Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో కృష్ణ అరవిందకు అపాయం తలపెట్టాలనుకుంటాడు. కానీ కృష్ణ ప్లాన్ ని పద్మావతి తిప్పి కొడుతుంది. పద్మావతి కృష్ణని అన్నయ్య అని పిలుస్తుంది. నువ్వు ఎలా పిలిచినా కానీ నీ మీద నా ప్రేమ మాత్రం తగ్గదు అని పద్మావతి చేయి పట్టుకుంటాడు కృష్ణ అక్కడే ఉన్న ఆర్య ఇదంతా చూస్తాడు. అరవింద ను అడ్డు తొలగించుకోనైనా నిన్ను దక్కించుకుంటాను అని అనడం ఆర్య విని ఒక్కసారిగా భావ అని గట్టిగా అరుస్తాడు. ఆర్య కృష్ణతో గొడవ పడతాడు. అప్పుడే అక్కడికి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు.

ఈరోజు 440 వ ఎపిసోడ్ లో,ఈ నీచుడు దుర్మార్గుడక్క నిన్ను మోసం చేస్తున్నాడు అని అంటాడు ఆర్య. కుచల ఎందుకు బావ గురించి అలా మాట్లాడుతున్నావు అని అంటుంది. నీకు తెలియదమ్మా వీడు మనందరి ముందు నటిస్తున్నాడు అని అంటాడు ఆర్య. పద్మావతినిఏడిపిస్తున్నాడు,అక్కని పెళ్లి చేసుకుంది ఈ ఆస్తి కోసమే తన మీద ప్రేమతో కాదు అని ఆర్య అంటాడు వెంటనే అరవింద ఏం మాట్లాడుతున్నావ్ ఆర్య అని అరుస్తుంది. నిజమే మాట్లాడుతున్నాను అక్క వీడి పద్మావతి తో మాట్లాడిందంతా నేను విన్నాను. నిన్ను అడ్డు తప్పించుకొని అయినా పద్మావతిని దక్కించుకుంటాను అని అన్నాడు.

నిజం చెప్పిన అక్క చెల్లెలు..
ఇక అరవింద ఆర్య మాటలకు షాక్ అవుతుంది. నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది.నా భర్త శ్రీరామచంద్రుడు,ఇంకొక అమ్మాయిని చూసాడు అంటే నేను నమ్మను అంటుంది అరవింద. రాముడు కాదు అక్క వీడు రాక్షసుడు అని అంటాడు ఆర్య.రావణాసురుడక్క వీడు అందుకే పద్మావతిని అబద్ధం చెప్పైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అదృష్టం బాగుండి పద్మావతి విక్కిని పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ ఇంకా పద్మావతిని కోరుకుంటున్నాడు అక్క నా కల్లారా చూశాను అని అంటాడు ఆర్య ఏమిటి కృష్ణ అందరూ ఇలా అంటున్నా కానీ నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే నిజం, చెప్తున్నాడనిగా ఆర్య అని అంటుంది. ఇంకా ఆయన అడుగుతావేంటమ్మా తల దించుకున్నాడు అంటే అర్థం తప్పు చేశాడని అని అంటాడు ఆర్య. పద్మావతి ఇప్పటికైనా నోరు తెరిచి నిజం చెప్పు అంటారు ఆర్య. అది కాదు బావగారు అని పద్మావతి అంటూ ఉంటే నిజం చెప్తే మా అక్క ఏమైపోతుందో, అని ఆలోచిస్తున్నావు కదా నిజం చెప్పు పద్మావతి అని అంటాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అని కృష్ణ మనసులు అనుకుంటూ ఉంటాడు. అయినా నిన్ను ఎంత నమ్మేమో అలాంటిది నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు కృష్ణ అని అంటుంది కుచల. అరవింద షాక్ లోనే ఉంటుంది. అరవింద నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నిజం చెప్పు నా కడుపులో పెరుగుతున్న మా అమ్మ మీద ఒట్టేసి చెప్పు అని అంటుంది ఇక పద్మావతి షాక్ అవుతుంది. ఏం చేయాలో తెలీక నిజం చెప్పేస్తుంది పద్మావతి

కృష్ణని ఇంట్లో నుంచి గెంటేసి అరవింద..
ఇక పద్మావతి అవును ఆర్య చెప్పింది అంతా నిజం అని ఒప్పుకుంటుంది. వెంటనే అను కూడా దానికి సాక్ష్యం నేనేనండి అని అంటుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా దగ్గర అబద్ధం చెప్పి మా పద్మావతిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తర్వాత నిజం తెలిసి మేము ఈ దుర్మార్గం నుంచి దూరంగా మా పద్మావతిని కాపాడుకోగలిగాము అని అంటుంది. ఇప్పటికి వీడు మిమ్మల్ని ఇంకా మోసం చేస్తూనే ఉన్నాడు. అని అను చెప్పిన తర్వాత అరవింద కృష్ణతో నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను మీరు ఇలా చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు అని అంటుంది. మీరు నన్ను చంపేసిన నేను బాధపడేదాన్ని కాదు కానీ నా ప్రేమ మీద నమ్మకం మీద దెబ్బ కొట్టారు. మిమ్మల్ని చూడ్డానికి కూడా నేను ఇష్టపడటం లేదు మీరు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అని అంటుంది. అది కాదు రానమ్మ నేను చెప్పేది ఒకసారి విను అంటాడు కృష్ణ నేను ఇంకేం విందాల్చుకోలేదు. ఇంకొకసారి మీరు నన్ను అలా పిలవద్దు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అని అంటుంది. కృష్ణ ఏదో చెప్పబోతుంటే అరవింద కాలర్ పట్టుకుని కృష్ణని బయటకి నెట్టేస్తుంది. మావికి ఇంట్లో లేడు కాబట్టి నా కంట్లో నుంచి నీరు తెప్పించిన నిన్ను ఒంట్లో నుంచి రక్తం వచ్చేలాగా శిక్షించి పంపించేవాడు వాడు లేడు కాబట్టి బతికి పోయారు ఇకమీదట మా కంట పడొద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది. కృష్ణ కలలో నుంచి బయటికి వస్తాడు. అంటే ఇప్పుడు దాకా జరిగిందంతా కృష్ణ కలగన్నాడు.కలలో నుంచి బయటికి వచ్చిన కృష్ణ నేను ఆవేశపడితే నిజంగానే జరుగుతుంది నేను కూల్ గా పని సాధించాలి. తొందరపడకూడదు విక్కీ పద్మావతిలని విడదీయడానికి ఒక అవకాశం కోసం ఎదురు చూడాలి అనుకుంటాడు.
Krishna Mukunda Murari: ముకుందని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా భవానీ దేవి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

వదిన మరదళ్ల అనుబంధం..
ఇక పద్మావతి అను ఇద్దరూ అరవింద్ దగ్గరికి వచ్చి వదిన అని గట్టిగా పిలుస్తారు. అరవింద ఏంటి ఇద్దరూ ఒకేసారి అలా పిలిచారు అని అంటుంది. మీ గోరింటాకు చూపించండి అని అడుగుతారు. గోరింటాకు చూపిస్తుంది అరవింద మా వదిన మనసు మంచిది కాబట్టి చక్కగా పండింది అని అంటుంది పద్మావతి.మీ గోరింటాకు చూపించండి అంటుంది అరవింద మేము ఇప్పుడే పెట్టుకున్నాము అని చూపిస్తారు అదేంటి ఇప్పటిదాకా ఎందుకు పెట్టుకోలేదు అంటుంది అరవింద్ మాకు ఇప్పుడే పని అయిపోయినది అందుకని ఇప్పుడు పెట్టుకున్నాము అంటుంది అను మరి భోజనం చేశారా అంటుంది అరవింద్ చేయలేదు అంటారు. అయితే ఇప్పుడే వస్తాను ఉండండి అని అరవింద్ లోపలికి వెళ్లి భోజనం తీసుకుని వస్తుంది. వెంటనే పద్మావతి అను ఇద్దరూ అరవింద్ ను కౌగిలించుకుంటారు.ఏమైంది నా చేత్తో భోజనం పెట్టడం మీకు ఇష్టం లేదా అని అంటుంది అరవింద్ లేదు అమ్మలా చూసుకునే మిమ్మల్ని చూసి చాలాహ్యాపీగా ఉంది అని అంటారు.ఆడపడుచుని ఎప్పుడూ ఏడిపించే మరదలు ఉన్న ఈ రోజుల్లో నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్న మిమ్మల్ని చూసినా నాకు అలానే ఉంటుంది అంటుంది అరవింద. ఇక అరవింద పద్మావతి అనుకి భోజనం నోట్లో పెడుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్య ముగ్గురుని ఇలా చూస్తుంటే నా దిష్టి తగిలేటట్టు ఉంది అని అంటాడు.

శ్రీమంతానికి రెడీ..
ఇక పద్మావతి అరవింద శ్రీమంతానికి రెడీ అవుతూ ఉంటుంది. సారీ కి పిన్ను పెట్టుకోవడం కుదరక అక్కడే ఫోన్ మాట్లాడుతున్న విక్కీని పిలుస్తుంది. నీకేం పని లేదా నేను ఫోన్లో ఉంటే ఎందుకలా అరుస్తున్నావు అని విక్కీ పద్మావతిని తిడతాడు. నా సారీ కి పిన్ని పెట్టమని వేరే వాళ్ళని అడిగితే బాగోదు కదా భర్త అయినా మిమ్మల్ని అడగాలి పెడతారా పెట్టరా అని అంటుంది.నేను పెట్టను అంటాడు విక్కీ. మీ చేత ఎలా పిన్నీస్ పెట్టించుకోవాలో నాకు తెలుసు అని అంటుంది పద్మావతి. మీ ఇష్టం వచ్చింది చేసుకో అని అంటాడు విక్కీ వెంటనే పద్మావతి అరవింద్ గారు అని పిలుస్తుంది ఎందుకు ఇప్పుడు అక్కని పిలుస్తున్నావు అని అంటాడు. మీరు పెట్టట్నా అన్నారు కదా అందుకు అని అంటుంది సరే పెడతాను లే అని విక్కీ కావాలనే పద్మావతి కి పిన్నిసు పెద్దది చేసి గుచ్చుతాడు.అయ్యో సారీ పిన్నిస్ పెట్టమన్నాను బుచ్చమనలేదు అని అంటుంది పద్మావతి నాకు ఇలానే చాతు అని అంటాడు అయితే మళ్లీ అరవింద్ గారిని పిలుస్తాను అంటుంది వద్దులే పెడతాను అని సరిగ్గా సారీకి పిన్ పెడతాడు. పద్మావతి ఒక డ్రెస్ తీసుకొని విక్కీకి ఇచ్చి ఇదే వేసుకోండి మీరు అంటుంది నేను వేసుకోను అంటాడు వేసుకోవాల్సిందే అని అంటుంది.
రేపటి ఎపిసోడ్ లో, విక్కీ పద్మావతి తో నాకు అసలు ఎందుకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు అర్థం కాక పిచ్చి పట్టేలా ఉంది అని అంటాడు.మీ అక్కకు మీ అమ్మే పుట్టాలి అని మీరు అనుకున్నారు కదా అదే నిజమవుతుంది అని అంటుంది పద్మావతి అవునా అని విక్కీ సంతోషంలో పద్మావతిని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. ఇక అరవింద దగ్గరికి వచ్చి తన సంతోషాన్నంతా చూపిస్తాడు. ఇక కృష్ణఫోన్లో ఇదే మంచి టైం ఇప్పుడే అరవింద్ అని చంపేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చంపితేనే ఆస్తంతా మనకి వస్తుంది అని ఫోన్ లో ఎవరికో చెప్పి, పక్కకు తిరిగేసరికి అక్కడ అరవింద ఉంటుంది. చూడాలి రేపటి ఎపిసోడ్లో కృష్ణ మాటలు అరవిందదా లేదా తెలుసుకుందాం