Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,అను ఆర్యాలు సంతోషంగా గడుపుతారు. విక్కీ పద్మావతి తో నువ్వు ఎప్పటికీ నా భార్యవి కాలేవు అని చెప్తాడు. నేనంటే మీకు ఎందుకు అంత కోపం చెప్పాలని పద్మావతి విక్కిని నిలదీస్తుంది. ఆరు నెల తర్వాత అన్ని నీకే తెలుస్తాయి అని విక్కీ సమాధానం చెప్తాడు. ఈ ఆరు నెలలు నువ్వు అందరి ముందు నటించాల్సిందే అని విక్కీ పద్మావతి తో చెప్తాడు.

ఈరోజు 401 వ ఎపిసోడ్ లో, ఆర్య అను ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా చిలకమ్మ వచ్చి డోర్ కొడుతుంది. కాసేపాగి వెళ్లొచ్చు కదా డియర్ అని అంటాడు ఆర్య. చిలకమ్మ వచ్చింది కదా అని తలుపుతీస్తుంది అను. టిఫిన్లు కాఫీలు రెడీగా ఉన్నాయి తొందరగా రండి అమ్మ అని చెప్పి పద్మావతి రూమ్ దగ్గరికి వెళుతుంది చిలకమ్మా. చిలకమ్మ వచ్చి పిలిచింది మనం ఇంకా లేచి వెళ్తే బాగుంటుంది అని అను ఆర్యతో అంటుంది. చిలకమ్మా అలానే పిలుస్తుందిలే నువ్వు కాసేపు ఉండు అని అంటాడు ఆర్య. తెల్లవారి చాలాసేపు అయిందండి మనం ఈడనే ఉంటే బాగోదు అని అంటుంది అను. తొందరగా లేచి రండి అని అను వెళ్లిపోతుంది.

చిలకమ్మ తో పద్మావతి అబద్దం..
చిలకమ్మ పద్మావతి రూమ్ దగ్గరికి వెళుతుంది. పద్మావతి చిలకమ్మ డోర్ కొట్టడం గమనించి ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. పద్మావతి మనసులో ఇప్పుడు ఈ చాప దిండు చూస్తే ప్రాబ్లం అయిపోతుందని,ఆలోచిస్తూ ఉంటుంది డోర్ తీయకుండా, విక్కీ ఏంటి డోర్ తీయకుండా ఆలోచిస్తుంది అని చూస్తూ ఉంటాడు. పద్మావతి వెనక్కి వచ్చి చాపా దిండు రెండు తీసి, అద్దంలో చూసుకొని నగలన్నీ తీసేసి,డోర్ తీయడానికి వస్తుంది.డోర్ తీసి ఏంటి చిలకమ్మా ఇప్పుడే కదా పడుకుంది. అప్పుడే వచ్చి డోర్ కొడుతున్నావు అని అంటుంది. ఇప్పుడు పడుకోవడం ఏంటమ్మా మీ ఆయన గారు రాత్రంతా నిద్రపోని లేదా అని అంటుంది చిలకమ్మా. నా భర్త కదా తన మాట వినాలి కదా చిలకమ్మా అని అంటుంది పద్మావతి. కావాలని చిలకమ్మ ముందు విక్కీ చేయి పట్టుకొని లాగుతున్నట్లు నేను లోపలికి రాను అని, చిలకమ్మా ఉంది తనతో మాట్లాడనివ్వండి అని నటిస్తుంటుంది పద్మావతి చిలకమ్మ ముందు. ఇదంతా విక్కీ ఉంటాడు. చిలకమ్మ కాఫీలు టిఫిన్లు రెడీగా ఉన్నాయి మీరు తొందరగా రండి అమ్మ అని చెప్తుంది. నేను ఉండలేను నేను వెళ్ళిపోతున్నాను మీరు తొందరగా వచ్చేయండి అని అంటుంది చిలకమ్మా. డోర్ వేసి పద్మావతి లోపలికి వెళ్తుంది. లోపలికి వచ్చిన తర్వాత పద్మావతి ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు అంత నటించడం అవసరమా అని అంటాడు. మీరు మీ అక్క కోసం మీరు ఎలాగైతే నటిస్తున్నారు మా అమ్మ వాళ్ళ కోసం నేను నటిస్తున్నాను. నాకు బాధపడటం అలవాటైపోయింది కనీసం మా వాళ్ళునైనా సంతోషంగా ఉండనివ్వండి. మనది నటనని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అని అంటుంది పద్మావతి వికీతోవిక్కీ తో, నాకేటి గుడి శిక్ష వేశారు కదా అనుభవిస్తున్నాను కదా అని అంటుంది పద్మావతి.

అను, ఆర్యా ల ప్రేమ..
అను తొందరగా రెడీ అయ్యి రండి అని అంటుంది ఆర్యతో, ఆర్య ఇప్పుడే ఎందుకు లే డియర్ అని అంటాడు. నేను స్నానం చేసి వచ్చాను. ఇక మీదే ఆలస్యం తొందరగా లేచి రెడీ అవ్వండి అని అంటుంది. ఆర్యా, తో అను మీరు రెడీ అయితే నేను వెళ్లి కాపీ చేసుకుని తీసుకొస్తాను అని అంటుంది. కాఫీ కన్నా ముందు ఒకస్ట్రాంగ్ ముద్దు ఇవ్వచ్చు కదా అని అంటాడు ఆర్య. ఇప్పుడు అవన్నీ కాదు తొందరగా లేచి రెడీ అవ్వండి అని అంటుంది అను. అనుని వెనక్కి లాగుతాడు, ఆర్యా ఇద్దరూ అలా చాలా సేపు చూసుకుంటూ ఉంటారు. ఆర్య అను కి ముద్దు పెడతాడు అని కూడా ఆర్య కి ముద్దు పెడుతుంది. ఇంక చాలు మహానుభావా నాకు అవతల చాలా పనులు ఉన్నాయి అని, అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆర్య అను వెళ్లిన తర్వాత ఫోన్ తీసుకొని అను ఫోటో చూసుకొని ఐ లవ్ యు అను అని చెప్తాడు.

ఆండాలు దగ్గర పద్మావతి అబద్ధం..
ఆండాలు, పార్వతి వంట చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి పద్మావతి వస్తుంది. చిలకమ్మ పద్మావతి మీ ఆయన అప్పుడే మిమ్మల్ని వదిలి పెట్టరు అనుకున్నాను అమ్మ అని అంటుంది. చాల్లే నీ యేషాలు ఇంకా ఆపు అంటుంది అండాలు. టిఫిన్ అయిందా అమ్మ అని అంటుంది పద్మావతి. లేదా మీ అవుతూ ఉన్నది అని అంటుంది పార్వతి అయితే ఈ లోపు మా వారికి పాలు తీసుకెళ్లి ఇస్తాను అని అంటుంది. చిలకమ్మా అప్పుడే భర్త ఇష్టాలు తెలుసుకున్నారు పద్మావత్ అమ్మగారు అని అంటుంది. ఏదైనా ఇట్టే చిటికెలో తెలుసుకుంటాం చిలకమ్మా పద్మావతి పద్మావతి ఇక్కడ అని అంటుంది. అందులో నన్ను ప్రేమగా చూసుకునే మాయని నేను ఎంత ప్రేమగా చూసుకోవాలి చెప్పు అని అంటుంది. ఇప్పుడే పాలిచ్చేసి వస్తాను అని అంటుంది. బాదంపప్పు జీడిపప్పు పిస్తా పప్పు అన్ని పొడి చేసి ఒక డబ్బాలో పెట్టాను అని ఆండాలు ఇస్తుంది. మా ఆయనకి నా మీద ప్రేమ ఉన్నదని తెలుసు కానీ ఇంత ప్రేమ నాదని ఇప్పుడే తెలిసి ఉండాలి అని అంటుంది పద్మావతి. ఎంతైనా నేను చాలా అదృష్టవంతురాలని చిలకమ్మా అని అంటుంది పద్మావతి. అందరిముందు కావాలని నటిస్తుంది పద్మావతి. నాకోసం మా వారు ఎదురు చూస్తుంటారు నేను వెళ్లి పాలు ఇచ్చి వస్తాను అని వెళ్తుంది పద్మావతి. ఈ తింగరిది ఎలా ఉంటుందో అని అనుకున్నాను పర్వాలేదు పార్వతి నువ్వు చెప్పిన మాటలు పనిచేసాయి. అని అండల్ పార్వతి అంటుంది అది పద్మావతి విని, మీ అందరి కోసం నటిస్తున్నానమ్మ, నా మనసులో బాధమీకు తెలియకూడదు.అని అనుకొని రూమ్ దగ్గరికి వెళుతుంది.

Krishna Mukunda Murari: కృష్ణ కి నిజం చెప్పనున్న ముకుంద.. మురారి ఏం చేయనున్నాడు.!?
విక్కీ తో పద్మావతి గొడవ..
పద్మావతి పాల్ తీసుకొని రూమ్ లోకి వస్తుంది వికీ అప్పటికే బాగా ఆకలిగా ఉంది అని ఏదైనా టిఫిన్ చేశారా వీళ్ళు, వెళ్లి అడిగితే బాగోదేమో చేస్తే వాళ్లే పిలుస్తారులే అని రూమ్ లో కూర్చొని ఉంటాడు అప్పుడే పద్మావతి పాలు తీసుకుని వస్తుంది నాకోసమే నా పాలు తీసుకొచ్చింది అని అంటాడు. పద్మావతి కి రాత్రి తను తీసుకొచ్చిన పాలని నేల మీద పోయడం గుర్తుకొస్తుంది. నేను మీకు ఇవ్వడానికి తీసుకురాలేదు అంటుంది. నేను ఇవ్వను అని అంటుంది. నిన్న రాత్రి నేను మీకు పాలిస్తే ఏం చేశారు మీరు మాత్రం తాగి నేను తాగాల్సిన పాలు నేలపాలు చేశారు ఇప్పుడు కూడా అట్లనే చేయరని ఏముంది అందుకే ఈ పాలు నేనే తాగేస్తాను అని అంటుంది. అవి నా కోసం తీసుకొచ్చావు కదా నువ్వెలా తాగుతావని అంటాడు విక్కి. మీకోసమే తెచ్చాను కానీ మొత్తం పాలు నేనే తాగేస్తాను అని అంటుంది. ఇస్తావా ఇవ్వవా అని అంటాడు. ఆకలేస్తుంది కదా మీకు అన్నం విలువ తెలియాలి అంటే కడుపు నిండినప్పుడు కాదు ఆకలి మీద ఉన్నప్పుడే తెలుస్తుంది. అలాగే మంచి కోరే వాళ్ళ విలువ తెలియాలంటే, కాస్త మనసుతో ఆలోచించాలి ఆవేశంతో కాదు అప్పుడే వాళ్ళు ఏంటో వాళ్ళ ప్రేమ ఏంటో అర్థం అవుతుంది. అయినా నా పిచ్చి గానీ చెవిటోడు ముందు ఎంత శంఖం ఊదిన ఏం లాభం? నాకు కూడా ఆకలేస్తుంది అని పాలు తాగేస్తుంది. అబ్బా పాలు ఎంత బాగున్నాయో అని అంటుంది. కావాలని చేస్తున్నావ్ కదా, అని అంటాడు వీక్కి. లోపల గదిలో మనిద్దరం ఎవరికీ ఏమీ కాము కదా అందుకని ఆకలి నాది అందుకే తాగేసాను గది బయట మీరు నా భర్తగా నా ఊళ్లో కూర్చోబెట్టుకొని మరీ తినిపిస్తాను. మాటకి మాట ఎదురు చెప్తున్నావు కదా కానీ, ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో నువ్వేం చేసినా అది ఆరు నెలలు మాత్రమే మధ్యలో ఏమన్నా ఎగస్ట్రాలు చేస్తే తెలుసు కదా మీ అక్క శాశ్వతంగా పుట్టింట్లోనే ఉంటుంది. అని పద్మావతికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. శ్రీనివాస మా ఇంట్లో వాళ్లకోసమే కదా నేను ఇవంతా చేసేది ఈ టెంపరర్ అర్థం చేసుకోడు ఏంటి నేనేమైనా పర్లేదు మా అక్క సంతోషంగా ఉండాలి దాని కోసం ఏదైనా భరిస్తాను అని అనుకొని మనసులోనే బాధపడుతుంది పద్మావతి.

అల్లుళ్లకు మర్యాద చేసిన భక్త..
పార్వతీ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ సర్దుతూ ఉంటుంది. భక్త వచ్చి టిఫిన్ చేశారా పిల్లలు అని అంటాడు లేదండి ఇంకా అల్లుళ్ళు రాలేదు అంటుంది పార్వతి పిలవచ్చు కదా అని, భక్త అంటూ ఉండగానే ఆర్య అను ఇద్దరూ వస్తారు. రండి బాబు టిఫిన్ చేయండి అంటుంది పార్వతి ఇద్దరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు ఇంకా పార్వతి విక్కీ పద్మావతి లు రాలేదు అని అంటుంది. చిలకమ్మాను వెళ్లి పిలుచుకురా అంటుంది అండాలు. వాళ్ళ ఆయన గారి పద్మావతిని వదల రమ్మ రావడానికి అని అంటుంది చిలకమ్మా. వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది అని అంటుంది.అప్పుడే అక్కడికి విక్కీ పద్మావతి వస్తారు. పద్మావతి డల్లుగా ఉండడాన్ని చిలకమ్మ గమనించి ఏంటమ్మా అలా ఉన్నారు అని అంటుంది. అమ్మ వీళ్ళకి అనుమానం వచ్చినట్టుంది ఏదో ఒకటి నటించాలి అని అనుకుంటుంది పద్మావతి.
రేపటి ఎపిసోడ్ లో,పద్మావతి కావాలని విక్కీ తో ప్రేమగా ఉన్నట్టు నటిస్తుంది మీరు తల సరిగా దువ్వుకోలేదండి ఎందుకంటే మీరు తల నీటుగాదువ్వు కుంటే హీరోలా ఉంటారు లేదంటే విలన్లా ఉంటారు నేను సరి చేస్తాను ఉండండి అని అంటుంది. విక్కీ ఇప్పుడు వద్దులే పద్మావతి కూర్చో అని అంటుంటాడు అవన్నీ ఇంట్లో వాళ్ళందరూచూస్తూ ఉంటారు.