Pillala Kathalu | నక్క, కోడి పుంజు: చాలా మంది తమ ఇంటి విషయాలను అంతగా పట్టించుకోరు గానీ ఇతరుల ఇళ్ల విషయాలపై ఆసక్తి చూపుతుంటారు. దీనికి సంబంధించి ఆసక్తికరమైన పిట్ట కథ ఇది. చిన్న పిల్లలు అక్బర్ బీర్బల్ కథలు, సరదా కథలు, నీతి కథలు, పంచతంత్ర కథలు చదవడం వల్ల వాటిలో నీతి అర్ధం అవుతుంది. అందుకే చిన్న పిల్లల కోసం ‘న్యూస్ ఆర్బిట్’ అందిస్తొంది. పిల్లల తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే సమయంలో వారి పిల్లలకు సెల్ ఫోన్ లు అలవాటు చేయకుండా చిన్న చిన్న నీతి కథలు చెప్పడం ద్వారా వారిలో మానసిక ఉల్లాసం కలుగుతుంది. పేరెంట్స్ తమతో టైమ్ స్పెండ్ చేస్తున్నారన్న భావన ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసు నుండే సెల్ ఫోన్ లను అలవాటు చేయడం వల్ల వారికి కళ్ల సంబంధిత రుగ్మతలు, చత్వారం (సైట్) వచ్చే అవకాశాలు ఉంటాయి. సెల్ ఫోన్ గేమ్స్ కు ఎడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్ళను, కోడి పిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచించబడ్డారు. నక్కకు కోళ్లు, కోడి పిల్లలు ఆహరం అవ్వడంతో ఊళ్లోని జనాలు నష్టపోతున్నారు. ఒక రోజు ఆ నక్క ఒక పొలంలో ఆదమరిచి నిద్రపోయింది. పొలంలో నక్క పడుకుండిపోయిన విషయాన్ని చూసిన ఓ వ్యక్తి అది చచ్చిపోయిందనుకుని గ్రామంలోకి వెళ్లి చెప్పాడు. దీంతో ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను యెవరో చంపేసారని హర్షించారు. జనమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి చేరుకుని చూసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఒక కోడి పుంజు కూడా తన పిల్లలతో చూడడానికి పొలం వద్దకు వెళ్ళింది.
ఇంతలో ఆ నక్క లేచి, పెద్దగా ఆవలించింది. ‘హరే! నువ్వు చచ్చిపోయావనుకున్నామే!’ అంది కోడి పుంజు నక్కతో. ‘లేదు, అదేమి కాదు. నిన్న రాత్రి బాగ తిన్నాను, అందుకే బాగా నిద్ర పట్టేసింది’ అని సమాధానం చెప్పిందా నక్క. దీంతో పుంజు వెంటనే తన పిల్లలను లెక్క పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువ వుంది. ఇదేమిటి, ఒక పిల్ల తక్కువ ఉన్నా నాకు తెలియలేదే అంది. ‘యేమిటయ్య! నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలీలేదు కాని ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలుస్తే వెంటనే వచ్చావు’ అంది నక్క వ్యంగ్యంగా. నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని, తరవాత ఇతరుల విషయం పట్టించుకోవాలి.
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ .. రాఖీ కానుకగా రూ.200 తగ్గింపు
కథలు.వరల్డ్‌ప్రెస్.కామ్ సౌజన్యంతో…