అలా జ‌రిగినందుకు బాధ‌కంటే.. ఆనందమే ఎక్కువగా ఉంది: నాగ‌చైత‌న్య‌

Share

యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కొద్ది నెల‌ల క్రితం భార్య‌, స్టార్ హీరోయిన్ అయిన స‌మంత‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట‌.. 2017లో గ్రాండ్‌గా గోవాలో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ క‌పుల్‌గా గుర్తింపు కూడా పొందారు. కానీ, అనూహ్యంగా వీరు విడాకులు తీసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చారు.

స‌మంత‌తో విడిపోయాక చైతు త‌న ఫోక‌స్‌ను పూర్తిగా కెరీర్ పైనే పెట్టారు. స‌మంతతో ఎందుకు విడిపోవాల్సి వ‌చ్చింది అన్న విష‌యంపై ఎక్క‌డా స్పందించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న చైతు.. త్వ‌ర‌లోనే `థ్యాంక్యూ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. రాశీఖన్నా, మాళవిక నాయర్‌, అవికా గోర్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు.

కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన నాగ‌చైత‌న్య‌.. వెంకీ కూతురు రిప్లై వైర‌ల్‌!

విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై బ‌డా నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. జూలై 22న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. అయితే ఆస‌క‌క్తిర విష‌యం ఏంటంటే.. `జోష్` సినిమాతో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది దిల్ రాజే. ఆ త‌ర్వాత ఒక్క‌సారి కూడా చైతు దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయ‌లేదు. 12 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు `థ్యాంక్యూ` మూవీతో వీరిద్ద‌రూ క‌లిశారు.

ఈ విష‌యంపై చైతు తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. `జోష్ త‌ర్వాత కూడా దిల్ రాజుగారు చాలా కథలను నా దగ్గరికి పంపించారు. సరైన కథ పడినప్పుడు చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. అలా వెయిట్ చేస్తూ ఉండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. అయితే థ్యాంక్యూ కథను వినిపించినప్పుడు మాత్రం వెంటనే ఒప్పేసుకున్నాను. అందుకు కారణం కథలోని కొత్తదనం .. పాత్రలోని వైవిధ్యం. దిల్ రాజు గారితో 12 ఏళ్ల గ్యాప్ వచ్చిందనే బాధకంటే కూడా, ఒక మంచి సినిమా చేశామని ఆనందమే ఎక్కువగా ఉంది.` అంటూ చెప్పుకొచ్చారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

9 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

18 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago