NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 01 2024 Episode 586: విక్కీ కోసం పద్మావతి బాధ.. డిటెక్టివ్ గా కుచల.. రౌడీల బారి నుండి తప్పించుకోవాలనుకున్న విక్కీ..

Nuvvu Nenu Prema Today Episode April 01 2024 Episode 586 highlights

Nuvvu Nenu Prema April 01 2024 Episode 586: విక్కీని ఎయిర్పోర్ట్ లో నుంచి బయటికి వచ్చేటప్పుడు రౌడీలు కిడ్నాప్ చేస్తారు. విక్కీ ఎవరిని అడిగితే మా బాస్ వచ్చి నీకు సమాధానం చెప్తారు అని రౌడీలు వికీని కట్టేస్తారు. ఇంతకీ మీ బాస్ ఎవరో చెప్పండి అని మీకు ఎన్ని సార్లు అడిగినా వాళ్లు చెప్పరు ఇక విక్కి అక్కడ నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దివ్య కృష్ణ ఇద్దరు కలిసి విక్కీ మీద పగ సాధించడం మొదలుపెడతారు. కృష్ణ విక్కీ అమెరికా వెళ్ళట్లేదని తెలుసుకొని, ఎయిర్ పోర్ట్ లోనే రౌడీల్ని పెట్టి కిడ్నాప్ చేయిస్తాడు. ఆస్తి మొత్తం తన పేరు మీదికి రావడానికి ఇంకొక పది రోజులు పడుతుందని ఈ పది రోజులు విక్కి బందీగా అక్కడే ఉండాలని అనుకుంటాడు. ఇదంతా దివ్యకి కృష్ణకి మాత్రమే తెలుసు ఇంట్లో అందరూ విక్కీ కోసం కంగారు పడుతూ ఉంటారు. వికీ వెళ్తున్న ఫ్లైట్ ఆక్సిడెంట్ అవ్వడంతో విక్కి అందులోనే ఉన్నాడేమో అని అనుకోని కుటుంబ సభ్యులు ఆందోళన పడతారు ఇక విక్కీ ఫ్లైట్ ఎక్కలేదు అని, తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ విక్కీకి ప్రమాదం జరగలేదని తెలుసుకుంటారు కానీ విక్కీ ఇంటికి రాకపోవడంతో పద్మావతి కంగారు పడుతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 01 2024 Episode 586 highlights
Nuvvu Nenu Prema Today Episode April 01 2024 Episode 586 highlights

ఈరోజు ఎపిసోడ్ లో పద్మావతి కలలో విక్కీకి రౌడీలు తరుముతున్నట్టు తను కాపాడబోతే విక్కి లోయలో పడినట్లుగా కలగని పెద్దగా సారు అని అరుస్తుంది. అక్కడికి అరవిందా వస్తుంది ఏమైంది పద్మావతి ఎలా అరిచావు అని అడిగితే నాకు పీడకల వచ్చింది వదిన అని చెప్తుంది . ఇప్పటిదాకా మాకు ధైర్యం చెప్పి ఇప్పుడు నువ్వు కంగారు పడుతున్నావా అదేలే ప్రేమంటే అని అంటుంది అరవింద్ ఎక్కడికి వెళ్ళలేదు వచ్చేస్తాడని తెలిసింది కదా ఫ్లైట్ ఎక్కలేదు అని తెలిసినప్పుడు రావాలి కదా వదినా అని అంటుంది కనీసం ఎవరికో ఒకరికైనా మెసేజ్ అయినా పెట్టి ఉండాలి అలా పెట్టలేదంటే ఆయనకు ఏమైందో అని నాకు కంగారుగా ఉంది ఆయన ఏదో ప్రమాదంలో ఉన్నాడని అర్థమవుతుంది అని పద్మావతి అంటుంది. అలా ఏం జరిగి ఉండదులే పద్మావతి రేపు ఉదయం కల్లా విక్కీ వచ్చేస్తాడు నువ్వు అదే ఆలోచిస్తూ పడుకొని పీడ కలలు కనకుండా మీ మధ్య జరిగిన మంచి జ్ఞాపకాల అనేది తలుచుకుంటూ పడుకో. అప్పుడు నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది అని పద్మావతికి నచ్చజెప్పి అరవింద ఉదయం కల్లా ఆయన జాడ తెలుసుకోమని కృష్ణతో చెప్పాలి అని అనుకుంటుంది ఇక పద్మావతి మాత్రం మీ గురించి తెలిసేదాకా నాకు నిద్ర పట్టదు సార్ అని పడుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 01 2024 Episode 586 highlights
Nuvvu Nenu Prema Today Episode April 01 2024 Episode 586 highlights

కట్ చేస్తే రౌడీలు అందరి దగ్గర విక్కీ చిక్కుకొని ఉంటాడు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ విక్కీ ఎక్కడికి పారిపోకుండా చూస్తూ ఉంటారు. విక్కీ వాళ్ళందరూ మాట్లాడుకోవడం గమనించి మెల్లిగా తాళ్లని విప్పుకొని, అక్కడి నుంచి బయటపడాలి అనుకుంటాడు. ఒక రౌడీ కి తన భార్య ఫోన్ చేయడంతో నేను బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడి వస్తాను మీరు విని జాగ్రత్తగా చూసుకోండి అని బయటికి వెళ్తాడు ఇక అదే అదిగా చూసుకొని విక్కీ కట్లిప్పుకుంటాడు. అందులో ఒక రౌడీ విక్కీని చూసి అరే వీడికి కట్టలు ఇప్పుకున్నాడు అని దగ్గరికి వెళ్లేసరికి విక్కీ అందర్నీ బాగా కొడతాడు. ఇక చివరికి విక్కీ రౌడీలు అందరినీ కొట్టిన ఒక రౌడీ వెనుక నుంచి వచ్చి విక్కీ తల మీద కొట్టడంతో విక్కీ అక్కడే పడిపోతాడు ఇక విక్కిని మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టి కట్టేస్తారు. విక్కీకి మెలకువ వచ్చి లేచేసరికి మళ్ళీ అక్కడే ఉండడంతో తను చాలా బాధపడుతూ ఉంటాడు. రౌడీలు అందరూ కూడా విక్కీ తో నీ గురించి ఎవరైనా బాధపడే వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు. అందులో ఒక రౌడీ భార్య ఫోన్ చేసి ఎప్పుడు సతాయిస్తూ ఉంటుంది. మరొక రౌడీ అందుకేరా భార్య ఎప్పుడైనా అర్థం చేసుకునేది రావాలి అని అంటాడు అప్పుడే విక్కీ కూడా పద్మావతి గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మరోవైపు పద్మావతిని కూడా చూపిస్తారు తను విక్కీ రాలేదని గుర్తు చేసుకుంటూ వికీషత్ ని తను వేసుకుని విక్కీ కోసం బాధపడుతూ ఉంటుంది. మీరు నా ప్రాణం సార్ మీకు ఏమీ కాదు కానీ మీరేదో ప్రమాదంలో చిక్కుకున్నారని అర్థమవుతుంది మీరు తొందరగా రావాలి మీరు లేకుండా నేను ఉండలేను సారు అని అనుకుంటూ ఉంటుంది.

కట్ చేస్తే విక్కీ కూడా పద్మావతినే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం నీ విలువ తెలియలేదు పద్మావతి ఇప్పుడు నువ్వు నాకు దూరం అయిపోయావు అని అంటాడు అప్పుడే పద్మావతిని కూడా చూపిస్తారు. నేను నీ నుండి విడిపోలేదు సారు, ఎప్పుడు మీరు నాతోనే ఉన్నారు అని అనుకుంటుంది మరోవైపు విక్కి కంటితో చూసేది కాకుండా మనసుతో చూసేదే ప్రేమ అన్నావు పద్మావతి ఇప్పుడు అదేంటో నాకు అర్థం అవుతుంది కానీ నేను నీ దగ్గర లేను అని అంటాడు. మీరు ఎప్పుడూ నాతోనే ఉన్నారు సారు అని పద్మావతి ఆ షర్ట్ ని వేసుకొని బాధపడుతూ ఉంటుంది. నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను పద్మావతి అని విక్కీ కూడా బాధపడుతూ ఉంటాడు.విక్కీ పద్మావతి చీర, వెనక ఉన్న ఒక చిన్న కుచ్చు లాంటిది విక్కీషట్ కి ఇరుక్కోవడంతో విక్కీ అది ఇప్పుడు చూసి చూసుకొని బాధపడుతూ ఉంటాడు. పద్మావతి కూడా విక్కీని తలుచుకొని ఇంట్లో బాధపడుతూ ఉంటుంది ఇక వెనక బ్యాక్ గ్రౌండ్లో సాడ్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది.

కట్ చేస్తే ఉదయం నారాయణం నిద్ర లేస్తాడు కుచలని చూసి భయపడతాడు. అప్పటికే ఆమె డిటెక్టివ్ అవతారం వేస్తుంది. ఇలాంటి డ్రెస్ లో చూసి భయపడకు ఏం చేయాలి అంటాడు నారాయణ ఇలా అందరూ సైలెంట్ గా ఉంటే ఎలాగు విక్కీ కనిపించట్లేదు కదా మనం వెతకడానికి వెళ్తున్నాం అని అంటుంది. అది ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటాడు నారాయణ నీకేం తెలీదు నారా నారు నాతో పాటు రా అని కిందకు తీసుకు వెళుతుంది. అప్పటికే హాల్లో అందరూ కూర్చొని ఉంటారు పద్మావతి కాఫీ ఇస్తుంటే అరవింద వద్దంటుంది ఇక అంతలో నారాయణ వచ్చి విక్కీ కనిపించక 24 గంటలు అవుతుంది ఇప్పటివరకు తనకి ప్రమాదం అయితే జరగలేదని తెలిసింది కానీ తన ఆచూకీ మాత్రం తెలియలేదు అందుకే మేమిద్దరం విక్కీ ని వెతకడానికి వెళ్లాలనుకుంటున్నాము అని అంటుంది ఈ వేషం ఏంటి కుచ్చులా అని అడుగుతుంది శాంతాదేవి. ఇది డిటెక్టివ్ అవుతారు అత్తయ్య ఇలా వెళ్లి మనం విక్కీ ని వెతకచ్చు అని అంటుంది. కృష్ణ దివ్య ఇద్దరు పక్కపక్కనే కూర్చుని ఉంటారు దివ్య కృష్ణతో ఏంటి ఓవరాక్షన్ చేస్తుంది అని అంటే ఆవిడకి వచ్చింది అది అంటాడు కృష్ణ. విక్కీ ఏం చిన్న పిల్లాడు కాదు ఏదో బాధ్యతలో వేరే పని మీద ఎక్కడికైనా వెళ్లి ఉంటాడు. ఆ మాత్రం దానికి నువ్వు ఇలా వెతకాల్సిన అవసరం లేదు అంటుంది శాంతాదేవి. నేను అదే చెప్తున్నాను అమ్మ వినట్లేదు అంటాడు నారాయణ. పద్మావతి నేను ఇందాక ఆయన ఫోన్ కి ఫోన్ చేస్తే కలవట్లేదు అని అంటుంది. ఆర్యా కూడా నేను ట్రై చేశాను నాకు అలానే వస్తుంది అని అంటాడు. విక్కీ గురించి ఏమీ తెలియట్లేదు ఇన్ఫర్మేషన్ అని బాధపడుతూ ఉంటే అక్కడే ఉన్న కృష్ణ ఎందుకు అందరూ అంత టెన్షన్ పడుతున్నారు అని అంటాడు. విక్కీ క్షేమంగా ఉన్నాడని తెలిసింది అది మనకు సంతోషమే కదా అని అంటాడు పద్మావతి కృష్ణ వైపు కోపంగా చూస్తుంది. మనం తనకి ఏమైంది అని టెన్షన్ పడడం అవసరమా అని అంటాడు పక్కనే ఉన్న దివ్య నాకు కూడా అదే అనిపిస్తుంది అని అంటుంది. నేను ఒప్పుకోను ఇందులో ఏదో తిరకాసు ఉందని అనిపిస్తుంది అని అంటుంది కుచల. విక్కీని చూడకుండా మాట్లాడకుండా అరవింద్ నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండలేవు కదా, మరి ఇప్పుడు ఎందుకమ్మా అంత సైలెంట్ గా ఉన్నావు అని అంటుంది కుచల. విక్కీ కూడా నిన్ను వదిలిపెట్టి ఒక గంట ఉండాల్సి వచ్చినా 10 సార్లు ఫోన్ చేస్తాడు కదా, అలాంటిది ఇప్పుడు కనీసం మెసేజ్ కూడా చేయట్లేదు అంటే తన ఫోన్ పనిచేయట్లేదు విక్కీ సేఫ్ గా ఉన్న, తను ఇంకో డేంజర్ లో ఏదైనా ఉన్నాడేమో అనిపిస్తుంది అని అంటుంది కుచల. ఆ మాటలకు ఇంట్లో అందరూ షాక్ అవుతారు. పిన్ని ఏంటి మీరు మాట్లాడేది అని అంటుంది అరవింద. అవును అరవింద ఒక ప్రమాదం నుంచి బయటపడగానే విక్కీ నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు అట్లాంటిది ఇంతవరకు మెసేజ్ కూడా చేయలేదంటే తను ఇంకో ప్రమాదంలో ఉన్నాడనే కదా అని అంటుంది. బానే ఉంటాడు అని అంటుంది పద్మావతి బానే ఉన్నాయి ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా అంటుంది. అది తెలియాలంటే ఒకటే మార్గం అని అంటుంది ఏంటో చెప్పండి అత్తయ్య అని అంటుంది. మన పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం అని అంటుంది కుచల. వెంటనే దివ్య కృష్ణ ఇద్దరు కంగారు పడతారు. అరవింద కూడా నాకు పిన్ని చెప్పిందే నిజం అనిపిస్తుంది మనం వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అని అంటుంది. కృష్ణ ఎలాగైనా వీళ్ళని ఆపాలి ఏదో ఒకటి చేసి అని అనుకుంటాడు. తీగలాగితే డంక కలుగుతుంది నా విషయం బయటపడుతుంది విక్కీగురించి అంతా తెలిసిపోతుంది అని అనుకుంటాడు.

కట్ చేస్తే, విక్కీ నుండి అరవింద కి ఫోన్ వస్తుంది. వాలి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకున్నప్పుడే విక్కీ ఫోన్ రావడంతో అందరూ ఆగిపోతారు. ఇక విక్కీ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అరవింద ఏడుస్తూ ఉంటుంది నా గురించి నీకు తెలుసు కదా విక్కీ నువ్వు కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా యూఎస్ వెళ్లక పోతే ఇక్కడే ఉంటే ఎందుకు ఇంటికి రాలేదు అని అడుగుతుంది వెంటనే విక్కి నేను బాగానే ఉన్నాను అక్క నువ్వు కంగారు పడొద్దు నేను అమెరికా ప్రయాణం లాస్ట్ మినిట్ లో ఆగిపోయింది దాంతో లండన్ లో ఇంకొక ప్రోగ్రాం ఉంటే అక్కడికి వచ్చాను అని అంటాడు ఇప్పుడు నేను లండన్ లో ఉన్నాను అక్క అని చెప్తాడు. శాంతాదేవి తీసుకొని ఫోను నీకోసం ఇక్కడ బాధపడే వాళ్ళు ఉన్నారు కదా నువ్వు ఎక్కడ ఉన్నది ఏంటి చెప్పాలి కదా అని అంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి ఎదురుగా విక్కీ వచ్చి నిలబడతాడు పద్మావతి నిజంగానే విక్కీ వచ్చాడు అని అనుకుంటుంది. విక్కీ పద్మావతి దగ్గరికి వెళ్లి తనకి గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యు అని ప్రపోజ్ చేసి తనను ఎప్పటికీ వదిలేయక వెళ్ళనని తనతోనే ఉంటానని ప్రామిస్ చేస్తాడు ఇక పద్మావతి సంతోషంగా ఆ ఫ్లేవర్ ని తీసుకుంటుంది. ఇది కల లేక నిజమో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N