NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo: దాక్షాయినికి చీర కొందామని బజారుకు వెళ్లి డబ్బులు పోగొట్టుకున్న చలపతి..

Madhuranagarilo Today Episode January 18 2024 Episode 264 Highlights

Madhuranagarilo: సడన్ గా ఏంటి బట్టల షాపింగ్ ప్రోగ్రాం అని శ్యామ్ అంటాడు. ఏంటి రాధా చెప్పడానికి అలా మొహమాట పడతావు అని మధుర ఫోన్ తీసుకొని రేపు నల్లపూసల ఫంక్షన్ ఉంది నువ్వు రాదా బట్టల షాపింగ్ కి వెళ్ళాలి త్వరగా రా అని చెప్తుంది. రేయ్ అలాగే రేపు ఆఫీస్ లో ఎంత పని ఉన్నా సరే ఆఫీస్ కి రానని చెప్పు వాళ్ళని ఆఫీసు చూసుకోమని చెప్పి లీవ్ పెట్టి రారా అని మధుర చెబుతుంది. అలాగే అమ్మ అని శ్యామ్ ఫోన్ కట్ చేస్తాడు. రాధా నేను పండును స్కూల్ నుంచి తీసుకు వస్తాను నల్లపూసలు కొనుక్కరడానికి వెళ్తాను కదా అప్పుడు తీసుకువస్తాను కానీ నువ్వు శ్యామ్ షాపింగ్ కి వెళ్ళండి అని మధుర చెబుతుంది.కట్ చేస్తే,సెక్రెటరీ కి ఫోన్ చేసి శ్యామ్  రుక్మిణి మేడం రమ్మని చెబుతాడు. రుక్మిణి వచ్చి ఏంటి సార్ అంత పరాధ్యానంలో ఆలోచిస్తున్నారు దేని గురించి నీ రెండో భార్య గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది. కాదు నీ చేతిలో ఉన్న ఫైల్ గురించి ఆలోచిస్తున్నాను అందులో మిస్టేక్స్ లేకుండా చేసావా అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode January 18 2024 Episode 264 Highlights
Madhuranagarilo Today Episode January 18 2024 Episode 264 Highlights

అందుకే కదా సార్ నేను ఉన్నది చూస్తున్నాను అని రుక్మిణి అంటుంది. ఇంతలో సెక్రెటరీ ని పిలిచి రేపు నేను ఆఫీసుకి రావడం కుదరదు నువ్వు రుక్మిణి  మేడం చూసుకోండి అని చెబుతాడు. అలాగే సార్ అని అతను అంటాడు. రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా సార్ అని రుక్మిణి అంటుంది. అది నువ్వు సెక్రటరీ చూసుకోండి రేపు రావడం కుదరదు అని శ్యామ్ అంటాడు. ఏంటి ఆ ముఖ్యమైన పని నీ రెండో భార్యతో కలిసి సినిమాకు వెళ్తున్నారా అని రుక్మిణి అడుగుతుంది. ఇప్పుడు నల్లపూసల ఫంక్షన్ గురించి చెప్తే గొడవ చేస్తుంది చెప్పకూడదు అని శ్యామ్ అనుకుంటాడు. ఏమీ లేదు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తున్నారంట వాళ్లతో కలిసి టైం స్పెండ్ చేయాలి నువ్వు రేపు లీవ్ పెట్టరా అని అమ్మ చెప్పింది అందుకే ఆఫీస్ కి రావడం కుదరదు అని శ్యామ్ చెప్తాడు. అమ్మ చెప్పింది అంటే ఓకే కానీ రేపు లంచ్ అయిపోయిన తర్వాత ఐదు గంటలకి మనం వేరే దగ్గరికి వెళ్ళాలి సార్ రండి అని చెబుతుంది. ఐదు గంటలకు ఓకే కానీ ఎక్కడికి వెళ్తున్నావ్ అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode January 18 2024 Episode 264 Highlights
Madhuranagarilo Today Episode January 18 2024 Episode 264 Highlights

వెళ్లాక తెలుస్తుందిలే అని రుక్మిణి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,చలపతి దాక్షానికి చీర కొనడానికి బజారుకు వెళ్తాడు అక్కడ ఒక అతను కాయి రజా కాయి అని బెట్టింగ్ ఆడుతూ ఉంటాడు. అక్కడికి వెళ్లి ఆట ఆడి డబ్బులు అన్ని పోగొట్టుకుంటాడు చలపతి. ఇప్పుడు ఎలా డబ్బులు అన్ని పోయాయి దాక్షాయినికి చీర ఎలా కొనడం అని చలపతి అనుకుంటాడు. కట్ చేస్తే, శ్యామ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి రాధ కోసం వెతుకుతూ ఉంటాడు. ఏంట్రా శ్యామ్ ఎవరికోసం వెతుకుతున్నావు రాదా పైన ఉంది అని మధుర చెబుతుంది. అమ్మ రాదా ఈ నల్లపూసల ఫంక్షన్ కి మనస్ఫూర్తిగానే ఒప్పుకుందా అని శ్యామ్ అంటాడు. తనకు ఇష్టముండే కదరా ఒప్పుకుంది అలా అంటావేంటి అని మధుర అంటుంది. ఏమీ లేదమ్మా నా మొదటి భార్య గురించి తెలిసిన కానుంచి రాదా లో కొంచెం మార్పు కనపడుతుంది అని శ్యామ్ అంటాడు. ఏ భార్యకైనా తన భర్తకి  మొదటి భార్య ఉంది అని తెలిస్తే అలాగే ఉంటుంది లేరా ఏమంటారు అండి అని మధుర ధనంజయని అడుగుతుంది.

Madhuranagarilo Today Episode January 18 2024 Episode 264 Highlights
Madhuranagarilo Today Episode January 18 2024 Episode 264 Highlights

ఏమో నాకేం తెలుసు నాకేమైనా ఇద్దరు భార్యలు ఉన్నారా అని ధనుంజయ్ అంటాడు. అవును లేండి మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని మధుర అంటుంది.కట్ చేస్తే,శ్యామ్ రాధ దగ్గరికి వెళ్లి ఏంటి రాధా ఈ నల్లపూసల ఫంక్షన్ కి మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా అని అడుగుతాడు.ఒకరి సంతోషాన్ని పాడు చేయడం ఇష్టం నాకు ఉండదు సార్ అందుకనే ఒప్పుకోవాల్సి వచ్చింది అని రాదా అంటుంది. అంటే నీకు ఇష్టం లేదా రాదా అని శ్యామ్ అంటాడు. ఇష్టమున్న లేకపోయినా తప్పదు కదా సార్ అని రాదా అంటుంది. కట్ చేస్తే, చలపతి అలా డబ్బులు పోగొట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక ఆవిడ  బట్టలు కొనుక్కొని వస్తూ ఉంటుంది. ఆ చీర కొట్టేసి దాక్షాయనికి ఇద్దామని చలపతి ఆవిడ దగ్గర ఉన్న చీరలు లాకుని పారిపోతాడు. రే దొంగ సచ్చినోడా ఆగరా అని వాళ్ళు వెంబడిస్తారు కానీ చలపతి దొరకకుండా పారిపోతాడు. అమ్మయ్య డబ్బులు పోతే పోయాయి కానీ దాక్షాయిని కి చీర దొరికింది ఇది చూసి ఎంత మురిసిపోతుందో అని చలపతి అనుకుంటాడు.

Madhuranagarilo Today Episode January 18 2024 Episode 264 Highlights
Madhuranagarilo Today Episode January 18 2024 Episode 264 Highlights

కట్ చేస్తే, నాగమణి ఈ సామాన్లు అన్ని తీసేయి లేదంటే రుక్మిణి వస్తే ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది అప్పుడు నల్లపూసల ఫంక్షన్ కి వెళ్తున్నామని చెప్పాల్సి ఉంటుంది తనకు ఫంక్షన్ గురించి తెలియకూడదు అని మురళి అంటాడు. వాళ్లు అలా అనుకుంటూ ఉండగా ఇంతలో రుక్మిణి వచ్చేస్తుంది. నేను ఏ ఫంక్షన్ కి రాకూడదు నాన్న నాకెందుకు తెలియకూడదు అని అడుగుతుంది రుక్మిణి. అదేమీ లేదమ్మా పక్క ఊర్లో తెలిసిన వాళ్ల కూతురికి నల్లపూసల ఫంక్షన్ ఉంది అక్కడికి మేము వెళుతున్నాం నువ్వు వస్తే నీ భర్త ఏమయ్యాడు ఎప్పుడు వస్తారు అని గుచ్చి గుచ్చి అడుగుతారు అందుకే రావొద్దు నీకు తెలియకూడదు అని మేము అనుకుంటున్నాం అని నాగమణి చెబుతుంది. అంతేనా ఇంకా ఏమైనా ఉందా అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే,ఏంటి రాధా మౌనంగా ఉన్నావు ఏదైనా మాట్లాడొచ్చు కదా అని శ్యామ్ అంటాడు. కొన్నింటికి మాట్లాడకపోతే నే సమాధానం దొరుకుతుంది సార్ అని రాధా అంటుంది. రాధా నువ్వు ఎందుకు అలా ఉంటున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు కానీ హ్యాపీ గా ఉండి నాతో మాట్లాడొచ్చు కదా అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode January 18 2024 Episode 264 Highlights
Madhuranagarilo Today Episode January 18 2024 Episode 264 Highlights

మాట్లాడాలని ఉంది సార్ కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కానీ రేపు ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా ఆఫీసులో వర్క్ ఉందా అని రాధా అడుగుతుంది. ఏమీ లేదు రాదా ఆఫీస్ కి రానని చెప్పేసాను అని శ్యామ్ అంటాడు. అయితే రేపు మనం ఐదు గంటలకి వేరే దగ్గరికి వెళ్లాలి సార్ ప్రోగ్రాం ఉంది అని రాధా అంటుంది.  అవునా అని ఆలోచించి సరే రాదా కుదురుతుంది అని శ్యామ్ అంటాడు. ఏంటి సార్ ఏదైనా ప్రోగ్రామ్ ఉందా అయితే టైం మార్చుకుందాం అని రాదా అంటుంది. వద్దులే రాదా ఆ ప్రోగ్రాంనే టైం మారుస్తాను కానీ నువ్వు చెప్పిన ఐదు గంటలకి ఈ ప్రోగ్రాం కి వెళ్దాం అని శ్యామ్ అంటాడు. అంటే అక్క కూడా ఐదు గంటలకి సార్ ని రమ్మని చెప్పు ఉంటుంది దాని గురించి సార్ అనుకుంటా చెప్పేది ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ఒక్కటే అని సార్ కి తెలియదు కదా అని రాదా అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella