Madhuranagarilo November 17 2023 Episode 212: అత్తయ్య పండుని వదిలిపెట్టి నేను ఫారన్ కి వెళ్ళను అత్తయ్య అని రాదా వాళ్ళ అత్త మీద పడి ఏడుస్తుంది.రాధా ఊరుకో అమ్మా శ్యామ్ ఫారన్ కి వెళ్లకుండా నేను చూసుకుంటాను కదా అని మధుర అంటుంది. అది కాదమ్మా నేను చెప్పేది అర్థం చేసుకోండి అని శ్యామ్ అంటాడు. నువ్వు ముందు ఇకనుంచి వెళ్ళరా అని మధుర కోపంగా అంటుంది. శ్యామ్ లోపలికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఏమండీ ఈ టాబ్లెట్ వేసుకోండి అని నాగమణి అంటుంది. టాబ్లెట్ వేసుకుని బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి రెండు కళ్ళ లాంటి కూతుర్ల జీవితాలు అన్యాయమైపోతుంటే చూసి ఇంకా ఎన్నాళ్లు బ్రతకాలి దాని కన్నా చావడం మేలు అని మురళి అంటాడ. అలా అంటారేంటండి సమస్య సృష్టించిన వాడే సమస్యని తీరుస్తాడు మన చేతిలో ఏముంది చెప్పండి అంతా ఆ భగవంతుని మీదనే భారం వేద్దాం అని నాగమణి అంటుంది. కట్ చేస్తే,శ్యామ్ నైట్ అంతా ఆలోచిస్తాడు.

ఇంతలో తెల్లవారింది. అమ్మ నేను ఫారన్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నానో రాధకు చెప్పేస్తాను అప్పుడు రాదా నన్ను అర్థం చేసుకుంటుంది అని శ్యామ్ అంటాడు. ఇంతలో రాదా కిందికి వచ్చి బయటికి వెళ్తూ ఉండగా, శ్యామ్ రాదని పిలిచి రాధ నేను ఫారన్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నాను చెప్తాను విను అని శ్యామ్ అంటాడు. శ్యామ్ కారణం ఎందుకు చెప్పడం ఫారన్ కి వెళ్తున్నావా లేదా చెప్పు అని మధుర అంటుంది. లేదమ్మా కారణం చెప్తేనే కదా రాద నన్ను అర్థం చేసుకునే ఫారన్ కి వస్తుంది, ఇలా మాట్లాడే అవసరం వస్తుందని కూడా నేను అనుకోలేదు కానీ వచ్చింది మన రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది

ఆ ప్రాబ్లం రోజు రోజుకి పెరిగి ఇంకా పెద్దది అవుతుంది దాని గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను,అందుకే ఆ బాధ్యతను అంతా ఆఫీస్ వాళ్లకు అప్పగించి మనం ఫారన్ కి వెళ్ళిపోదాం అంటున్నాను పారన్ కి వెళ్లిన తర్వాత కొన్నాళ్లు హ్యాపీగా గడిపి మళ్లీ ఇండియాకి తిరిగి రావచ్చు అనుకున్నాను, కానీ నీకు ఫారన్ రావడం ఇష్టం లేదని నాకు అర్థమైంది నేనున్న టెన్షన్లో పండును వదిలేసి వెళ్దాం అన్నాను కానీ నిజానికి పండును వదిలేసి నేను ఉండగలనా,పండు వల్ల నాన్నను పట్టుకొని పండు ఆరోగ్యం కుదుటపడేలా చేయాలని నీకు ఎంత ఆరాటం ఉందో నాకు అంత ఆరాటం ఉంది అందుకే ఫారన్ వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను ఇక్కడే ఉండి ఆ సమస్యను ఎదురుకోవాలని నిర్ణయించుకున్నాను అని శ్యామ్ అంటాడు. థాంక్స్ అండి అని రాదా అంటుంది. శ్యామ్ వాళ్ల అమ్మ నాన్నలు సంతోషిస్తారు. సారీ అండీ నిన్న పండుని అలా అనేసరికి కోపడ్డాను అని రాధ అంటుంది. నిజానికి నేనే సారీ చెప్పాలి రాధా ఇంకెప్పుడూ నిన్ను బాధ పెట్టను అని శ్యామ్ అంటాడు. ఉండండి ఇప్పుడే ఈవిషయం పండుకి చెప్తాను అని రాదా వెళ్లిపోతుంది. పండు లే నాన్న మనం ఫారన్ కి వెళ్లట్లేదు నీకు స్కూల్ కి టైం అవుతుంది కదా నిన్ను స్కూల్ దగ్గర నేను డాడీ డ్రాప్ చేస్తా అని రాధా అంటుంది. కట్ చేస్తే, శ్యామ్ నువ్వు తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది కానీ నీ మొదటి భార్య గురించి ఏం ఆలోచించావు నీకోసం వెతుక్కుంటూ వచ్చినా ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు అని మధుర అడుగుతుంది.

నిన్ను వెతుక్కుంటూ ఆ అమ్మాయి మన ఇంటికి వస్తే రాదా నీకు దూరమైపోతుంది కదరా అని ధనంజయ్ అంటాడు. లేదు నాన్న రాదు నాకు దూరం అవ్వకూడదు నేను ఫారన్ వెళ్ళకూడదు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని శ్యామ్ అంటాడు. రే శ్యామ్ ఆ అమ్మాయి అడ్రస్ చెప్పరా మేము వెళ్లి నీకు పెళ్లి అయ్యిందని ఎలాగో అలా కన్విస్ చేసి చెప్తాము అని ధనంజయ్ అంటాడు. ఆ అమ్మాయి పేరు తెలుసు ఊరు తెలుసు కాని అడ్రస్ తెలియదు నాన్న అని శ్యామ్ అంటాడు. రాధ వల్ల నాన్నది కూడా అదే ఊరు కదరా ఆయనకు చెప్తే ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటాడు అని ధనంజయ్ అంటాడు.

లేదు నాన్న మీరు ఈ విషయంలో ఏమి ఇన్వాల్వ్ కావద్దు నేనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కదా నేనే చూసుకుంటాను అని శ్యామ్ అంటాడు. కాదు నాన్న మేము పెద్దవాళ్ళం కదా మాట్లాడితే ఏమైనా కన్విన్స్ అవుతుందేమో అని మధుర అంటుంది.లేదమ్మా మీరు వెళ్లి మాట్లాడితే దానికి చులకన అయిపోతారు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి కూర్చుంటుంది అప్పుడు రాద వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అందుకే నేనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను అని శ్యామ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, మధుర వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. ఏంటి సుభాషిని ఇన్నాళ్లకు మా ఇల్లు గుర్తుకు వచ్చిందా అని మధుర అంటుంది. ఏమీ లేదు మధురా ఆరేళ్ల క్రితం మా అబ్బాయికి పెళ్లి చేశాం భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారు, రెండేళ్ల తర్వాత వాడికి మళ్ళీ పెళ్లి చేశానువాడు ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటే వాడి మొదటి భార్య తిరిగి వచ్చింది అని సుభాషిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది