Nindu Noorella Saavasam October 9th ఎపిసోడ్ 49: ఆయన కళ్ళల్లోకి సూటిగా చూసే ఎవరూ మాట్లాడలేరు అలాంటిది ఆయనతో పోట్లాడావు కొట్లాడావు అనీ మాటలు అన్నావు ఆయన ఊరుకుంటాడా అని రాథోడ్ అంటాడు. అందుకే రాథోడ్ గారు నేను వెళ్ళిపోతాను ఉండను అని భాగమతి అంటుంది. మరి మీ నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు అన్నవు కదా మరి ఇప్పుడు సంతకం ఎలా పెట్టించుకుంటావు అని అంటాడు రాథోడ్. ఏం చేస్తానండి ఇంటికి వెళ్ళాక ఆయన గురించి ఆలోచిస్తాను అని భాగమతి అంటుంది.

నువ్వు వెళ్లి మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదండి మీరు ఒక చిన్న సంతకం పెట్టండి అని మా సార్ ని అడిగితే ఆయన జాలి గుండెతో నీకు సంతకం పెడతారు వెళ్లి అడుగమ్మా అని రాథోడ్ అంటాడు.ఆయన అంత జాలిపడేవాడే అయితే నన్ను చూసిన వెంటనే షూట్ చేసి పారిసే వాడు లేదంటే కోప్పడే వాడు ఆయన ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోయాడు అంటే నా మీద ఆయనకి కోపం ఉంది రాథోడ్ గారు వెళ్ళిపోతాను అని భాగమతి అంటుంది. సరే పదమ్మా నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని రాథోడ్ అంటాడు.

అయ్యయ్యో ఈ అమ్మాయి వెళ్ళిపోతే నా పిల్లలుని ఎవరు కాపాడుతారు మిస్సమ్మ ఉందనే కదా నేను ఇంత ధైర్యంతో ఉన్నాను ఇప్పుడు ఎలాగా మనోహరి నా పిల్లలుని ఏం చేస్తుందో ఏమో తనను ఏదో ఒకటి చేసి ఆపాలి అని అనుకుంటూ అరుంధతి మనోహరి తను ఎంత స్నేహితురాలో చిన్నప్పటినుంచి ఎలా పెరిగారు ఎలా తిన్నారు ఎలా ఉన్నారు ఎలా ఆడుకున్నారు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని నా ఫ్రెండు నాన్నే ఇలా చేస్తుంది ఏం చేయాలి భగవంతుడా అని ఏడుస్తుం నాకు తెలిసిన నాతో కలిసి పెరిగిన నా ఫ్రెండ వి నువ్వేనా మను అని అరుంధతి ఈ అమ్మాయి ఎలాగైనా వెళ్ళిపోకూడదు అని అరుంధతి అనుకుంటుంది. కట్ చేస్తే ఇప్పుడు ఏం చేద్దాం రేపటి నుంచి మనం డిసిప్లేన్ గా ఉండాలి ఇంతకుముందుల అల్లరి చేస్తే కవరు చేయడానికి అమ్మ లేదు నాన్న మీద మన భారం పడకుండా చూసుకోవాలి అని అమృత అంటుంది. అవును ఎలాగైనా సరే స్కూల్లో అల్లరి తగ్గించి ఇంటికి కంప్లైంట్ రాకుండా నేను చూసుకుంటాను అని అమృత వాళ్ళ చిన్న తమ్ముడు అంటాడు.

ఎలాగైనా బాగా చదివి డాడీకి మంచి పేరు తెలవాలి ప్రామిస్ అవును మనం ముగ్గురమే మాట్లాడుకుంటున్నాం నాలుగు కాండిడేట్ అంజు ఎక్కడ ఏంటి అంజు మేము మాట్లాడుకుంటుంటే నువ్వే మాట్లాడట్లేదు అలా మౌనంగా ఉంటావ్ ఏంటి అని అమృత అంటుంది. మీరు నాకు ఏమాత్రం సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే నేను ఏమని మాట్లాడను చదువుకుంటాను ప్రామిస్ చేస్తాను అని మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నాకు ఏమాత్రం సంబంధం లేని సబ్జెక్ట్ గురించి మాట్లాడితే నేను ఎలా మాట్లాడుతాను అని అంజు అంటుంది.అదేంటి అంజు అలా అంటావ్ ఇంతకుముందు అల్లరి చేస్తే అమ్మ కవర్ చేసేది ఇప్పుడు కేర్ టేకర్ కూడా వెళ్ళిపోతుందట నాన్నగారు పంపించేయమన్నారట ఇప్పుడు నిన్ను ఎవరు చేస్తారు నిన్ను నువ్వే చూసుకోవాలి లేదంటే నాన్నకు కోపం వస్తుంది అని అమృత అంటుంది.

ఆ కేర్ టేకర్ మీద రివెంజ్ మిస్ అయిపోయింది అని నేను ఫీల్ అవుతుంటే మీరు ఏదేదో మాట్లాడుకుంటున్నారు దానికి నన్నేం చేయమంటారు అని అంజు అంటుంది.ఇంతలో భాగమతి అక్కడకి వచ్చి ఎక్స్క్లూజ్ మీ నేను లోపలికి రావచ్చా అని భాగమతి అంటుంది. వచ్చిందమ్మా వయ్యారి రా అని అంజు అంటుంది.పిల్లలు మిస్సమ్మని మీ డాడీ వెళ్లిపొమ్మన్నారు చివరిసారిగా మీకు టాటా చెప్పి వెళ్ళిపోదామని వచ్చింది అని రాథోడ్ అంటాడు. అయ్యయ్యో మిస్సమ్మ నీతో చానా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను కానీ మా డాడీ మాకు అవకాశం ఇవ్వట్లేదు అని అంజు అంటుంది.

ఏ అంజు ఏం మాట్లాడుతున్నావ్ సైలెంట్ గా ఉండు అని అమృత అంటుంది. ఏం పర్వాలేదు అక్క బయటికి వెళ్లే మనిషే కదా మనం ఫ్రీగా మాట్లాడొచ్చు నువ్వేం కంగారు పడకు అని అంజు అంటుంది. పిల్లలు నేను వెళ్ళొస్తాను కానీ మళ్ళీ మనం కలుస్తామేమో అని నాకు అనిపిస్తుంది అని భాగమతి అంటుంది. అవునా ఐ యాం వెయిటింగ్ వెళ్లి త్వరగా రా అని అంజు అంటుంది. పిల్లలు ఎక్కువగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి వెళ్ళొస్తాను అని భాగమతి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే పనిచేయకుండా నేను ఇంట్లో నుంచి పంపించేస్తారని నేను అసలు ఊహించలేదు ఏం చేస్తాం అమరకు నచ్చని వాళ్లను ఇంట్లో ఉండనివ్వడు అని మనోహరి అంటుంది. ఏం చేస్తామండి భగవంతుడు రాసిపెట్టి ఉంటే ఏదైనా జరుగుతుంది మనకు రాసిపెట్టి లేదు పెద్దవాళ్లను కలిసి చెపి వస్తానండి అని భాగమతి వాళ్ళ దగ్గరికి వెళుతుంది. మా వాడు మనసులో అనుకుంటే అదే చేస్తాడమ నువ్వేమీ బాధపడొద్దు ఈ విషయంలో నీకు సహాయం చేయలేకపోతున్నాం అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు.

ఏం చేస్తామండి మనకు రాసిపెట్టి లేదు అంతే అని భాగమతి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే నా అంగుళీకము ఎక్కడ పోయినది ఈ సంగతి తెలిసినచో మా తండ్రిగారు నా చర్మం వలచెదరు యమధర్మరాజుకు తెలిసినచో నా కంఠము ఖండించెదరు పరమేశ్వరా ఇప్పుడు నన్ను ఏమి చేయమందువు అని గుప్త తనలో తాను అనుకుంటాడు. ఇంతలో అరుంధతి అక్కడికి వచ్చి గుప్తా గారు మిస్సమ్మ వెళ్లకుండా ఏదో ఒక ప్లాన్ చెప్పు అని అంటుంది. నా అంగుళీకము పోయినదని నేను బాధపడుతుంటే నీవు ఒకటి ఏమిటి బాలిక అని గుప్తా అంటాడు.

ఈశ్వర ఆ అమ్మాయి వెళ్లకుండా ఏదో ఒకటి ప్లాన్ నాకు వచ్చేలా చేయి అని అరుంధతి అంటుంది. ఇంతలో భాగమతి బ్యాగ్ పట్టుకొని బయటికి వస్తుంది. మిస్సమ్మ ఆగు అని అరుంధతి అంటుంది. వెళ్ళొస్తానండి అని భాగమతి అంటుంది. పక్కనే రాథోడ్ ఉంటాడు అయ్యో ఇప్పుడు నిజం తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా అని అరుంధతి టెన్షన్ పడుతుంది. మళ్లీ భాగమతి వెళ్ళొస్తానండి అని అంటుంది. ఇంట్లో వాళ్లందరికీ చెప్పింది కదా అలాగే నాకు కూడా చెప్పుకుంటుందిలే అని రాథోడ్ అనుకుంటాడు. అమ్మయ్య రాథోడ్ గారు తనకు చెప్పింది అని అనుకుంటున్నాడు నేను సేఫ్ అయ్యాను అని అరుంధతి అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.