Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,అరవింద శ్రీమంతానికి పద్మావతి అను, ఏర్పాట్లు చేయడం,భక్త పార్వతీ అరవింద్ ఇంటికి రావడం, పద్మావతి చాలా సంతోషంతో అరవింద శ్రీమంతంలో పాల్గొనడం, విక్కీ మొదటిసారి పద్మావతి ఇచ్చిన డ్రెస్ వేసుకోవడం, అరవింద విక్కీ ఇద్దరు వాళ్ళ అమ్మే మళ్ళీ అరవింద కడుపున పుడుతుంది అని తెలిసి సంతోషించడం జరుగుతుంది. ఇదంతా చూసిన కృష్ణ ఎలాగైనా అరవింద్ ను చంపేయాలని, ఒక ప్లాన్ తో ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో, పద్మావతి, విక్కీఇప్పుడు సంతోషంగా ఉన్నాడు ఇదే మంచి టైం నా మనసులో ఉన్న మాటని చెప్పాలి అని అనుకుంటుంది. వాళ్ళ అమ్మ పుట్టబోతున్నది అన్న ఆనందంలో విక్కీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నా మనసులో మాట చెప్పేయాలి. కానీ ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న గులాబీ పూలని తీసుకొనిబెడ్ మీద ఐ లవ్ యు అని రాస్తుంది.ఇలా డైరెక్ట్ గా విక్కీ వచ్చి చూస్తే తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఏమో అని భయపడి కర్టెన్ వెనకాల దాక్కొని విక్కీ కోసం ఎదురుచూస్తుంది.

నువ్వు ఎప్పటికీ నా దానివి కాదు అన్న విక్కీ..
ఇక విక్కీ రూమ్ దగ్గరికి వస్తాడు. పద్మావతి డెకరేషన్ చేసిన బెడ్ మీద ఉన్న పూలను చూసి, ఇలా ఎవరు రాశారు అని అనుకుంటూ ఉంటాడు. అంతలో కర్టెన్ వెనుక ఉన్న పద్మావతిని గమనిస్తాడు. కర్టెన్ తీసి బయటికి రమ్మంటాడు. పద్మావతి తో విక్కి ఏంటి ఇదంతా అని అంటాడు. కనిపిస్తుంది కదా సారు అదేంటో చదవండి అని అంటుంది. ఏంటి నాటకాలు ఆడుతున్నావా అని అంటాడు. నేనేమన్నాను సారూ అక్కడ ఏముందో మీకు తెలిసి కూడా నన్ను అడుగుతారు ఏంటి అని అంటుంది. ఏంటి తెలివితేటలు ఉపయోగిస్తున్నావా అని అంటాడు. మీ మనసులో ఉన్న ప్రేమని బయటికి తీస్తున్నాను అని అంటుంది పద్మావతి. నువ్వు చేసిన మోసానికి, అది ఎప్పుడో చచ్చిపోయింది అని అంటాడు విక్కీ. ఇప్పుడు నా మనసులో నువ్వు మిగిల్చిన బాధ తప్ప ప్రేమ లేదు రాదు అని అంటాడు. మీరు అలా మాట్లాడకండి మీ మనసులో చెప్పలేనంత ప్రేమ ఉన్నది నా మీద దాని బయటికి తీస్తున్నాను అంతే, నా మీద కోపంతోనే మీరు బయట పెట్టట్లేదు ఒక దూరి నా మాట వినండి అని అంటుంది. ఒకసారి వినేవంచనకి గురయ్యాను ఇప్పుడు వినే ఓపిక తీరిక నాకు లేవు. ఇంకెప్పుడూ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అండర్స్టాండ్, ఎన్నిసార్లు అలా అపార్థం చేసుకుంటారు నన్ను అని అంటుంది. నిజం మీకు చెప్పాలని ఎప్పటినుంచే ప్రయత్నిస్తున్న మీరు నా మాట వినట్లేదు. జరిగిందంటూ నా తప్పేం లేదు, నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటుంది. నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది నీలా మోసం చేసే వాళ్ళ దగ్గర ప్రేమ ఎప్పటికీ ఉండదు. మోసం చేసే ఆలోచన ఉంటే నేను మీతో తాలు ఎలా కట్టించుకుంటాను అని అంటుంది పద్మావతి. నా ప్రేమ నిజం నేను మిమ్మల్ని మోసం చేయలేదు అన్నది నిజం. అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడూ ఎప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని అంటుంది పద్మావతి. నా మనసులో మీరు తప్ప వేరే ఎవరూ లేరు రారు అని అంటుంది. అది మీకు తెలియాలనే ఇలా రాసి పెట్టాను అని ఇది నిజం నమ్మండి అని అంటుంది. ఇదంతా అబద్ధమని విక్కీ కోపంతో బెడ్ మీద ఉన్న పూలన్నీ కిందకు విసిరేసి అంత అబద్ధం, చెదిరిపోయే రాతలు ఎప్పటికీ చేదు జ్ఞాపకాలు లాగే మిగిలిపోతాయి. నా దృష్టిలో గడిచిన గతం ఒక చేదు జ్ఞాపకం, నా మనసుని మార్చాలని నువ్వు ఎంత ప్రయత్నించినా, లాభం లేదు ఎందుకంటే నువ్వంటే నాకు అసహ్యం, నీ మీద నాకు ఎప్పటికీ ప్రేమ పుట్టదు రాదు, ఇది గుర్తుపెట్టుకో అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పద్మావతి బాధతో అక్కడే కూర్చుని ఏడుస్తూ ఈ టెంపర ని ఎలా మార్చాలి శ్రీనివాస అని అనుకుంటూ ఉంటుంది.

పార్వతి ని అవమానించిన కుచల..
ఇక కుజల రెడీ అయ్యి, శ్రీమంతానికి కిందకి వస్తూ పార్వతి వాళ్లకి ఎదురవుతుంది. బాగున్నారా అని అడుగుతాడు భక్త. ఏం బాగుంటాం మీరు వచ్చారు కదా ఇంక బాగా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటుంది కుచల. అదేంటి వదిన అంత మాట అన్నారు అని అంటుందిపార్వతి.మీ ఇద్దరి పిల్లల్ని ఫ్రీగా మా కట్టబెట్టారు ఆ తలకాయ నొప్పులతోనే రోజు అల్లాడుతున్నాము. ఇప్పుడు దాని పెంచడానికి మీరు కూడా తయారయ్యారు కదా అని అవమానంగా మాట్లాడుతుంది. అయినా ఏంటి ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని వచ్చారు శ్రీమంతం పేరు చెప్పుకొని ఒక వారం రోజులు ఉందామనుకుంటున్నారా అని అంటుంది. లేదు వదినా ఇవన్నీ అరవింద్ గారి కోసం నేనే చేసుకొని తీసుకొచ్చాను పిండివంటలు అని అంటుందిపార్వతి.అవునా ఏది ఇలా ఇవ్వు చూద్దాం అని, కుచల వాటిని తీసుకొని టేస్ట్ చేసి ఉమ్మేస్తుంది. ఛీ ఎంత చండాలంగా ఉన్నాయో ఇవి, వీటిని ఎవరైనా పిండి వంటలు అంటారా,అసలు టెస్ట్ ఏ లేవు అని అంటుంది వెంటనే పార్వతి లేదు వదినా నా చేతులతో నేను స్వయంగా అరవింద్ గారి కోసం నెయ్యి వేసి మరీ చేసుకోవచ్చు అని అంటుంది. ఇదంతా అక్కడే ఉన్న విక్కీ చూస్తుంటాడు. వెంటనే విక్కీ కుచల దగ్గరికి వచ్చి ఏంటి పిన్ని మీరు చేస్తుంది అని అంటాడు. అంటే విక్కీ అని ఏదో చెప్పబోతుంది కుచల. వంటలన్నీ బయటపడేమని చెప్పు విక్కీ అని అంటుంది.నేను అంతా చూసాను పిన్ని ఇక్కడే ఉన్నాను అని అంటాడు. వాళ్లకి మన డబ్బు లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రేమ అభిమానాలు ఉన్నాయి వాళ్లు అక్క కోసం ప్రేమగా చేసి తీసుకొచ్చిన వంటల్ని నువ్వు అలా అంటే వాళ్ళు ఎంత బాధ పడతారు పిన్ని. వాళ్లని మీరు అవమానించింది చాలు,అయినా అత్తయ్య మామయ్య మా పిన్ని తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను.అంత మాట ఎందుకులే బాబు అని అంటుంది పార్వతి.నిండు మనసుతో మీరు మా అక్కని ఆశీర్వదించడానికి వచ్చారు. మీరు చూపించే ప్రేమ అభిమానాలు ఆశీస్సులు,ఎల్లప్పుడు మా అక్క మీద ఉండాలి అప్పుడేతను నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుంది మీరు వెళ్ళండి అని అంటాడు.కుచల వీళ్ళకి ఎంత చెప్పినా ఇంతే, వీళ్ళు ఎవరి ముందు ఎలా నటించాలో బాగా తెలుసు మహానటులు వీళ్ళు అని అనుకుంటుంది మనసులో

అరవింద కోసం పద్మావతి వంట..
ఇక పద్మావతి అరవింద కోసం చలివిడి చేయాలి అనుకుంటుంది. అరవింద కోసం చలివిడి చేస్తున్నావా పద్మావతి చెయ్, దాంతో నాకు చాలా పని ఉంది అని కృష్ణ అక్కడే ఉండి మనసులో అనుకుంటాడు. పద్మావతి చక చకా చలివిడి చేయడం ప్రారంభిస్తుంది. పది నిమిషాల్లో గుమగుమలాడే చలివిడి రెడీ అవుతుంది. నువ్వు చేసినట్టుగా వంట ఎవరు చేయలేరు అని తనకు తానే అనుకొని హాల్లోకి వెళ్తుంది అను చలివిడి చేశావా మీ అని అంటుంది చేశాను అక్క ఇంకేమైనా చేయాలా అని అంటుంది. వెంటనే కుచ్చులా చేసేస్తా చింపేస్తాను డైలాగులు చెప్పడమేనా, నన్నేమైనా చూసుకునేది ఉందా అని అంటుంది. వెంటనే శాంతాదేవి అదే మాట నేను నిన్ను అడుగుతున్నాను. ఇంటికి పెద్దదాన్ని నీకు అత్తగారిని అసలు నేను ఒకదాని ఉన్నానని నీకు గుర్తుందా కుచల, ఎప్పుడు చూడు పనిచేసే వాళ్ళని మాటలు అంటూ ఉంటావు. దానికి అనడం తప్ప పని చేయడం చేత కాదమ్మా అని అంటాడు నారాయణ. నేను తీసుకొచ్చేసాను కదా మామయ్య గారు ఎందుకు అత్తయ్య గారికి చెప్తారు అని అంటుంది అను. దానికి అప్పుడప్పుడు అలాంటి పనులు చెప్పాలి అని అంటాడు నారాయణ

అరవింద శ్రీమంతం..
ఇక శాంతాదేవి అను,పద్మావతిఇద్దరూ వెళ్లి అరవింద అని కిందకు తీసుకురండి అమ్మ అని అంటుంది. అప్పటికే అరవింద్ రెడీ అవుతూ ఉంటుంది ఇక పద్మావతి మీరు ఒక్కరే రెడీ అవ్వకపోతే మమ్మల్ని కూడా పిలవచ్చు కదా వదినా అని అంటుంది. పర్వాలేదులే అని, అరవింద రెడీ అవుతూ ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి అరవిందను తయారు చేస్తూ ఉంటారు. నేను చాలా అదృష్టవంతురాలని నాకు ప్రేమగా చూసుకునే తమ్ముళ్లే కాదు మరదలు కూడా దొరికారు అని అంటుంది అరవింద. అదృష్టం మీ ఒక్కళ్ళే కాదు ఇలాంటి ఆడపడుచు దొరికినందుకు మేము కూడా అదృష్టవంతులమే అంటుంది పద్మావతి. అరవింద తొందరగా తీసుకురండి అని కింద నుంచి పిలుస్తారు. గారవిందని తీసుకొని కిందకి వెళ్తారు పద్మావతి, అను ఈలోగా కృష్ణ పద్మావతి చేసిన చలివిడిలోవిషయం కలుపుతాడు.అరవింద కిందకి వచ్చికూర్చుంటుంది ఇక శ్రీమంతానికి అందరూ రెడీ అవుతారు. చాలా గ్రాండ్ గా శ్రీమంతం వేడుకలు జరుగుతాయి. విక్కీ అరవింద కోసం మంచి బంగారు నగని తీసుకువస్తాడు. ఇక కృష్ణ మనసు లో నీ ముఖంలో చావు కదా స్పష్టంగా కనిపిస్తుంది అరవిందఅని అనుకుంటాడు.ఇక అరవిందకు గాజులు తొడిగి పసుపు రాసి బొట్లు పెట్టి, శ్రీమంతం వేడుక చేస్తారు. అరవిందతో పద్మావతి ఇకనుంచి మీరే పండుగ చేయకూడదు అన్ని పనులు మేమే చేస్తాము. మీరు రెస్ట్ తీసుకొని పండంటి బిడ్డని మా చేతిలో పెట్టాలి అని అంటుంది. పద్మావతి చెప్పిన తర్వాత నేను వినకుండా ఉంటానా అంటుంది. వెంటనే కుచ్చులా ఖర్చయి మామ అది హడావిడిమో నీది అని అంటుంది.
రేపటి ఎపిసోడ్ లో ఇక పద్మావతి చలివిడి మీకోసమే చేశాను వదిన మీకు మీ కడుపులో బిడ్డకి మంచి జరగాలి ఈ చలివిడి చేశాను తినండి అని అంటుంది. ఇక పద్మావతి తన చేతులతోనే చలివిడిని అరవింద కు పెడుతుంది. అందరూ అరవింద్ కు అదే చలివిడిని పెడతారు. వెంటనే అరవిందా కడుపులో నొప్పి అని అరుస్తుంది. విక్కీ ఏమైంది అక్క అని అంటాడు.. కృష్ణ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు.