NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 1 2024 Episode 433: ఆస్తి అధికారం కావాలన్న ఆదర్శ.. భవానీ దేవి కోపం.. ఆదర్శకు దగ్గరవుతున్న మీరా.. కృష్ణ అనుమానం..?

Krishna Mukunda Murari Today Episode April 1 2024 Episode 433 highlights

Krishna Mukunda Murari April 1 2024 Episode 433: ఆదర్శ కోపంలో మధుని తిడుతూ ఉంటాడు. అప్పటికి ఈ ఆదర్శ ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గర భవాని దేవి వార్నింగ్ ఇస్తుంది. అయినా అదంతా లెక్కచేయకుండా మురారితో గొడవ పడతాడు. ఆ తర్వాత ఇప్పుడు మధు తో కూడా గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి భవానీ దేవి ఇంట్లో అందరూ వస్తారు. ఏమైందని ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని భవానీ దేవి ఆదర్శ్ ని అడుగుతుంది. ఇంట్లో ఎవరూ నాకు విలువట్లేదు అమ్మ నేను నీ కొడుకుని కాదు కదా అందుకే వీళ్లంతా నన్ను పరాయి వల్ల చూస్తున్నారు అని అంటాడు ఆ మాటలుకు అందరు షాక్ అవుతారు. ఏంటి నువ్వు మాట్లాడేది అంటుంది భవాని దేవి నిజం మాట్లాడుతున్నాను అమ్మ నేను నీ కొడుకుని కాకపోవడం వల్లే వీళ్ళు ఎవరు నాకు గౌరవం ఇవ్వట్లేదు నేను చెప్పిన మాట కూడా విలువ ఇవ్వట్లేదు అని అంటాడు. నాకు అన్యాయం చేసిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని నన్ను బాధ పెడుతున్నారు చివరికి దారిని పోయే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అని మీరా వైపు చూసి మాట్లాడుతాడు ఆ మాటలకు మీరు తొందరగా ఆదర్శ మార్చేయాలి అని అనుకుంటుంది. ఇంట్లో నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరు అని అడుగుతుంది రేవతి. సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు ఆదర్శ్.

Krishna Mukunda Murari Today Episode April 1 2024 Episode 433 highlights
Krishna Mukunda Murari Today Episode April 1 2024 Episode 433 highlights

ఇక రేవతి మధు ని అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. ఇంట్లో కూర్చుని తాగుతానంటే ఇంట్లో పెద్దమ్మ ఉంది కదా తను చూస్తే బాధపడుతుంది నువ్వు నీ రూమ్ లో తాగొచ్చు కదా అని అన్నాను అంటాడు వెంటనే ఆదర్శ్ చూసావా ఎందుకు పనికిరాని వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు అని అంటాడు. ఆ మాటలకు రేవతి కోపంగా మధుని ఎప్పుడు తిడుతూనే ఉంటావు వాడు ఎందుకు పనికిరాడు వాడు అని, వాడు ఒక లక్షణం కోసం పనిచేస్తున్నాడు డైరెక్టర్ అవ్వాలంటే చిన్న స్థాయి నుంచే పైకి ఎదగాలి ఇప్పుడు ఎదిగిన డైరెక్టర్లు అందరూ అలా వచ్చినవాళ్లే అలానే మధు కూడా ఏదో ఒక రోజు పెద్ద డైరెక్టర్ అవుతాడు దానికోసం వాడి నిరంతరం కష్టపడుతున్నాడు అంతేకానీ వాడు ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చోవట్లేదు అని రేవతి అంటుంది పోనీలే పెద్ద మన అన్నయ్య కదా అన్నది అంటాడు మధు మీరంతా మనవాడే అని అనుకుంటున్నారు కానీ వాడు మాత్రం అలా అనుకోవట్లేదు అని అంటుంది రేవతి. మురారి ఏ తప్పు చేయలేదని ప్రపంచం మొత్తం నమ్మినా కూడా ఆదర్శ మాత్రం నమ్మడం లేదు ఇక పోలీసులు లాక్ అప్ లోనే చంపేస్తాం అన్నప్పుడు కూడా మాట్లాడలేదు అలాంటిది వీడికి ఏం తెలుస్తాయి ప్రేమలీల అభిమానాలు అని అంటుంది రేవతి అవన్నీ ఎప్పుడు మర్చిపోయాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. మధు అంటే అసలు గిట్టనే గిట్టలేదు అని అంటుంది. ఇక అక్కడే ఉన్న మురారి అసలు నేను తప్పు చేయలేదు అని అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు ఆ విషయం ఆదర్శం మాత్రం నమ్మడం లేదు తను నమ్మించాలంటే ఇప్పుడు నేను తప్పు చేసినట్టు ఒప్పుకోవాలా లేదంటే తనకి ఈ ఇంట్లో పరాయి వాళ్ళ లాగా చూస్తున్నట్లు అనుకుంటాడా అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 1 2024 Episode 433 highlights
Krishna Mukunda Murari Today Episode April 1 2024 Episode 433 highlights

ఇక భవానీ దేవి మాత్రం సైలెంట్ గా బాధపడుతూ ఉంటుంది రేవతి అక్కయ్య నేను అన్న దాంట్లో ఏమన్నా తప్పు ఉందా అని అంటే నువ్వు మాట్లాడేటప్పుడు తప్పు ఉంటే నేనే ఆపేదాన్ని కద రేవతి అని అంటుంది భవాని. వీడే తిక్కగా మాట్లాడుతున్నాడు అని అంటుంది ఇక కృష్ణ మేము ఇంట్లో పరాయి వాళ్ళ లాగా నిన్ను చూస్తున్నామని నువ్వు అంటున్నావు కదా నిన్ను అయినవాడు లాగా చూడాలి అంటే ఏం చేయాలో చెప్పు మేము దేనికైనా సిద్ధం అని అంటుంది కృష్ణ ఆ మాటలకి భవాని అడుగుతుంది కదా చెప్పు నిన్ను ఇంట్లో పరాయి వాళ్ళ లాగా చూస్తున్నారు అని అంటే నన్ను కూడా కలిపే అన్నావు కదా ఆదర్శా అని భవాని బాధపడుతూ, కృష్ణ అడుగుతుంది కదా ఈ ఇంట్లో నిన్ను ఏం చేస్తే నువ్వు అయిన వాడివి అవుతావో చెప్పు అని అంటుంది. వెంటనే ఆదర్శ్ ఈ ఇంట్లో ఆస్తి,ఈ ఇల్లు నా పేరు మీద రాసేయండి అప్పుడు నేను మొత్తం అధికారం నా చేతిలోకి వస్తుంది ఎవరింట్లో ఉండాలి ఎవరు ఇక్కడ ఉండకూడదని నేను డిసైడ్ చేస్తాను అని అంటాడు ఆ మాటలకు వెంటనే భవానికి కోపం వచ్చి ఆదర్శ్ చెంప మీద గట్టిగా కొడుతుంది. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటుంది. ఈ ఇంట్లో నుంచి ఎవరు వెళ్లిపోయినా నా ప్రాణం పోయినట్లు ఇంట్లో అందరూ నాకు ప్రాణం తో సమానం అలాంటిది నువ్వు ఇప్పుడు నా ప్రాణం తీయాలి అనుకుంటున్నావా అని అంటుంది. వీడికి కూడా నేనంటే చాలా ఇష్టం విని నేను ఎలా పెంచాను ఎలా ప్రేమించాను చిన్నప్పటినుంచి నేను ఎంతో గారాబంగా చూసుకున్నాను వీడికి నేనంటే ఇష్టం ఉన్నా కూడా ఈరోజు వీడికి దయ్యం పట్టినట్లు మాట్లాడుతున్నాడు అని ఆదర్శం మీద కోప్పడుతుంది భవానీ దేవి అక్కడే ఉన్న మీరా ఇదంతా మనం ఉపయోగించుకోవాలి ఈ సిచువేషన్ వాడుకొని ఆదర్శని దగ్గర అవ్వాలి అనుకొని అక్కడికి వెళ్లి ఆదర్శతో మనం పక్కకు వెళ్దాం పదండి సార్ అని భవాని మేడం నేను ఈ ఆదర్శ్ కి నచ్చ చెప్తాను అని పక్కకు తీసుకు వెళుతుంది. భవాని దేవి మాత్రం చాలా బాధగా సోఫాలో కూలబడి ఏడుస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 1 2024 Episode 433 highlights
Krishna Mukunda Murari Today Episode April 1 2024 Episode 433 highlights

ఇక ఆదర్శం తీసుకెళ్లినా మీరా ఆదర్శ్ కి మందు పోస్తూ సారీ ఎందుకు మీరు అలా మాట్లాడింది ఇది మీ ఇల్లే కదా అని అంటుంది. చిన్నగా తాగండి అని మందు పోస్తూ ఉంటుంది ఆదర్శ ఇది నా ఇల్లు నేను అనుకోవడం లేదు అలా అనుకోవడానికి ఇక్కడ నా వాళ్ళు ఎవరూ లేరు అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీవాళ్లే సార్ అని అంటుంది మీరా నా వాళ్ళు ఎవరూ లేరు అని చెప్తున్నాను కదా చివరికి నేను ఎంతో ప్రేమించిన ముకుంద కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది అని అంటాడు. ఆ మాటలకు మీరు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావా ఇదే రూట్ లో వచ్చి నిన్ను నా వైపు తిప్పుకుంటాను అని అంటుంది. ముకుంద మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది సార్ అని అంటుంది మీరు జెంటిల్మెన్ అని మంచి వారని ఎప్పుడూ తనకి ఫోన్ లో చెప్తున్నట్లుగా మీరు ఆదర్శ్ తో మాట్లాడుతుంది. ఆ మాటలు వింటూ ఆదర్శ ముకుందా నన్ను అర్థం చేసుకోలేదు అని అంటాడు. లేదు సార్మీరంటే ముకుందకి చాలా ఇష్టం మీకు దగ్గర అవ్వాలని మీతో కలిసి బతకాలని తను నాతో చెప్పింది అప్పుడు నేను మంచి నిర్ణయం తీసుకున్నావు ఆదర్శ మంచివాడు కాబట్టి నువ్వు అనుకున్నది చెయ్యి అని అన్నాను అని అంటే వెంటనే ఆదర్శం మరి శోభనం గదిలో నాతో ఏం చెప్పిందో తెలుసా అని అంటాడు తెలుసు నాకు అంతా తెలుసు సార్ కానీ ఎందుకు ఇలా చేసిందన్నది మాత్రం అర్థం కావట్లేదు మీతో లైఫ్ పంచుకుందామనుకున్న మనిషి చివరి నిమిషంలో ఇలా మాట్లాడింది అంటే ఎవరో తనని మార్చేశారు అని మీర అంటుంది. వెంటనే ఆదర్శం మనసులో కూడా ఈ ముకుంద మారడానికి ఎవరో కారణం అన్నట్లుగా అనుమానం కలిగేలాగా మాట్లాడుతుంది.

Krishna Mukunda Murari Today Episode April 1 2024 Episode 433 highlights
Krishna Mukunda Murari Today Episode April 1 2024 Episode 433 highlights

ఇక ఆదర్శ్ కూడా నమ్మేస్తాడు కచ్చితంగా ముకుందా ఎవరు చెప్పినా వింటుంది అలానే ఎవరో తన మనసు మార్చేశారు అని అంటాడు. అప్పుడే అక్కడికిమురారి వస్తాడు మురారిని చూసి ఆదర్శ కోప్పడతాడు మురారి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వెంటనే మీరా మురారిని పక్కకు తీసుకువెళ్లి ఆదర్శ కోపం లో ఉన్నాడని ఈ టైంలో తనతో మీరు మాట్లాడితే ఆ కోపం పెరుగుతుందని చిన్నగా నేనే తనకి నచ్చ చెప్తానని మురారి కి చెప్తూ మురారితో దగ్గర అవ్వాలని తన మీద చేయి వేస్తుంది మురారి థాంక్స్ మీరా అని అంటాడు ఇక మురారి తనకి దగ్గరగా వచ్చి అలా దూరం అవ్వడం మీరా భరించలేక పోతుంది. మురారి నువ్వు తొందరగా నా కౌగిలిలోకి రావాలి అని మనసులో అనుకొని మురారిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆదర్శ్ ముకుందతో తను మాట్లాడిన విషయాలు ముఖం తనతో మాట్లాడిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే మీరా మీరు ముకుంద గురించి ఆలోచించడం మానేయండి మీకు ఏదైనా బాధ ఉంటే నాతో పంచుకోండి నేను ఉన్నాను కదా అని అంటూ మందుపొస్తుంది ఇక ఆదర్శ్ కూడా మీరానినమ్ముతాడు.ముకుంద కూడా నీలాగే మందు పోస్తూ, నాతో మాట్లాడుతూ ఉండేది ఇప్పుడు నువ్వు కూడా అలానే చేస్తున్నావు అని అంటాడు ఆదర్శ. మీరా తన అనుకున్నది సక్సెస్ఫుల్గా జరుగుతున్నందుకు ఆనందపడుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 1 2024 Episode 433 highlights
Krishna Mukunda Murari Today Episode April 1 2024 Episode 433 highlights

ఇక మరోవైపు భవాని దేవి రూమ్ లో ఆదర్శ అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. ఆదర్శ ఎందుకిలా మారిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది.అప్పుడే అక్కడికి కృష్ణ వస్తుంది. భవానీ దేవి బాధగా ఈ కుటుంబం అంతా కలిసి ఉండాలని నేను నిరంతరం ప్రయత్నిస్తుంటే వాడు ఇప్పుడు ముక్కలు చేయాలని చూస్తున్నాడు అని బాధపడుతుంది. ఆదర్శ ఏదో తాగిన మత్తులో అలా మాట్లాడుతున్నాడని దినంతటికీ కారణం నేనే అత్తయ్య ముకుంద మారిందనుకొని ఆదర్శం ఇంటికి తీసుకువచ్చాను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నన్ను క్షమించండి మీరు అనుకున్నది నేను చేయలేకపోయాను అని బాధపడుతుంది వెంటనే భవానీ దేవి నువ్వు బాధపడొద్దు కృష్ణ నిన్ను అర్థం చేసుకోలేని వాళ్లే బాధపడాలి ఇవాళ కాకపోతే రేపైనా అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు. లేదా అత్తయ్య ఆదర్శ్ కి నామీద మురారి ఏ సార్ మీద కోపంగా ఉంది ముకుంద చావుకి మేమే కారణం అని గట్టిగా నమ్ముతున్నాడు మేమెంత చెప్పినా వినట్లేదు. ఇప్పుడు ఆ కోపంతోనే ఇదంతా చేస్తున్నాడు అందుకే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి అనుకుంటున్నాడు అని అంటుంది. మిమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి వస్తే అసలు వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అని అంటుంది భవాని ఆ మాటకు కృష్ణా షాక్ అవుతుంది. అవును కృష్ణ కొంతకాలం వాడి ఇంట్లో లేకపోతే మనందరం ఉన్నాము. ఇప్పుడు వాడు ఇక్కడికి వచ్చేసి మనల్ని బాధ పెడుతున్నాడు. నువ్వు ముకుంద మారింది అనుకోని వాడి ఇంటికి తీసుకువచ్చావు మంచి చేయాలనుకుంటే ఒక్కొక్కసారి ఇలానే జరుగుతుంది అయినా ఇప్పుడు ఆదర్శం మారడం మనకి ముఖ్యం అని అంటుంది భవాని. ఆదర్శ్ మారతాడనే తీసుకొచ్చాము అత్తయ్య కానీ ఇలాగ అవుతుంది అని అనుకోలేదు అని కృష్ణ బాధపడుతుంది. ముకుంద ఒక బండరాయి తన మనసు మారిందని నువ్వు అనుకున్నావు కానీ తన మనసు ఎప్పటికీ మారదని నాకు తెలుసు అందుకే తను చివరి నిమిషంలో కూడా మురారి అనే సొంతం చేసుకోవాలని ప్రయత్నించింది. అని భవాని దేవి కృష్ణతో అంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో మీరా, శ్రీనివాస్ కి ఫోన్ చేసి ఇల్లు అమ్మమని చెప్పాను కదా నాన్న ఎంత వాడికి వచ్చింది అని అంటుంది. ఇంకా బేరం రాలేదని చెప్తాడు నువ్వు ఏదో చెప్తావు కనీసం ఇల్లు కూడా అమ్మడం చేతకాదు నాన్న అని శ్రీనివాస్ మీద కోపంగా మాట్లాడుతుంది. అదంతా వెనక ఉన్న కృష్ణ వింటుంది. ఈ అమ్మాయికి ఎవరూ లేరని చెప్పారు కదా మరి నాన్న అని ఎవరిని పిలుస్తుంది ఫోన్లో అని అనుమాన పడుతుంది వెంటనే దగ్గరికి వెళ్లి నీకు ఎవరూ లేరని చెప్పావు కదా మరి నాన్న అని ఎవరిని పిలుస్తున్నావని అడుగుతుంది మీరా షాక్ అవుతుంది.. ముకుందే మీరా నీ కృష్ణ కనిపెడుతుందేమో చూడాలి..

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella