NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishnamma kalipindhi iddarini: భవానికి చివాట్లు పెట్టిన గౌరీ.. రేపటికి ఊహించని ట్విస్ట్

Krishnamma kalipindhi iddarini August 23 Episode 92 highlights

Krishnamma kalipindhi iddarini: అయినా ఇవాళ రేపు నిజమైన ప్రేమలు ఎక్కడ ఉంది అత్తయ్య అని సునంద అంటుంది. ఎదురుగా గౌరీ రూపంలో నిలువెత్తు కనిపిస్తుంది కదా అమ్మ అని వాళ్ళ అత్తయ్య అంటుంది. నిజమే అత్తయ్య గౌరీ మనసులో ఈశ్వర్ మీద స్వచ్ఛమైన ప్రేమ తప్ప రవ్వంతైనా కల్మషం కానీ స్వార్థం కానీ లేవు అని సునంద అంటుంది.మీరంతా తనను గుడ్డిగా నమ్ముతున్నారు అమ్మ నన్ను పెళ్లి చేసుకున్నది నిజమైన ప్రేమతో కాదు తన చెల్లిని ఇంటికి కోడలు చేయాలన్న స్వార్థంతో అని ఈశ్వర్ మనసులో అనుకుంటాడు. ఒరేయ్ మనవడా గొప్ప గుణగణాలతో పాటు నిన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది మీ మధ్య అంతులేని ప్రేమ తప్ప చిన్న చిన్న అపార్థాలకు చోటు ఉండకూడదు అని వల్ల తాతయ్య అంటాడు. వాళ్ల తాత అలా అనగానే ఈశ్వర్ కి కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు.

Krishnamma kalipindhi iddarini August 23 Episode 92 highlights,
Krishnamma kalipindhi iddarini August 23 Episode 92 highlights,

ఒరేయ్ మనవడా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు అలా లేచి వెళ్ళిపోతావ్ ఏంట్రా అని వాళ్ళ నాయనమ్మ అంటుంది. నీకు తెలుసు కదా అత్తయ్య తను చాలా సెన్సిటివ్ అని వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు అన్న బాధతో అలా వెళ్ళిపోతున్నాడేమో అని సునంద అంటుంది. ఈశ్వర్ తన గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని వాళ్ళ నాన్నగారు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో గౌరీ అక్కడికి వచ్చి ఏమండీ అని అంటుంది. డోంట్ టచ్ మీ భయం అవుతుంది నా తమ్ముడు ఏమైనా చేసుకుంటాడేమోనని అని ఈశ్వర్అంటాడు. అలా ఎందుకు జరుగుతుంది అండి అని గౌరీ అంటుంది.. తెలియదా నీకు అలా ఎందుకు జరుగుతుందా అని నా తమ్ముడు ఎంత అమాయకుడు అంత సెన్సిటివ్ తన భార్య అలాంటి కేసుల్లో ఇరుక్కుంది అని వాడికి తెలిస్తే అవమానాన్ని భరిస్తూ వాడు బ్రతకగలడా అని ఈశ్వర్ అంటాడు. నీ మాటల్లోనూ నీ బాధల్లోనూ అర్థం ఉందండి కానీ నేను మీకు ఎలా సంజయ్సు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అని గౌరీ అంటుంది.

Krishnamma kalipindhi iddarini August 23 Episode 92 highlights,
Krishnamma kalipindhi iddarini August 23 Episode 92 highlights,

నీ సంజాయిషులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఆపగలవా నా తమ్ముడి ప్రాణాలు తీసుకురాగలవా చెప్పు మూడేళ్ల క్రితం నా కళ్ళు పోయాయి నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నువ్వు నన్ను మోసం చేశావు నూరేళ్ల జీవితం గురించి నేను కన్న కలలు కూలిపోయాయి కానీ నా తమ్ముడికి కలలు కళ్ళు రెండు ఉన్నాయిగా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నాను అని వాడు ఇప్పటికే బాధపడుతున్నాడు ఆ బాధకు తోడు తను పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి చెడుగా మాట్లాడుతుంటే నా తమ్ముడు ఏమైపోతాడు ఆ విషయం తలుచుకుంటేనే నా ప్రాణం విలవిలలాడిపోతుంది నేను నిన్ను ప్రేమించిన అందుకు శిక్ష అనుభవించడంలో అర్థం ఉంది కానీ అభం శుభం తెలియని నా తమ్ముడు ఎందుకు శిక్ష అనుభవించాలి తన జీవితం ఎందుకు బలి కావాలి నువ్వు నాకు భార్య అవ్వడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టము అనుకున్నాను నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన తరువాత ప్రతి క్షణం సంతోషంతో ఉంటాను నా జీవితంలో ఇంకా దిగులుతో ఉండను అని అనుకున్నాను కానీ ఇలా ప్రతిక్షణం నరకం ఉంటుందని నేను ఊహించలేదు నిన్ను ప్రేమించినప్పుడు ఈ లోకంలో నాకన్నా అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు అని అనుకున్నాను కానీ నాకన్నా దురదృష్టవంతుడు ఇంకొకడు లేదు అని అనిపిస్తుందిఅని ఈశ్వర్ అంటాడు.

Krishnamma kalipindhi iddarini August 23 Episode 92 highlights,
Krishnamma kalipindhi iddarini August 23 Episode 92 highlights,

గౌరీ వాళ్ళ అత్తయ్య అన్నమాటలు గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ కిందికి వస్తుంది. నేను అక్కడి నుండి తొందరగా వచ్చేసానని నా బంగారు తల్లి ఏమైనా తింటుందో లేదో అని భవాని అనుకుంటుంది. కట్ చేస్తే గౌరీ అక్కడికి వచ్చి నీకు తిండి ఎలా సహిస్తుంది అని అడుగుతుంది. నువ్వేంటే ఉరుములేని వానలాగా ఇలా వచ్చావు అని భవాని అంటుంది. నీవల్లనే వచ్చాను నీకు తెలియదా నువ్వు ఏం చేసావో మోసం చేసి పెళ్లి చేయడం చాలా తప్పు ఆ నిజం తెలిశాక మా కాపురాలు ఏమైపోతాయో అని ఒక్కసారి ఆలోచించు అని మొత్తుకొని చెప్పాను కానీ నువ్వు నా మాట విన్నావా వంద అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయడంలో తప్పు లేదని నీతులు చెప్పావు నువ్వు చెప్పిన అబద్ధాలు నా మెడకి పాముల చుట్టుకున్నాయి అని గౌరీ అంటుంది. అది సరే ఇప్పుడు ఏమైంది అని భవాని అంటుంది.నువ్వు సునంద గారితో పెట్టిన శరత్ ఆయనకు తెలిసిపోయింది నేనే నీతో అలా సునంద గారితో చెప్పించానని ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు నా కుటుంబం కోసం నా చెల్లెలు భవిష్యత్తు కోసం నా మీద ఆయనకున్న ప్రేమని స్వార్థంగా వాడుకున్నానని ఆయన నన్ను నిందిస్తున్నారు ఒకప్పుడు ఆయన నన్ను ఎంతగా ప్రేమించారో ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా ద్వేషిస్తున్నాడు నాతో మాట్లాడడమే కాదు నా నీడను చూసిన అసహ్యించుకుంటున్నాడు నేనొక మోసగత్తనాని పదేపదే అంటుంటే తట్టుకోలేకపోతున్నాను వెళ్దాం పద అని గౌరీ వాళ్ళ అమ్మని లాక్కొస్తుంది.

Krishnamma kalipindhi iddarini August 23 Episode 92 highlights,
Krishnamma kalipindhi iddarini August 23 Episode 92 highlights,

అమ్మ గౌరీ ఎక్కడికి అని భావాన్ని అడుగుతుంది. ఇంత చెప్పినా కూడా ఎక్కడికి అని అడుగుతావేంటి నాకాపురం నా చెల్లెలి కాపురం కూలిపోయేలా ఉంది అఖిలని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చి పెళ్లి చేశామని ఆయనకు తెలిసిపోయింది అఖిల అరెస్టు విషయం మా అత్తగారికి కానీ ఆదిత్య కు కానీ తెలిస్తే మోసం చేసి పెళ్లి చేశారని నన్ను అందరూ అనుకుంటారు ఏం మొహం పెట్టుకొని కోడలుగా అక్కడ ఉండాలి నీకు భయంగానే బాధ గాని లేకుండా ప్రశాంతంగా తింటున్నావే కానీ నాకు మాత్రం ప్రతి క్షణం నిప్పుల మీద నడుస్తున్నట్టు ఉంటుంది అందుకే నువ్వు అక్కడికి వచ్చి నువ్వు ఆయనకు చెప్పు లేదంటే నా కాపురం నా చెల్లెలి కాపురం నాశనం అయిపోతుంది అని గౌరీ అంటుంది.

Krishnamma kalipindhi iddarini August 23 Episode 92 highlights,
Krishnamma kalipindhi iddarini August 23 Episode 92 highlights,

అమ్మ గౌరీ నేను చేసింది తప్పే ఆ తప్పు వెనక నా ఇద్దరి కూతుర్ల జీవితాలు బాగుంటాయి అని చిన్న స్వార్థం తప్ప నా కడుపున పుట్టిన బిడ్డకు మాత్రమే జీవితం బాగుండాలని స్వార్థం నాకు లేదమ్మా చూడమ్మా నేను నీకు సవతి తల్లినే కానీ దుర్మార్గపు తల్లిని కాదు పేగు బంధం ఉండడం వల్లే అఖిల మీద కాస్తంత ప్రేమ ఎక్కువ చూపించాను తప్ప నువ్వు నా కన్న కూతురివి కాదని నిన్ను ఎప్పుడూ హింసించలేదు నేను నీ మీద చూపించిన ప్రేమలో ఎంతో కొంత తేడా ఉండొచ్చు కానీ నా పెంపకంలో మాత్రం ఎలాంటి కుళ్ళు లేదమ్మా కానీ నువ్వు నన్ను ఒక మాట అనొచ్చు సునంద దేవి గారు వచ్చే మా పెళ్లి చేయమని అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు అని నువ్వు నన్ను అడగొచ్చుఅని భవాని అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella