Malli Nindu Jabili: మల్లి అరవింద్ ఓకే ట్రయల్ రూమ్ లో నుంచి బయటికి వస్తారు. అది చూసిన మాలిని అరవింద్ నువ్వు ఇంత సిగ్గుమాలిన పని చేస్తావని నేను అసలు అనుకోలేదు ఇది షాపింగ్ మాల్ ని కూడా మరిచిపోయారా అనిమాలిని అంటుంది. మల్లి నీకు అసలు సిగ్గు శరం రోషము ఇవేవీ లేవా చి అని గౌతమ్ వంక చూసి మాలిని కోపంగా వెళ్ళిపోతుంది. గౌతమ్ ఏమంటాడొనని మల్లి వనికి పోతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ అక్కడికి వస్తాడు. ఏమండీ నేను అనుకోకుండా వెళ్ళిపోయాను నేను కావాలని చేయలేదు అని మల్లి ఏడుస్తూ అంటుంది. మల్లి ది తప్పేం లేదు సార్ ఫోన్ మాట్లాడుకుంటూ నేను వెళ్లి డోర్ వేసుకోలేదు డ్రెస్సును చూసుకుంటూ మల్లి అదే రూమ్ లోకి వచ్చింది తన తప్పేమీ లేదు తనను ఏమీ అనకండి సార్ అని అరవింద్ అంటాడు.

మల్లి ఇప్పుడు ఏమైంది ఎందుకలా భయపడుతున్నావ్ నేను నిన్ను ఏమీ అనలేదు కదా అని గౌతమ్ అంటాడు. అది కాదండి డ్రెస్ ను చూసుకుంటూ నేను మర్చిపోయాను అని మల్లి అనబోతుండగా. మల్లి ఇలాంటి చిన్న చిన్న అపార్ధాలు జరుగుతూ ఉంటాయి మనము మనుషులమే కదా అర్థం చేసుకుంటే సరిపోతుంది పద వెళ్దాం అని గౌతమ్ మల్లినీ తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మాలిని వసుంధర దగ్గరకు వచ్చి ఏడుస్తుంది.మాలిని ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నావు అని వసుంధర అంటుంది. మా ఇద్దరి మధ్య ఏ డిస్టర్బెన్స్ వచ్చినా అది మల్లి ఇదే అయి ఉంటుంది అని మాలిని అంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పు మాలిని అని శరత్ అంటాడు. ఇంతలో అరవింద్ కూడా అక్కడికి వస్తాడు నేను ఎందుకు చెప్పడం ఆయనే చెప్తాడు వినండి అని మాలిని అంటుంది. మాలిని ఇంటికి వెళ్దాం పద తప్పైపోయింది అనుకోకుండా జరిగింది అంటున్నాను కదా అని అరవింద్ అంటాడు.

ఓ నీ గురించి నువ్వు చెప్పుకోవు కదా నేనే చెప్తాను వినండి నా మొగుడితో కలిసి నేను షాపింగ్ కి వెళ్ళాను తన మొగుడిని తీసుకొని మల్లి కూడా అదే షాపింగ్ మాల్ కి వచ్చింది మేడంగారిది రేపు బర్త్డే అంట నేను సెలెక్ట్ చేసుకున్న చీర తనకు నచ్చిందని సారు దానం చేశారు అది సరిపోదు అన్నట్టు ట్రయల్ రూమ్ లోకి వీళ్ళిద్దరూ వెళ్లారు వాళ్ళిద్దరూ బయటికి వస్తుండగా నేను గౌతమ్ అక్కడే నిలబడి చూశాము అని మాలిని అంటుంది. మాలిని మల్లి గురించి తప్పుగా మాట్లాడకండి అని మీరా అంటుంది. అనుకోకుండా జరిగిపోయిందని అరవింద్ అంటున్నాడు కదా అని శరత్ అంటాడు. మల్లి ఒక్క మొగుడితో సర్దుకుపోదని నేను చెప్పాను కదా అని వసుంధర అంటుంది. వసుంధర ఏం మాట్లాడుతున్నావ్ నోరు అదుపులో పెట్టుకో అని శరత్ అంటాడు. ఇద్దరూ ఒకటే కదా అందుకే డాడీ కూడా అలాగే మాట్లాడుతున్నారు మామ్ అని మాలిని అంటుంది.

అలగా జనాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టాడు మనల్ని అనగదొక్కుతున్నారు చెప్తా ఏదో ఒక రోజు వీళ్లందరికి కరెక్ట్ అయిన సమాధానం చెప్తా నువ్వు రా మాలిని అని వసుందర మాలినిని తీసుకొని వెళ్ళిపోతుంది. బాబు గారు మేము ఎంత మంచిగా ఆలోచించినా మా మీద నిందలు వేస్తున్నారు మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుండు అని మీరా అంటుంది.మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మల్లి ని వేదించుకు తింటారే పిచ్చి మొఖం దాన అని జగదాంబ అంటుంది. కట్ చేస్తే గౌతమ్ మల్లి బ్యూటీ పార్లర్ దగ్గరికి వస్తారు. మల్లి కారు దిగు అని గౌతమ్ అంటాడు. మల్లి పరధ్యానంలో ఉంటుంది. మల్లి దేని గురించి ఆలోచిస్తున్నావు అని గౌతమ్ అంటాడు. ఏమీ లేదండి షాపింగ్ మాల్ లో జరిగిందాని గురించి ఆలోచిస్తున్నాను అని మల్లి అంటుంది.

నేను అది అక్కడే మర్చిపోయాను నువ్వే ఇక్కడి దాకా మోసుకొచ్చావు సరేలే పద రేపు నీ బర్త్డే కదా ఫేషియల్ చేయించుకో అని గౌతమ్ అంటాడు. ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకండీ నాకు నచ్చదు అని మల్లి అంటుంది. నీకేం తెలియదు నువ్వు కూర్చో, చూడండి రేపు నా భార్య పుట్టిన రోజు అందరిలో చందమామ లాగా వెలిగిపోవాలి అందుకనే తన మొహాన్ని ఫేషియల్ చేయండి అని గౌతమ్ అంటాడు. మల్లి కి ఫేషియల్ చేసి రామ్ మేడానికి నెయిల్ పాలిష్ పెట్టు అని అంటుంది. మల్లి కి నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది