NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవానికి అడ్డంగా దొరికిపోయిన ముకుందా.. కృష్ణ పై దేవ్ బ్రహ్మాస్త్రం.. ఊహించని ట్విస్ట్..

Krishna Mukunda Murari Today Episode December 21 2023 Episode 346 Highlights

Krishna Mukunda Murari: కిట్టమ్మా మీ చిన్నాన్న సంక్రాంతి కల్లా వస్తాడా అని అడుగుతుంది. వస్తాడు చిన్నమ్మ అని కృష్ణ అంటుంది. ఈ సంక్రాంతికి మనం అంతా ఊరెళ్ళి అక్కడ పండగ చేసుకోవాలి అని అంటుంది. కచ్చితంగా నువ్వు అనుకుంది జరుగుతుంది చిన్నమ్మ అని కృష్ణ అడుగుతుంది విడిపోయి నువ్వు నేను అల్లుడు మీ చిన్నాన్న అందరం కలిసి మన ఊరు వెళ్లి సంక్రాంతి పండగ ధూమ్ ధామ్ చేసుకోవాలి అని శకుంతల అంటుంది. అప్పుడే మురారి అక్కడికి సీరియస్ గా వస్తాడు.

Krishna Mukunda Murari Today Episode December 21 2023 Episode 346 Highlights
Krishna Mukunda Murari Today Episode December 21 2023 Episode 346 Highlights

కృష్ణ పదా మనం మన ఇంటికి వెళ్దాం పదా, బట్టలు సర్దుకొ అని మురారి అంటాడు. క్రిష్ణ మురారి కి సర్ది చెబుతుంది కానీ, మురారి వినడు. శకుంతల కూడా కృష్ణ వెళ్లాలని చూస్తుంది. అప్పుడే మురారి అత్తయ్య మీరు పొయ్యి మీద పాలు పెట్టినట్టు ఉన్నారు ఒకసారి చూడండి అని మురారి శకుంతలని పంపిస్తాడు. ఇప్పుడు మురారి కృష్ణ కి ముద్దు పెడతాడు. కృష్ణ షాక్ అయ్యి అలాగే నిలబడి ఉంటుంది. మీరు ఏసిపి సార్ కాదు మీలో రొమాంటిక్ ఫెలో కూడా ఉన్నారు అని కృష్ణ అంటుంది. అప్పుడు శకుంతల అక్కడికి వచ్చి కిట్టమ్మా అల్లుడి ఆరోగ్యం సక్కగానే ఉందా అసలు నేను పొయ్యి మీద పాలే పెట్టలేదు అని శకుంతల అనగానే కృష్ణ మురారి వైపు చూసి నవ్వుతుంది. ఇక ఇద్దరూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు.

Krishna Mukunda Murari Today Episode December 21 2023 Episode 346 Highlights
Krishna Mukunda Murari Today Episode December 21 2023 Episode 346 Highlights

భవాని రేవతి తో ఏంటి రేవతి నీ కొడుకు కోడలు కలిసి వస్తారు అని చూస్తున్నావా అని అంటుంది. హా అని అనలేక రేవతి మౌనంగా ఉంటుంది అయినా నాతో మురారి చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తుందేంటి తనే కదా ఈ కేసు తేరే వరకు కృష్ణ ఈ ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టదు అని చెప్పాడు మరోవైపు ప్రశ్న ఏమో ఇదంతా తేలే వరకు వంటగదిలోకి కూడా రాను అని చెప్పింది వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లోకి వస్తే అప్పుడు ఆ పెట్టకండి ప్రభాకరే ఈ తప్పు చేశాడని వాళ్లే ఒప్పుకున్నట్టు కదా అని భవాని అంటుంది అప్పుడే మురారి ఇంట్లోకి వస్తాడు ఏంటి మురారి కృష్ణుని తీసుకు వస్తాను అని వెళ్లావు కదా ఏమైంది అని భవాని అంటుంది అయ్యో పెద్దమ్మ అసలు నాకు నా బ్రెయిన్ పనిచేయడం లేదా ఏంటి అని మురారి అంటాడు నేను మీకు ఇచ్చిన మాటని మర్చిపోయాను కృష్ణ నిజంగా దొరకడం నా అదృష్టం కృష్ణ ఈ కేసు తేలేంతవరకు ముకుంద జీవితం ఒక దారికి వచ్చేంతవరకు తను ఈ ఇంట్లోకి రాను చెప్పింది ముకుంద జీవితం చక్కదిద్దాకే తను ఇంటికి వస్తాను అని చెప్పింది అని మురారి అంటుండగా షట్ అప్ మురారి ముకుంద జీవితం తీర్చిదిద్దడానికి తను ఎవరు మనందరం లేమా అని భవాని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 21 2023 Episode 346 Highlights
Krishna Mukunda Murari Today Episode December 21 2023 Episode 346 Highlights

దేవ్ ఇంట్లో ఒంటరిగా ఉండగా తలుపు గడి మోగుతుంది. ఎవరు వచ్చి ఉంటారు నేను ఇంతవరకు జైలు నుంచి వచ్చినట్టు ఎవరికీ చెప్పలేదే అని అనుకుంటాడు. ఒకవేళ మురారి వచ్చాడా అని అనుమానం కలిగి ఎందుకైనా మంచిది పారిపోవడానికి ఇంటి వెనకమాల డోర్ ఓపెన్ చేసుకోవడం బెటర్ అని దేవ్ ఇంటి వెనకమల డోర్ ఓపెన్ చేసి వస్తాడు. అప్పటికే ఇంటి తలుపు మోగుతా ఉంటుంది. ఇక రివాల్వర్ బయటకు తీసి షూట్ చేయడానికి పట్టుకుంటాడు. మురారి వచ్చినా పర్లా, నా చేతిలో రివాల్వర్ చూసినా పర్వాలేదు ఆ భయంతోనైనా ముకుంద మెడలో తాళి కడతాడు అని అనుకుంటూ భయపడుతూ దేవ్ తలుపులు తీస్తాడు. తలుపు తీసేసరికి ముకుందా కనిపిస్తుంది. నువ్వు ముకుందా? ఏంటి ఈ టైంలో వచ్చావు అని దేవ్ అడుగుతాడు. నువ్వు రిలీజ్ అయ్యావని తెలిసింది. అందుకే వచ్చాను అని ముకుందా అంటుంది. అవును నాన్న ఎక్కడ అని ముకుందా అడుగుతుంది. నేనే మన సొంత ఊరికి పంపించేశాను అని దేవ్ అంటాడు. అవునా ఇప్పుడు ఎందుకు అని అంటే ఆయనకి కొడుకు కూతురు మీద కాస్తైనా ప్రేమ ఉందా అని దేవ్ తిడుతుండగా దేవ్ నా ముందు నాన్నని తిట్టకు అని ముకుందా అంటుంది. సరే సరే లోపలికి రా అని దేవ్ ముకుందని పిలుస్తాడు. నాకెందుకో ఈ పెళ్లి జరుగుతుండగా నమ్మకం లేదు అని అంటే జరిగింది ఇక నేను వచ్చేయాను కదా నేను చూసుకుంటాను అని దేవ్ చెబుతాడు. నేను రేపు మీ ఇంటికి వస్తాను అని దేవ్ ముకుందతో అంటాడు. వద్దు రావద్దు అని ముకుందా కంగారుగా అంటుంది. లేదు నేను వస్తాను అని దేవ్ అంటాడు. సరే ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని దేవ్ ముకుందని ఇంటికి పంపించేస్తాడు.

Krishna Mukunda Murari Today Episode December 21 2023 Episode 346 Highlights
Krishna Mukunda Murari Today Episode December 21 2023 Episode 346 Highlights

ముకుంద దేవ్ ని కలిసి ఇంటికి వస్తుంది. కానీ ముకుంద కంగారుపడుతూ ఇంట్లోకి రావడం కృష్ణ గమనిస్తుంది. ఎందుకు ముకుందా ఎవరైనా తనని చూస్తున్నారా లేదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఇంట్లోకి వెళుతుంది అని అనుకుంటుంది. ఇక ముకుంద ఇంట్లోకి వెళ్లిన తరువాత కూడా తను బయటకు వెళ్లి వచ్చానని ఎవరైనా గమనిస్తున్నారా అని ఆచితూచి అడుగులు వేస్తుంది. అప్పుడే భవాని ఆగు ముకుందా ఎక్కడికి వెళ్లావు అని పెద్దగా అరుస్తుంది. ఇప్పుడు అత్తయ్యకి ఏమని సమాధానం చెప్పాలి నాన్న దగ్గరకు వెళ్లి వస్తున్నానంటే ఏమంటుంది అని మనసులో కంగారుపడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లావు ముకుందా అని మరోసారి భవాని అడుగగా.. ముకుందా కాసేపు ఆలోచించి మా నాన్న దగ్గరికి వెళ్లి వస్తున్నాను అత్తయ్య అని చెబుతుంది. ఈ మాట చెప్పడానికి నువ్వు ఇంత ఆలోచించలా అని భవాని అంటుంది.

ఇక ఉదయం కృష్ణ ని శకుంతల నిద్ర లేపి పాల ప్యాకెట్స్ తీసుకురమ్మని చెబుతుంది. తలుపులు తీయగా మురారి ఎదురుగా నిలబడి పాల ప్యాకెట్స్ చూపిస్తాడు. సరే లోపలికి రండి ఏసిపి సార్ మీకు కాఫీ పెట్టి ఇస్తాను అని కృష్ణ అంటుంది. మరి మాకు అని మధు, రేవతి, నందు, గౌతమ్ అడుగుతారు. రండి రండి అని అంటుంది. అప్పుడు మురారి గుమ్మం దాటుతుండగా పడిపోతుంటే కృష్ణ గట్టిగా పట్టుకుంటుంది. వాళ్ళిద్దర్నీ అలా క్లోజ్ గా వాళ్ళందరూ చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు. ఇక మురారి లోపలికి వెళ్ళగానే మధు నీ ఒక్కటి కొట్టి లోపలికి రండి అని అంటుంది కృష్ణ. అప్పుడే నందు ఈరోజు టిఫిన్లు కూడా ఇక్కడే అంటే తప్పకుండా అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 21 2023 Episode 346 Highlights
Krishna Mukunda Murari Today Episode December 21 2023 Episode 346 Highlights

ఇంట్లో వాళ్ళందరూ కృష్ణ ఇంటికి వెళ్లారని తెలుసుకున్న ముకుందా నా పెళ్లి జరగడానికి ఇంట్లో ఎవరు సహకరించడం లేదు. ఒక్క భవాని అత్తయ్య తప్ప. ఇప్పుడు తను కూడా నా చెయ్యి దాటి పోకుండా ఉండాలంటే నా యాక్షన్ లో ఇంకాస్త స్పీడ్ పెంచాలి అని అనుకుంటుంది. భవాని రెడీ అయ్యి కిందకి రాగానే వీళ్లంతా ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు ముకుందా ఏడుస్తూ అసలు ఈ పెళ్లి జరుగుతుందని నాకు నమ్మకం లేదు అత్తయ్య. ఇంట్లో అందరూ ఆ కృష్ణకి సపోర్ట్ చేస్తున్నారు. నేను ఏమైనా తప్పు చేస్తున్నాను అత్తయ్య. నా వైపు ఇంట్లో వాళ్ళందరూ నీచంగా చూస్తున్నారు. నేనేమైనా తప్పు చేస్తే మీరు ఊరుకోరు కదా, నన్ను చంపేస్తారు కదా అని భవానిని ఇంప్రెస్ చేసే లాగా ముకుందా మాట్లాడుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కృష్ణ ఇంటికి వెళ్లారని ముకుంద చెబితే భవాని ఏం చేస్తుందో చూడాలి.

ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ముకుంద దేవ్ నీ తీసుకొస్తుంది. దేవ్ తన అన్నయ్య అని మురారి కి ముకుంద పరిచయం చేస్తుంది. దేవ్ మురారి తో నాకు ముకుంద ఎంతో కృష్ణ కూడా అంతే అని అంటాడు. ఇక మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar