Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా రసవతారంగా సాగుతోంది. నేటితో మూడు వారాలు ఆట ముగిసింది. ఈ క్రమంలో మొత్తం 14 మంది ఎంట్రీ ఇస్తే నేడు సింగర్ డామిని.. ఎలిమినేట్ కావటంతో హౌస్ లో 11 మంది ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ షో లో టెలివిజన్ యాంకర్లు ఇంకా సోషల్ మీడియాలో గుర్తింపు కలిగిన వాళ్లు.. అదేవిధంగా సీరియల్ నటీనటులు ఈ రంగాలకు చెందిన వాళ్లని తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది జరిగే సీజన్లలో ఈ రంగాలకు చెందిన వాళ్లు ఇంటి సభ్యులుగా ఎంట్రీలు ఇచ్చి.. పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో గత కొన్ని సీజన్ ల నుండి బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ నటీనటుల హవా సాగుతోంది.
అయితే టీవీ నటుల ఆట తీరు బిగ్ బాస్ హౌస్ లో చూస్తే వాళ్లంతా యూనిటీగా ఆడుతున్నట్లు తాజా సీజన్ సెవెన్ లో బయటపడింది. అంతకుముందు కూడా సీరియల్ నటులు హౌస్ లో ఉన్నా గాని సీజన్ సెవెన్ లో సీరియల్ నటుల ఐకమత్యం మాత్రం చాలా ఓవర్ గా ఉంది. దీంతో గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉండటంతో మూడో వారంలో వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా శనివారం నాగార్జున.. సీరియల్ బ్యాచ్ కి ఫుల్ డోస్ ఇచ్చారు. ప్రియాంక, శోభ, అమరదీప్, సందీప్.. వాళ్ల వ్యక్తిగత ఆట తీరుతో పాటు.. కలిసికట్టుగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.
ఈ క్రమంలో సంచాలక్ గా సందీప్ కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని మిగతా వారిని ప్రశ్నించి.. వాళ్లతో సమాధానం వచ్చాక మీ నుండి సమాధానం మాత్రమే తీసుకోవడం జరుగుద్ది పనిష్మెంట్ మేము ఇస్తామని.. ఊహించని షాక్ ఇచ్చారు. ఈ రీతిగా వాళ్ల గ్రూపు గేమ్ బయటపెట్టారు. నాగార్జున ఈసారి మాత్రం మొత్తం హౌస్ లో జరుగుతున్నది ఎపిసోడ్ లు చూసి వచ్చి మరి.. ఎవరికి ఇవ్వాల్సింది వారికి గట్టిగా ఇస్తున్నారు. హౌస్ లో సీరియల్స్ నటీనటుల అతి ఓవరాక్షన్ ఎక్కువైపోతూ ఉండటంతో నాగార్జున ఇచ్చిన డోస్ కి సీరియల్స్ బ్యాచ్ మొహాలు మాడిపోయాయి.