Madhuranagarilo September 16th Episode: ఏంటి మధుర నీకు కృష్ణాష్టమి అంటే చాలా ఇష్టం కదా ఎప్పుడు చాలా బాగా చేసుకుంటావు కదా అని ధనుంజయ్ అంటాడు. కానీ ఈ సంవత్సరం మాత్రం నేను హ్యాపీగా ఉండలేను అని అంటుంది. ఎందుకలా అని శ్యామ్ అంటాడు.ఎందుకో నీకు తెలియదా అని మధుర అంటుంది. రాధ వల్లనే కదా అని శ్యామ్ అంటాడు. అవున్రా రాధ వల్లనే రాధని ఈ కాలని నుంచి పంపించేయి అని నేను ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు అని మధుర అంటుంది. ఈ ఇంటి కోడలు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతుందమ్మా అని శ్యామ్ అంటాడు. కొంపతీసి మాకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావా ఏంటి అని మధుర అంటుంది.

అలాంటిది ఏం లేదమ్మా అని శ్యామ్ అంటాడు. మరి ఇంటి కోడలు అంటావ్ ఏంట్రా అని మధుర అంటుంది.అంటే నేను రాధ మెడలో తాళి కట్టకపోయినా మా ఇద్దరి పెళ్లి ఎప్పుడు అయిపోయింది అమ్మ అని శ్యామ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నాడండి అని మధుర అంటుంది. అంటే పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అంటారు కదా అలా మీ పెళ్లి స్వర్గంలో జరిగిందా అని ధనుంజయ్ అంటాడు. అలాంటిదేం లేదు మా పెళ్లి ఫ్రేమ్స్ లో కూడా జరిగిపోయింది అని శ్యామ్ అంటాడు. ఫ్లేమ్స్ ఏంట్రా అని మధుర అడుగుతుంది. అంటే ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ ఆ ఎనీమీస్ ఆ లేకపోతే భార్యాభర్తల అని తెలుసుకోనే జాతకం లాంటిది అని చెప్తాడు శ్యామ్. అంటే రాధ ఈ ఇంటి కోడలు అవుతుందా అలా జరగడానికి వీల్లేదు అని మధుర తన మనసులో అనుకుంటుంది.

కట్ చేస్తే, శ్యామ్ నేను ఇచ్చే చీర కట్టుకుందో లేదో అని అనుకుంటాడు. కట్ చేస్తే,రాధ తయారవుతుంది. పండు వచ్చి అడుగుతాడు ఈ చీర చాలా బాగుంది, ఎవరి సెలక్షన్ అని అడుగుతాడు. స్వప్న సెలక్షన్ అని రాధ చెప్తుంది. మొదటిసారి పండుకి అబద్ధం చెప్పాను చెప్పకుండా ఉండాల్సింది అని రాధ తన మనసులో అనుకుంటుంది. రాధ వాళ్ళ నాన్నని కలుద్దాం అనుకున్న ప్రతిసారి మిస్ అవుతుంది అని శ్యామ్ అనుకుంటాడు. శ్యామ్ వచ్చి పండుని అడుగుతాడు మీ మమ్మీ చీర కట్టుకుందా. కట్టుకుంది, గిఫ్ట్ గా వచ్చిన చీర కట్టుకుంది, స్వప్న ఆంటీ ఇచ్చిన చీర కట్టుకుంది అని పండు చెప్తాడు.శ్యామ్ రాధ ని చూస్తాడు.తను ఇచ్చిన చీర కట్టుకుందని చాలా సంతోషపడతాడు. ఇదేంటి శకునాలు అన్ని వాళ్లకు అనుకూలంగా ఉన్నాయి శకునాలు వాళ్లకు అనుకూలంగా ఉన్న మధుర ఆంటీ నాకు అనుకూలంగా ఉంది, ఇప్పుడు రాధ వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉండుంటాడు ఒకవేళ చూస్తే ముందు గొడవైనా తర్వాత పెళ్లి అవుతుంది, రాధ వాళ్ళ నాన్న వచ్చేస్తున్నాడు ఇప్పుడు వాళ్లను చూస్తే నా పని మటాష్, ఇప్పుడేం చేయాలి రాధ వాళ్ళ నాన్నకి శ్యామ్ ఎలా ఉంటాడో తెలుసు కానీ శ్యామ్ కి రాధ వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి కలర్లు పూస్తే సరిపోతుంది అని కలర్ పూస్తుంది. హ్యాపీ కృష్ణాష్టమి అని అంటుంది.

నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోతే నేను హ్యాపీగా ఉంటాను అని శ్యామ్ అంటాడు. ఇంతకీ మొహం మీద రంగులేంటి బాబు అని రాధ వాళ్ళ నాన్న అడుగుతాడు. ఉట్టి కొట్టేటప్పుడు పూయాల్సిన రంగులు ముందే పూశారు కొంతమంది అని చెప్తాడు శ్యామ్. సరే నాన్న లోపలికి వెళ్దాం పద అని రాధ వాళ్ళ నాన్న వెళ్ళిపోతారు.కట్ చేస్తే, శ్యామ్ కృష్ణుడి విగ్రహం పట్టుకొని వస్తాడు బయటికి. మెట్లు దిగుతుంటే కాలుజారి పడబోతుంటే రాధ పట్టుకుంటుంది. పడిపోతున్న విగ్రహాన్ని పడిపోకుండా ఆపావు తల్లి అని పంతులుగారు చెప్తారు. అక్కడి వరకు నువ్వు కూడా విగ్రహాన్ని పట్టుకొని రా అమ్మ అని అంటాడు. ఏంటమ్మా అలా చూస్తున్నావ్ పంతులు గారు చెప్పారు కదా పదండి అని ధనుంజయ్ అంటాడు. ఎంతసేపు చూసుకుంటారు పదండి అని మధుర అంటుంది. విగ్రహాన్ని తీసుకొని వెళ్లి అక్కడ పెడతారు.

రాధ వాళ్ళ నాన్న కూడా వస్తాడు. మధురని చూసి ఈవిడని ఎక్కడో చూసినట్టుందే అని అనుకుంటాడు రాధ వాళ్ళ నాన్న. వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ ఏరియా చూసినట్టు ఉందని డాక్యుమెంట్స్ కోసం వచ్చాను కదా గుర్తొచ్చింది అని అనుకుంటాడు రాధ వాళ్ళ నాన్న. ఆవిడేంటమ్మా అంత సీరియస్ గా ఉంది అని రాధ వాళ్ళ నాన్న అడుగుతాడు. వాళ్ళ అబ్బాయి పెళ్లి ఈమధ్య ఆగిపోయింది అందుకే అలా ఉన్నది అని అంటుంది రాధ. అవును ఆవిడ శ్యామ్ వాళ్ళ అమ్మ కదా అని అంటాడు వాళ్ళ నాన్న. మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది రాధ. వెళ్లి పలకరించి వస్తారు అని వెళుతూ ఉంటే నాన్న వద్దు ఆవిడ అసలే బాధలో ఉన్నారు కదా అని అంటుంది రాధ. రాధ వాళ్ళ నాన్నకి ఫోన్ వస్తే పక్కకి వెళ్లి మాట్లాడుతాడు. రాధ వెళ్లి బియ్యం లో పసుపు కలిపి తీసుకొని రా అని అంటాడు ధనుంజయ్. ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.