Naga Panchami november 13 2023 episode 200: ఆగు పంచమి ఏదో చెప్పాలని వచ్చి ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి అని సుబ్బు అంటాడు. నేను చెప్పాలనుకున్నది సుబ్బు కు ఎలా తెలిసింది అని పంచమి తన మనసులో అనుకుంటుంది. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది పంచమి నీ మనసులో బాధ ఎవరికైనా చెప్పుకోవాలని అనుకున్నావు కదా అదేంటో చెప్పు పంచమి నీ బాధ కొంతైనా తగ్గుతుంది అని సుబ్బు అంటాడు. ఆ భగవంతుడుకి నా మొర ఆలకించే అంత టైం ఎక్కడుంది నాలాగా ఎంతో మంది భక్తులు ఉంటారు కదా అని పంచమి అంటుంది. నన్నే సుబ్రహ్మణ్యస్వామిగా అనుకొని నీ కష్టం ఏంటో చెప్పుకో అని సుబ్బు అంటాడు. ఎవరితోనూ చెప్పుకునేది కాదు సుబు అని పంచని అంటుంది. భగవంతుడితో కూడా చెప్పుకోకూడదా నన్నే భగవంతుడిగా అనుకొని చెప్పు అని సుబ్బు అంటాడు. ఒక రోజు నీకు ఒక కథ చెప్పాను గుర్తుందా సుబ్బు అది కథ కాదు సుబ్బు నా జీవితం అని పంచమి అంటుంది.

గుర్తుంది అది నీ జీవితమ అని సుబ్బు అంటాడు. పాముగా ఉండి నా భర్తను కాటు వేసి చంపాలి భార్యనై నా భర్త ప్రాణాలను కాపాడుకోవాలి ఈ రెండు సాధ్యమయ్యేలా లేవు సుబ్బు అని పంచమి అంటుంది. నీ భర్త అంటే నీకు ఇష్టంమ పంచమి అని సుబ్బు అడుగుతాడు. నా భర్త అంటే నాకు ప్రాణం అని పంచమి అంటుంది. నువ్వు మనిషిగా ఉన్నావు కాబట్టి నీ భర్త గురించి ఆలోచించి ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తున్నావు కానీ ఆ పాము కూడా ఎలా కాటు వేయాలని తన ప్రయత్నం తాను చేస్తుంది కదా పంచమి అని సుబ్బు అంటాడు.రెండు నేనే కదా సుబ్బు అని పంచమి అంటుంది. ఎవరి కార్యం వాళ్ళు చేస్తారు నీ భర్త ప్రాణాలు పోవడం కాయం పంచమి ఇక దాని గురించి ఆలోచించడం అనవసరం అని సుబ్బు అంటాడు. అలా జరిగితే నేను ప్రాణాలతో ఉండడం అనవసరం అని పంచమి అంటుంది. ఎప్పుడూ మనిషిగానే ఆలోచిస్తావా పాముగా కూడా ఆలోచించు మోక్షాన్ని కాటు వేసిన తర్వాత ఏం జరుగుతుంది ఏ లోకానికి వెళ్తాడు నేను మళ్ళీ అతని ఎలా బ్రతికించుకోవాలి అనేది ఆలోచించు అంతేకానీ ఏడుస్తూ కూర్చుంటే ఏమి చేయలేవు పంచమి

అని సుబ్బు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మోక్ష పంచమి పాముగా ఉండి నన్ను కాటు వేయాలనుకుంటుంది మళ్లీ నా భార్యగా ఉండి ప్రాణం అడ్డేసేనా నన్ను కాపాడాలనుకుంటుంది ఇది ఎలా సాధ్యం రెండు కత్తులు ఒకే ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి అని మోక్ష అనుకుంటాడు. ఇంతలో సుబ్బు వచ్చి తన చేయిని అడ్డుపెట్టి పాము నీడగా చూపెడతాడు. ఆ నీడను చూసినా మోక్ష భయపడతాడు. మోక్ష భయపడడం చూసినా సుబ్బు పకపక నవ్వి ఏంటి మోక్ష నీడని చూస్తేనే అంతలా భయపడుతున్నావు ఏంటి అని అంటాడు. ఏదో నా పక్కన నిలబడినట్టు అనిపించి భయపడ్డాను అంతే సుబ్బు పామును చూసి కాదు అని మోక్ష అంటాడు. పాములంటే నీకెందుకు మోక్ష అంత భయం పాములు ఏం చేస్తాయని మనుషుల కంటే ప్రమాదకరమైన వారు ఇంకెవరూ లేరు అని సుబ్బు అంటాడు.

అంటే ఏంటి సుబ్బు నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్థం కావట్లేదు అని మోక్ష అంటాడు.మోక్ష చిన్నప్పుడు నేను నీలాగే అన్నిటినీ చూసి భయపడే వాడిని అప్పుడు మా నాన్న నాతో ఏం చెప్పాడో తెలుసా, నువ్వు దేన్నయితే చూసి భయపడతావో దానిమీద ప్రేమ పెంచుకో నీకు భయం పోతుంది అని చెప్పాడు మా నాన్న అని సుబ్బు అంటాడు. అయితే అప్పుడు నువ్వేం చేసావు అని మోక్ష అడుగుతాడు. నాకు కొంచెం కోపం ఎక్కువ అల్లుక కూడా ఎక్కువ అందుకని నేను కోపంగా కొండమీదికి వెళ్ళిపోయాను అక్కడే కొన్ని రోజులు ఉన్నాను నా భయం పోయింది ఇప్పటికీ అక్కడే ఉంటునను అని సుబ్బు అంటాడు. అంటే ఏంటి సుబ్బు నీకు నువ్వు ఆ సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పుకుంటున్నావా ఆయన కాదా నీ కథ ఒకే లాగా ఉంది ఏంటి అంటే ఆయన నువ్వు ఒకటేనా అని మోక్ష అడుగుతాడు. మా నాన్న పేరు శివయ్య మా అమ్మ పేరు పార్వతి నా పేరు సుబ్రహ్మణ్యం వాళ్ల పేర్లు మా పేర్లు ఒకే లాగా ఉన్నాయి కదా మోక్ష అని సుబ్బు అంటాడు.

వినేవాడు చెవిటోడైతే ఎన్నైనా చెప్తావు సుబ్బు అని మోక్ష అంటాడు. చూడు మోక్ష నువ్వు నమ్మినా నమ్మకపోయినా మనల్ని ప్రేమించే వాళ్ళను దూరం చేసుకోవడం అంతా మంచిది కాదేమో మనం అంటే ప్రాణం ఇచ్చే వాళ్లను పోగొట్టుకుంటే మళ్లీ తిరిగి రారు ఒకసారి ఆలోచించు అని సుబ్బు వెళ్ళిపోతాడు. చిన్నపిల్లడైనా సుబ్బు చెప్పిందాంట్లో అర్థం ఉంది అని మోక్ష ఆలోచిస్తాడు. కట్ చేస్తే పంచమి తన గదిలో పడుకొని ఉంటుంది. ఇంతలో మోక్ష వచ్చి డోరు పెడతాడు. మోక్ష రాకను చూసిన పంచమి లేచి నిలబడుతుంది.

మోక్ష పంచమి దగ్గరికి తీసుకొని పంచమి నేను కట్టిన తాళి కన్నా నీకే నేను విలువ ఎక్కువ ఇస్తాను నా గుండెల్లో ఊపిరి ఆగిపోయే అంతవరకు నేను నీతోనే ఉంటాను పంచమి నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు నా ప్రాణం పోయేంతవరకు నువ్వు నా పక్కనే ఉండు అని మోక్ష అంటాడు. ఆ మాటలకి పంచమి ఏడుస్తుంది. రావలసింది కన్నీళ్లు కాదు పంచమి ఆనంద భాష్పాలు అని మోక్ష తన కన్నీళ్లను తుడిచి దగ్గరికి తీసుకుంటాడు..