NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema:పద్మావతి ప్రేమని విక్కీ అర్థం చేసుకొనున్నాడా? అరవింద కు తెలిసిన మరో నిజం..?

Nuvvu Nenu Prema today episode 15 November 2023 episode 468 highlights
Share

Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి, విక్కీ కోసం ఉపవాసం ఉంటున్నట్లు చెబుతుంది. ఇంట్లో అందరూ విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అరవింద విక్కీ కి ఫోన్ చేస్తే నాకు చాలా టైం పడుతుంది. నాకోసం ఎవరు ఎదురు చూడొద్దు అని చెప్తాడు. విక్కీ లేటుగా ఇంటికి వస్తాడు అప్పటికే పద్మావతి ఆకలికి ఉండలేక భోజనం చేసేస్తుంది విక్కీ కోసం మళ్లీ భోజనం ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చేలోపు వికీ కళ్ళు తిరిగి పడిపోతాడు. షుగర్ లెవెల్స్ తగ్గడం వల్ల ఇలా జరిగింది అని పద్మావతి ఊహించి విక్కీకి స్వీట్ తినిపిస్తుంది దాంతో విక్కీ కళ్ళు తెరుస్తాడు. అరవింద విక్కీ ఆరోగ్య గురించి బాధపడుతుంది.

Nuvvu Nenu Prema today episode 15 November 2023 episode 468 highlights
Nuvvu Nenu Prema today episode 15 November 2023 episode 468 highlights

BrahmaMudi November 15 Episode 254: రాజ్ కి సూపర్ ట్విస్ట్ ఇచ్చిన కావ్య.. రాహుల్ ప్లాన్ అమలు.. రేపటి ఎపిసోడ్ లో సూపర్ ట్విస్ట్..

ఈరోజు ఎపిసోడ్ లో,అరవింద పద్మావతి తో తనకి ఏం కావాలో మీరు చూసుకుంటారు కదా అని అంటుంది. తప్పకుండా వదిన మీరు అసలే వట్టి మనిషి కూడా కాదు మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి తన గురించి అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అరవింద ని పంపిస్తుంది పద్మావతి. సరే జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పద్మావతి విక్కీ కి సేవలు చేయడం మొదలు పెడుతుంది. పద్మావతి విక్కీ కి కాళ్లు నొక్కుతూ, తలకి నూనె రాస్తూ నిద్రపోయేలా చేస్తుంది ఇక విక్కి మధ్యలో మెలకువ వచ్చి చూస్తాడు. ఏమైంది సారు అంత కంగారుగా ఉన్నారు అని పద్మావతి వాటర్ ఇస్తుంది విక్కీ వాటర్ తాగి మళ్ళీ పడుకుంటాడు. ఇక పద్మావతి రాత్రంతాలానే మేల్కొని విక్కీకి సేవ చేస్తూ ఉంటుంది.

Naga Panchami november 14 2023 episode 200 : మళ్ళి పంచమి మీద ప్రేమ పెంచుకున్న మోక్ష…

Nuvvu Nenu Prema today episode 15 November 2023 episode 468 highlights
Nuvvu Nenu Prema today episode 15 November 2023 episode 468 highlights

పద్మావతి బాధ..

ఇక పద్మావతి రాత్రంతా సేవ చేసి ఉదయం విక్కీకి సడన్గా మెలకువ వస్తుంది. ఏమైంది సారు అలా ఉలిక్కిపడి లేచారు ఏమన్నా కావాలా అని అంటుంది పద్మావతి నువ్వు ఇక్కడే ఉన్నావా అని అంటాడు విక్కీ అవును సారు అని అంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అంటాడు విక్కీ. ఇప్పుడేమై ఉండాలి సారు అని అంటుంది నీకు చెప్పాను కదా నాకు దగ్గర అవడానికి ప్రయత్నించొద్దని కానీ నువ్వు అదే చేస్తున్నావు అని అంటాడు విక్కీ అదేం లేదు సార్ అని అంటుంది లేకపోతే ఏంటి ఇప్పుడు నువ్వు సేవ చేస్తుంటే నేను చూసి అయ్యో అని అనాలా అయినా నువ్వు నా భార్యగా నేను ఒప్పుకోనప్పుడు నువ్వు నాకు భర్తగా ఎందుకు సేవ చేస్తున్నావు అని అంటాడు. మీరు రాత్రి కళ్ళు తిరిగి పడిపోయారు. మీకు ఏమైందో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అంటాడు ఇవన్నీ నాకు తెలుసులే పద్మావతి నువ్వు నా ముందు నాటకాలు అడ్డం ఆపేసేయ్ అని అంటాడు. పద్మావతి ఆ మాటకు చాలా బాధపడుతుంది నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా నేను మాత్రం నిన్ను భారీగా ఒప్పుకోలేను అని అంటాడు. పద్మావతి అక్కడి నుంచి బాధగా వెళ్లిపోతుంది. విక్కీ అన్న మాటలే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. శ్రీనివాసా నేను ఎంత చేసినా కానీ ఆయనకి నా మీద ప్రేమ కలగడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari:ముకుంద నిజస్వరూపం మురారి కి తెలియనుందా? దీపావళి పండుగ రోజు కృష్ణకి అపాయం జరగనుందా?

Nuvvu Nenu Prema today episode 15 November 2023 episode 468 highlights
Nuvvu Nenu Prema today episode 15 November 2023 episode 468 highlights

కుచల కోపం..

పద్మావతి అలా ఆలోచిస్తూ ఉండగా అక్కడే ఉన్న అను ఏమైంది అని అడుగుతుంది ఏం లేదు అని అంటుంది పద్మావతి. నువ్వు విక్కీ గురించే ఆలోచిస్తున్నావా తనకేం కాదు లేమ్మా అని అంటుంది అను. లేదక్కా నీకు తెలిసి నువ్వు అదే అనుకుంటున్నావు కానీ తను ఇంత బాధలో కూడా నన్ను కోప్పడుతున్నాడు నాకు అదే మనసు బాధగా ఉంది అని అనుకుంటుంది మనసులో పద్మావతి. సరే మీ నువ్వు టిఫిన్ చేస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అంటుంది టిఫిన్ ప్రిపేర్ చేయడానికి పద్మావతి దోశ పిండి కలుపుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి కుచల వస్తుంది . ఏం చేస్తున్నావు అని అంటుంది. మీకేం కావాలో చెప్పండి అత్తయ్య అని అంటుంది పద్మావతి నాకు వేడిగా ఉల్లి దోశ వేసి ఇవ్వు అని అంటుంది. సరే అని పద్మావతి పెనం మీద దోశ వేస్తుంది కానీ ఏదో ఆలోచనలో పడి దోస మాడిపోతుంది అక్కడే కుచల ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఏంటి ఏదో మాడిపోయిన వాసన వస్తుంది అని చూస్తుంది తీరా చూస్తే పద్మావతి వేసిన దోసకాయ పూర్తిగా మాడిపోతుంది ఇక్కడే నుంచొని ఉండి దోస మడిపోయాలా చేస్తావా అని పద్మావతి మీద కోప్పడుతుంది. అయ్యో చూసుకోలేదు అని అంటుంది పద్మావతి చూసుకో ఎందుకు చూసుకుంటావు నీకు ఈ మధ్య కళ్ళు నెత్తికెక్కియి నిన్ను ఇంట్లో అందరూ మహారాణిలా చూస్తున్నారు కదా అప్పుడు ఆటోమేటిక్గా నీకు కొమ్ములు చేసినయి అని అంటుంది కుచల. పద్మావతి అలా ఏం లేదు అత్తయ్య అని అంటుంది ఇలానే ఇలానే అమాయకంగా నటిస్తూ మా ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేశారు మీ అక్క చెల్లెలు ఇద్దరు ఇప్పుడు ఇంకా బాగా నటిస్తున్నావు అయినా నీవు ఇక్కడే ఉండి నేను చెప్పిన చిన్న పని కూడా చేయలేదంటే నేను ఏమనాలి అని అంటుంది పద్మావతి తో కుచల. అప్పుడే అక్కడికి అరబిందో వస్తుంది.

Nuvvu Nenu Prema today episode 15 November 2023 episode 468 highlights
Nuvvu Nenu Prema today episode 15 November 2023 episode 468 highlights

తన కోసం నా ప్రాణమైన ఇస్తానన్న పద్మావతి..

ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారు పద్మావతి మీద అని అంటుంది అరవింద వస్తు వస్తూనే. ఏం చెప్పమంటావా అరవింద నేను ఒకే ఒక పని చెప్పాను అది కూడా దోస వేయమంటే ఈ పద్మావతి చూడు ఎలా మార్చేసిందో అని అంటుంది. ఇప్పుడు కావాలంటే మళ్ళీ వేసి ఇస్తాను అని అంటుంది పద్మావతి ఏం అవసరం లేదమ్మా నువ్వేం చేయక్కర్లేదు మీరు మహారాణి కదా మీరు ఏం చేయక్కర్లేదు అని అంటుంది ఇప్పుడు ఏమైంది పిన్ని దోస కదా మాడిపోయింది నేను వేసి ఇస్తాను ఉండండి అని అంటుంది. ఏమొద్దు అని నేను వేస్తాను వదినా అత్తయ్య మీరు వెళ్లి కూర్చోండి నేను వేస్తాను అని అంటుంది. ఈ నాటకాలకు ఎంతకూ లేదు అని అంటుంది వెంటనే అరవిందా రాత్రంతా తను విక్కీ కోసం జాగారం చేసి తనకి సేవలు చేసింది కదా అందుకని తనకి బాగుండలేదు, ఆ మాత్రం దానికే నువ్వు ఎందుకు పిండి పద్మావతి మీద అలా అరుస్తావు అని అంటుంది అరవింద. మీరందరూ ఇలా వెనకేసుకు రాబట్టే అరవిందా ఈ అక్క చెల్లెలు ఇద్దరు మన మాట వినట్లేదు అంత నెత్తినెక్కించుకోకండి అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పద్మావతి తో అరవిందా ఇప్పుడు మీకు బానే ఉంది కదా అని అంటుంది విక్కీ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. తను బానే ఉన్నారు వదిన నేను తనని జాగ్రత్తగా చూసుకున్నాను ఇప్పుడు దానికి అంతా సెట్ అయిపోయింది తన కోసమే కాఫీ తీసుకొని వద్దామని వచ్చాను అని అంటుంది పద్మావతి. మా విక్కీ వల్ల మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా తను ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మీరు కూడా ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది అరవింద అయ్యో అదేం లేదు వదిన కోసం నా ప్రాణము ఇస్తాను తన ఆరోగ్యం బాగుంటే నాకు అంతే చాలు అని అంటుంది పద్మావతి మీలాంటి కోడలు దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము అని అంటుంది అరవింద.

Nuvvu Nenu Prema today episode 15 November 2023 episode 468 highlights
Nuvvu Nenu Prema today episode 15 November 2023 episode 468 highlights

Nuvvu Nenu Prema: విక్కీ ఆరోగ్యం గురించి అరవింద కంగారు.. విక్కీ ప్రేమ కోసం పద్మావతి చేసిన ప్రయత్నం.

 

పద్మావతి గురించి విక్కి ఆలోచన..

ఇక అరవింద విక్కీ దగ్గరికి వస్తుంది ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది తగ్గింది అక్క బానే ఉంది అని అంటాడు విక్కీ నువ్వు ఆరోగ్యం బాగా చూసుకో అక్క నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు నాకేం పరవాలేదు నేను బానే ఉన్నాను అని అంటాడు. నువ్వు బానే ఉంటావు వికీ ఎందుకంటే నీకు మంచి భార్య దొరికింది తను నిన్ను ప్రేమగా చూసుకుంటుంది రాత్రంతా నీకు సేవలు చేస్తూ తను నీ గురించి ఆలోచిస్తూ ఇప్పుడు కూడా నీకోసమే కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది అని అంటుంది అరవింద. నీకు కూడా నీ భార్య అంటే చాలా ఇష్టము ఆ విషయం నాకు తెలుస్తుంది అని అంటుంది. అరవింద మాట్లాడుతుంటే విక్కీ అలానే ఆలోచిస్తూ ఉంటాడు ఇక పద్మావతిని ప్రేమగా చూసుకో ఎందుకంటే తను మనకి చాలా మంచి చేసింది నీకు కూడా తెలుసు ఆ విషయం అని అంటుంది అరవింద్ నా సంగతి సరే అక్క నువ్వు రెస్ట్ తీసుకో అని ఉంటాడు అయినా నిన్ను ఏ పనులు చేయొద్దని చెప్పాను కదా నువ్వు ఎందుకు ఇలా తిరుగుతున్నావు అక్క అని అంటాడు విక్కీ. పద్మావతి ఉండగా నాకేం అవుతుంది అని అంటుంది అరవింద. సరే నువ్వు ఇక్కడే ఉండు పద్మావతి నీకోసం టాబ్లెట్స్ తీసుకుని వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది అరవింద సరే అంటాడు విక్కి. అరవింద వంట గదిలోనికి వెళ్లి టయానికి పద్మావతి ఎదురు వస్తుంది. విక్కీ కోసమే కాఫీ తీసుకొని ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వస్తుంది అంత కంగారు ఎందుకు పద్మావతి మెల్లిగా వెళ్లొచ్చు కదా అయినా మీ ఆయన కూడా నీ కోసమే ఎదురుచూస్తున్నాడులే నువ్వు వెళ్లకపోతే తనే వచ్చేలా ఉన్నాడు అని అంటుంది అరవింద్ వదిన అని పద్మావతి కాఫీ తీసుకొని వెళ్తుంది విక్కి దగ్గరికి. కాఫీ తీసుకెళ్లి విక్కీకి ఇస్తుంది విక్కీ అప్పటికే పద్మావతి రాత్రంతా తనకు సేవలు చేసిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తీసుకోండి సారూ మీకోసమే తెచ్చాను అని అంటుంది ఇక పద్మావతిని అలానే చూస్తూ ఉంటాడు విక్కి. వాళ్ళిద్దర్నీ చూసి అరవింద వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి వీళ్ళ మధ్య ఏ పొరపాటు రాకూడదు అని అనుకుంటుంది.

రేపటి ఎపిసోడ్ లో విక్కీ, చూసావా ఇదే నా టాలెంట్ అంటే అని అంటాడు దేని గురించి సారు అని అంటుంది పద్మావతి రాత్రి నాకేం కాలేదు నాకు ఏదో అయినట్టు నేను నటించాను అంతే అని అంటాడు. ఆ మాటకి పద్మావతి షాక్ అవుతుంది అక్కడే అరవింద వాళ్ళిద్దరికీ తెలియకుండా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వింటూ ఉంటుంది. విక్కీ చెప్పిన మాట విని అరవింద కూడా షాక్ అవుతుంది. మీకేం కాలేదా అని అంటుంది పద్మావతి అవును ఏమి చదువుకొని నీకే అంత నటించే టాలెంట్ ఉంటే, బిజినెస్ మాన్ ని నాకేమీ తెలివితేటలు ఉండాలి అందుకే కావాలనే ఇలా చేశాను అని అంటాడు విక్కీ.


Share

Related posts

Intinti Gruhalakshmi: నందుకు భార్య గా.. లాస్య నీ ఆటలు చెల్లవన్న తులసి..

bharani jella

Krishnamma Kalipindi Iddarini Today సెప్టెంబర్ 16: ఈశ్వర్ తో తన ప్రవర్తన గురించి ఉజ్జ్వల మీద మండిపడ్డ గౌరీ…అఖిలను ఇంటి పనులతో ఇరకాటంలో పెట్టిన సౌదామిని!

siddhu

Gopichand-Chiranjeevi: గోపీచంద్‌కు సాయం చేసేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నెల్‌..!

kavya N