Madhuranagarilo Episode 214: రాధ జుట్టుకి సామ్రాని వేసుకుంటుంటే శ్యామ్ చూస్తాడు, రాధ దగ్గరికి వస్తాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అడుగుతుంది రాధ. ఏంటి ఇలా వచ్చారు నాతో ఏమైనా పని ఉందా అని అడుగుతుంది. నేను నీకోసం రాలేదు ఫోన్ చార్జర్ కోసం వచ్చాను అని చెప్తాడు. రాధ చార్జింగ్ తేవడానికి వెళ్తుంటే జారీ పడబోతుంటే శ్యామ్ పట్టుకుంటాడు దాంతో ఇద్దరు బెడ్ మీద పడతారు, ఇద్దరు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటారు.పట్టుకున్నందుకు సారీ చెప్పి వెళ్ళిపోతాడు శ్యామ్. కట్ చేస్తే,రాధ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది.ద్రాక్షాయిని చలపతి ఇంటి గేట్ ముందు కూర్చుంటారు.మా గేట్ ముందు కూర్చున్నారు ఎవరు అని అడుగుతుంది రాధ.

కలుపుకుంటే బంధువులమవుతాం కాదనుకుంటే రాబంధువులం అవుతాము అని ద్రాక్షయిని చెప్తుంది. అర్థం కాలేదు కదా, నా భార్య నాకే ఇంతవరకు అర్థం కాలేదు ఇప్పుడే పరిచయం అయిన నీకేం అర్థం అవుతుందిలే అని అంటాడు చలపతి. నేను ధనుంజయ్ చెల్లెలిని అని చెప్తుంది ద్రాక్షాయిని.మరి మీరంటే గేటు బయట కూర్చున్నారు లోపలికి రావచ్చు కదా అని అంటుంది రాధ. లోపలికి వస్తే బయటికి గెంటేస్తాడు మా అన్నయ్య అని చెప్తుంది ద్రాక్షయిని. కొంచెం వెళ్లి మా అన్నయ్యకి చెప్పు అని అంటుంది. రాధ లోపలికి వెళ్లి మావయ్య మీ చెల్లెలు వచ్చింది అని చెప్తుంది. అది ఎందుకు వచ్చింది ఇప్పుడు పదండి ఏంటో కనుక్కుందాం అని వెళ్తారు బయటికి. ఎందుకొచ్చారు అని ధనుంజయ్ అడుగుతాడు

అదేంటి మామయ్య ఆడపడుచు పుట్టింటికి వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతారు ఏంటి అని రాధ అంటుంది. దీని సంగతి నీకు తెలియదు,ఇది పుట్టింటికి నిప్పు పెట్టే రకం అని ధనుంజయ్ అంటాడు. మమ్మల్ని క్షమించు అన్నయ్య, ఈయన వ్యాపారం అంటూ ఉంటే మీకు తెలియకుండా ఇంట్లో ఉన్న వడ్డానాన్ని ఇచ్చాను అని ద్రాక్షయిని అంటుంది. వ్యాపారంలో లాభం వచ్చాక మీ వడ్డానం మీకు తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నాను బావగారు, కానీ వ్యాపారంలో లాభం రాలేదు, అందుకే వడ్డానం ఇవ్వలేక మా మొహాలను చూపించి వెళదామని వచ్చాము అని అంటారు చలపతి.

ఇంకోసారి బంగారం దొంగతనం చేసి బంగారం లాంటి అన్నయ్యని దూరం చేసుకోను అన్నయ్య అని అంటుంది. చాలమ్మా చాలు నీ నటన ఆపు, నిన్ను నమ్మి ఇంకోసారి ఇంట్లోకి రానివ్వను, గతంలో చేసిన దాన్ని మర్చిపోలేను అని మధుర అంటుంది. సరే వదిన నీ ఇష్టం, పదండి ఏదో పాడుపడ్డ నుయ్యో గొయ్యో చూసుకుందాం అని ద్రాక్షయిని అంటుంది. మామయ్య మీకు చెప్పే అంత దానిని కాదు,కానీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల అలా ఏడుస్తూ వెళ్లడం మంచిది కాదు,గతంలో ఆవిడ తప్పు చేసి ఉండొచ్చు,కానీ తప్పు తెలుసుకొని తిరిగి వచ్చానని చెప్తుంది కదా ఈ ఒక్కసారి క్షమించి లోపలికి రానివ్వండి మామయ్య అని అంటుంది రాధ. నాన్న రాధ చెప్పినట్టు అత్తయ్యని ఇంట్లోకి రానివ్వండి అని శ్యామ్ చెప్తాడు.

తెలిసో తెలియకో గతంలో తప్పు చేసింది,తోడబుట్టిన వాడివి నువ్వు క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు అని అంటాడు శ్యామ్. ఏవండీ ఒక విధంగా ఆలోచిస్తే పిల్లలు చెప్పిన కూడా కరెక్టే అనిపిస్తుంది మధుర అంటుంది. ఇంటికి వచ్చిన ఆడ పడుచు ఆనందంతో వెళ్లాలి కాని కన్నీళ్ళతో వెళ్ళకూడదు, ద్రాక్షాయిని చేసిన తప్పుని నేను క్షమిస్తున్నాను, మీరు క్షమిస్తే లోపలికి రానివ్వండి అని మధుర అంటుంది. మీ మాటను గౌరవిస్తూ వాళ్లని లోపలికి రానిస్తున్నాను అని ధనుంజయ్ అంటాడు. సంయుక్త శ్యామ్ షర్ట్ పట్టుకొని ఎం చేస్తున్నాడో నా సుందరుడు అని అనుకుంటుంది.సంయుక్త శ్యామ్ ని ఊహించుకొని డాన్స్ చేస్తుంది.