Guntur Kaaram: “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ పై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గుంటూరులో జరగటానికి కారణం త్రివిక్రమ్ గారు.. మీరందరూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్ కంటే ఎక్కువ… ఫ్యామిలీ మెంబర్ మాదిరిగా. నేనెప్పుడూ ఆయన గురించి బయట మాట్లాడను ఎందుకంటే ఇంట్లో వాళ్ల గురించి.. బయట ఎందుకు మాట్లాడతాం. కాని గత రెండు సంవత్సరాలు ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్.. స్ట్రెంత్ ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనతో సినిమా చేసినప్పుడల్లా నా పెర్ఫార్మెన్స్ లో ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అది నాకు కూడా తెలియదు.
“అతడు” చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. “ఖలేజా”లో ఒక మ్యాజిక్ జరిగింది. అదే మ్యాజిక్ ఇప్పుడు “గుంటూరు కారం”లో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు. దానికి త్రివిక్రమ్ గారే కారణం. ఐ లవ్ యూ సర్ అంటూ త్రివిక్రమ్ పై మహేష్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో “అతడు”, “ఖలేజా” సినిమాలు చేస్తున్న సమయంలో మహేష్ నటనలో కొత్త యాంగిల్ బయటపడింది. “అతడు”లో చాలా సైలెంట్ పాత్రలో కనిపించిన మహేష్ ప్రొఫెషనల్ గా ప్రేక్షకులను అలరించాడు. “ఖలేజా”లో ఫుల్ సెటైర్లు వేస్తూ మంచి కామెడీ చేయడం జరిగింది. “ఖలేజా” సినిమా రాకముందు వరకు మహేష్ బాబు కామెడీ చేయలేడు అనే టాక్ ఇండస్ట్రీలో ఉండేది.
కానీ “ఖలేజా” లో మహేష్ పెర్ఫార్మన్స్ తో ఆయనలో ఉన్న కామెడీ హ్యూమర్ నీ డైరెక్టర్ త్రివిక్రమ్ బయట పెట్టడం జరిగింది. ఈ రెండు సినిమాలు ధియేటర్లలో పెద్దగా ఆడకపోయినా గానీ టీవీలలో ఇప్పటికీ కూడా ఆదరణ దక్కించుకుంటాయి. ఇక “గుంటూరు కారం”లో ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ దర్శకుడు మహేష్ బాబుని చూపించనీ విధంగా మాస్ పాత్రలో త్రివిక్రమ్ చూపించారు. తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో… కొత్త మహేష్ బాబునీ సినిమాలో చూస్తారని కామెంట్లు చేయటంతో.. “గుంటూరు కారం” పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!