్య ఈ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. మురారి వాళ్లు ఈ శుక్రవారం లోపు అసలు నిర్దోషి ఎవరు అనేది పట్టుకోలేకపోతే అని ముకుందా అడుగగా.. ఏమైంది మీ పెళ్లి జరుగుతుంది. కానీ, మా పెళ్లి జరిగిన తర్వాత అసలు నిర్దోషి ఎవరు అని తెలిస్తే అని ముకుందా అడుగుతుంది. అంటే ఏంటి.. ఆ కృష్ణ వాళ్ళు తప్పు చేయలేదని అనుకుంటున్నావా అని భవాని సూటిగా ముకుందని ప్రశ్నిస్తుంది. నాకు అలా అనిపిస్తుంది అని ముకుందా అంటుంది. ఈరోజుల్లో తప్పు చేసిన వాళ్ళే జైలుకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అలాంటిది కృష్ణ వాళ్ళ చిన్నాన్న నేరం నేనే చేశానని జైలుకి వెళ్ళాడు. అయినా ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు అని భవాని ముకుందని ప్రశ్నిస్తుంది. ఏం జరిగినా చూసుకోవడానికి మీరు ఉన్నారు కదా అత్తయ్య అని ముకుందా అంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 19 2023 Episode 344 Highlights
Krishna Mukunda Murari Today Episode December 19 2023 Episode 344 Highlights

ముకుందా అన్న మాటలకి భవాని ఆలోచిస్తూ ఉంటుంది. భవాని మనసులో ఎందుకు ముకుందా మురారి ఇలా పెళ్లి జరగడానికి ఆ దైవం అనుకూలించడం లేదు. ఒకసారి అమెరికా పంపిద్దాం అని అనుకున్నాను. అప్పుడు కూడా అవాంతరాలు వచ్చి ఆగిపోయాయి. ముకుందా మురారిల పెళ్లి చేద్దామని అనుకున్నాను. ఈలోపే మురారి కి గతం గుర్తుకు వచ్చింది. ఈ శుక్రవారం మురారి పెళ్లి చేద్దామని అనుకుంటే.. ఇప్పుడు నిర్దోషి ఎవరో తేలాలి అని మురారి అంటున్నాడు. ఇప్పుడు వరకు జరిగిన అన్ని సన్నివేశాలు కూడా కృష్ణకే ఫేవర్ గా ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని భవాని ఆలోచిస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 19 2023 Episode 344 Highlights
Krishna Mukunda Murari Today Episode December 19 2023 Episode 344 Highlights

కృష్ణ మురారి ఇద్దరూ కలిసి పరిమళా దగ్గరకు వెళతారు. హాస్పటల్లో వాళ్ళిద్దరూ కలిసి ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్న మాటలు విని మీ ఇద్దరినీ మళ్లీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది అని పరిమళా కృష్ణ మురారిలతో అంటుంది. ఎలా ఉన్నావు పరిమళా అని మురారి అడుగగా ఆ ప్రశ్న నేను వేయాలి మురారి. ఎలా ఉన్నావు అని అడుగుతుంది. చాలా బాగున్నాను అని మురారి అంటాడు. అప్పుడే కృష్ణ నిన్న సాయంత్రం మురారికి గతం గుర్తుకు వచ్చింది అని చెబుతుంది. నేను నీ నుంచి ఒక ఫేవర్ కోసం ఇక్కడికి వచ్చాను చేస్తావా అని అడగగా.. అది నేను చేసేదైనా చేయలేక పోయినదైనా కూడా నీకు కచ్చితంగా హెల్ప్ చేస్తాను అని పరిమళ అంటుంది.

మురారి నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసింది ఎవరు, తను ఎలా ఉంటాడు అని మురారి పరిమళ ని అడుగుతాడు. అతని పేరు శేఖర్ అని చెబుతుంది అతను నా దగ్గర చాలా ఆటిట్యూడ్ కూడా చూపించాడు అని అంటుంది ఇక తన గురించి మిగతా విశేషాలు, వివరాలు అడగగా.. ఇక పరిమళా లాప్టాప్ తెప్పించుకొని ఆ రోజు హాస్పిటల్ లో జాయిన్ చేసిన అతన్ని చూస్తే సరిపోతుంది. కదా ఇక ఆ ఫొటోస్ ని తీసుకెళ్లి మీ పెద్దమ్మకి చూపిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని పరిమళా అంటుంది. కానీ సిసి ఫొటోస్ లో అతను ఉన్న సీన్స్ ఇవన్నీ కూడా డిలీట్ అయిపోయి ఉంటాయి. కానీ అతని పేరు చెప్పావు కదా అది చాలు దాన్ని బట్టి నేను మిగతా వివరాలు తెలుసుకుంటాను అని మురారి కమిషనర్ ని కలవడానికి వెళ్తాడు.

Krishna Mukunda Murari Today Episode December 19 2023 Episode 344 Highlights
Krishna Mukunda Murari Today Episode December 19 2023 Episode 344 Highlights

రేవతి మార్వాడి అతన్ని పిలిపించి ముకుంద పెళ్లికి కావలసిన నగల్ని సెలెక్ట్ చేసుకోమని చెబుతోంది. రేవతి నువ్వు కూడా వచ్చి కూర్చో. నీకు కాబోయే కోడలికి నగల్ని సెలెక్ట్ చేయమని చెబుతోంది. ఒక నగని సెలెక్ట్ చేసి ఇవ్వగా ఇదేం బాగోలేదు అక్క అని రేవతి అంటుంది. అయితే నువ్వే సెలెక్ట్ చేయమని రేపు దీన్ని బలవంతం చేస్తుంది భవాని. ఇదంతా చూస్తున్న సుమతి పాపం తర్వాత అక్క ఇలా భవాని అక్కకు చెప్పలేక పోతుంది అని మనసులో అనుకుంటుంది. రేవతి ఒక నగని సెలెక్ట్ చేస్తుంది ముకుందా మనసులో ఈ నగని ఇప్పుడు నేను బాగోలేదు అంటే రేవతి అత్తయ్య ఫీల్ అవుతుంది. ఇక నేను అదే నగని తన ముందు వేసుకుని ఉంటే నేను సెలెక్ట్ చేసింది నా కోడలు వేసుకుంది అని ఫ్యూచర్లో అనుకుంటుంది కదా అని అనుకొని చిన్నత్తయ్య సెలెక్ట్ చేసింది నాకు చాలా బాగుంది అని అంటుంది ముకుంద. చిన్నత్తయ్య కాదు ముకుంద అత్తయ్య అని పిలువు అని అంటుంది భవాని.

Krishna Mukunda Murari Today Episode December 19 2023 Episode 344 Highlights
Krishna Mukunda Murari Today Episode December 19 2023 Episode 344 Highlights

కృష్ణ మురారి ఇద్దరు కమిషనర్ని కలవడానికి వెళతారు. ఇంకా కమిషనర్ మురారిని లోపలికి రమ్మని పిలుస్తాడు. మురారి రేపటి నుంచి డ్యూటీ లో జాయిన్ అవుతాను అంటే నో అంటాడు. ఇక కృష్ణ మురారి ఎలా కన్విన్స్ చేస్తారు అనేది చూడాలి.

ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి వాళ్ళ పెద్దమ్మ భవాని తో నేను పరిమళ దగ్గరకు వెళ్ళను నాకు సర్జరీ చేసిన అతని పేరు వివరాలు చెప్పారు అని మురారి అంటుండగా.. ముకుంద కంగారు పడుతుంది. ఇంతకీ ఎవరు అతను, అతని పేరేంటి అని భవాని అడుగగా.. ముకుంద ఎందుకు కంగారు పడుతుంది అని కృష్ణ ఆలోచిస్తుంది.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N