Krishna Mukunda Murari: భవాని మురారి తలకు దెబ్బ తలగడం చూసి మురారి అంటూ ఏడుస్తూ గబగబా కిందకు దిగుతుంది. ఏమైంది మురారి ఈ తలకు దెబ్బ ఏంటి అని భవాని మురారిని అడుగుతుంది. క్యాంపులో ఫైర్ ఆక్సిడెంట్ జరిగితే మురారి అక్కడ ఉన్న పిల్ల ప్రాణాలు కాపాడాడని కృష్ణ భవానికి చెబుతుంది. రేవతి కూడా జరిగిన సన్నివేశాన్ని మొత్తం వివరిస్తుంది. మురారి పిల్లల్ని కాపాడడం అలా ఆ ఫైర్ ఆక్సిడెంట్ తో వాళ్ళని కాపాడిన తర్వాత తను ప్రమాదవశాత్తు కుప్పకూలి పడిపోవడం, సీనియర్ డాక్టర్లు కూడా మురారిని కాపాడలేక చేతులు ఎత్తేస్తే కృష్ణని మురారిని కాపాడిందని.. రేవతి భవానీతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెబుతుంది. ముకుంద కూడా థాంక్యూ కృష్ణ మురారిని కాపాడినందుకు అని అనగానే తన భర్తని కాపాడుకోవడం తనకి తెలుసు అని రేవతి అంటుంది. కృష్ణ మురారి పక్కన ఉండగా తనకి ఎలాంటి అపాయం జరగదు అని అంటుంది.

అలేఖ్య నువ్వు వంటగదిలోకి వెళ్లి హారతి పళ్లెం తీసుకురా అని భవానీ దేవి ఆదేశిస్తుంది. అలేఖ్య హారతి పళ్లెం తీసుకురాగానే ఆ హారతి పల్లవి ముకుంద కి ఇవ్వమని భవాని చెబుతుంది. కృష్ణ మురారిలకు హారతి తీయమని చెబుతుంది. పెద్ద కోడలిగా ఇది నీ బాధ్యత అని అంటుంది. పరిస్థితుల్లో ముకుందా కృష్ణ మురారిల ఇద్దరికీ హారతి తీస్తుంది. కుడికాలు ముందు పెట్టి కృష్ణ ని లోపలికి రమ్మని చెబుతుంది. ఆ తరువాత మురారిని పక్కకు తీసుకువెళ్లి మీది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా అయినా కృష్ణ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ముకుందా మురారిని నిలదీస్తుంది. ముకుంద కి ఇంకో ఆలోచన రాకుండా నా ఆలోచన లేకుండా చేయాలంటే తన మనసులో మరొక ఆలోచన రాకుండా ఉండాలి.

ఒకప్పుడు మేమిద్దరం ఒకరికొకరం తెలియదు కాబట్టి అగ్రిమెంట్ పెట్టుకున్నాము. ఇప్పుడు మేము ఆ అగ్రిమెంటల్ ను పూర్తిగా క్యాన్సిల్ చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టామని మురారి అంటాడు. అవునా మీరిద్దరూ కొత్త జీవితాన్ని మొదలుపెడితే నేను మీ జోలికి రాను, మీరిద్దరూ సంతోషంగా ఉండండి, ఒకరు ఒకరు ప్రేమ చూపించుకుంటూ గడిపేయండి అంటూ నేను అంటాను అనుకుంటున్నావా.. అలా ఎప్పటికీ జరగదు. నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం నీ ప్రేమ నాకు తప్ప ఇంకెవరికి దక్కన్నీవ్వను అని ముకుందా అంటుంది. ఏంటి ముకుందా నువ్వు స్కూల్ పిల్లల్లాగా ఈ చాక్లెట్ నాకే సొంతం అని అంటున్నావు అని మురారి అంటాడు. నన్ను గుండెల్లో పెట్టుకోవడం లాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు అని మురారి ముకుంద కి వార్నింగ్ ఇస్తాడు. నా ఫ్రెండు ప్రాణానికి ప్రాణమైన ఆదర్శ్ తిరిగి వస్తున్నాడు. నువ్వు అడికన్న గొప్పగా ప్రేమిస్తాడు. నువ్వు కూడా చెప్పావు కదా ఆదర్శం చూడండి. వాడు నిన్ను చాలా బాగా ప్రేమిస్తాడు. ప్రేమ అనే పిచ్చి మాటలు ఆపేసి నువ్వు సంతోషంగా ఉండు దయచేసి ఇకనుంచి వెళ్ళిపో అని మురారి ముకుంద కి వార్నింగ్ ఇస్తాడు.

ఇన్ని రోజుల నుంచి నేను కృష్ణ పై ఫోకస్ పెట్టలేదు తను ప్రశాంతంగా చదువుకోగలిగింది. కానీ ఇప్పటినుంచి అలా కాదు కృష్ణకి నిజం చెప్పేస్తాను. పెద్దత్తయ్యా నిజం చెప్పేస్తాను అంతెందుకు ఇందాక ఆల్మోస్ట్ నిజం చూపించడానికి మీ గది వరకు తీసుకువచ్చాను ఒక్క నిమిషం అయితే ఆ ఫోటోలన్నీ పెద్ద అత్తయ్య చూసేది. తను కూడా ఎలాగూ నా ప్రేమ గురించి తెలుసుకోవాలని తనకి ఇచ్చి నా పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఏంటి నమ్మకం కలగడం లేదా అంటూ తను డెకరేషన్ చేసిన వీడియో చూపిస్తుంది. ఇందాకే చెప్పేద్దామని తీసుకువెళ్లను కానీ అంతలోకే నువ్వు వచ్చేసావు. కృష్ణ నిన్ను ప్రేమించడం లేదు అయినా నువ్వు తననే కోరుకుంటున్నావు. అందుకే నా ప్రేమని నేనే కాపాడుకుంటాను. ఇన్నాళ్లు మీది అగ్రిమెంట్ అన్ని భరించాను, సహించాను. ఇప్పుడు నువ్వు మనసు మార్చుకున్నావు కదా నేను మనసు మార్చుకుంటున్నాను ఇక సహించేది లేదు అని ముకుందా మురారితో అంటుంది.

ఇంకొన్ని రోజుల్లో ఆదర్శ్ వస్తాడు. తనతో నువ్వు సంతోషంగా ఉండు అని మురారి అంటుండగా చాలు ఆపు మురారి ఈ ప్రపంచంలో నేను నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరూ నిన్ను ప్రేమించరు నాకు ఇంకెవరి ప్రేమ అవసరం లేదు. నీ ప్రేమ మాత్రమే కావాలి. నీ ప్రేమను కృష్ణకు దక్కన్నీవ్వను అని ముకుందా అంటుంది. ఇప్పుడు ఇంటి వరకు కృష్ణని తీసుకువచ్చావు కదా.. ఇక కృష్ణని నీ గదికి ఎలా తీసుకువెళ్తావో తీసుకెళ్ళు.. నేను చూస్తాను అని ముకుందా మురారి కి సవాల్ విసురుతోంది. కృష్ణ ఆ ఫోటోలను చూసి తన్ని మన పెళ్లి చేస్తుంది అని ముకుందా మనసులో అనుకుంటుంది.

కృష్ణ నేను నీకు ఇందాక ఫోటోస్ చూపించ కదా, ఇప్పుడు ఇంకో సర్ప్రైజ్ చూపిస్తాను అని కృష్ణ కళ్ళు మూసి మురారి పక్కన ఉండగానే ముకుందా కృష్ణ మురారిల గదిలో చేసిన డెకరేషన్ ని ముకుందా చూపించాలని అనుకుంటుంది. మరి మురారి అదంతా కృష్ణని చూడనిస్తాడా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.