Surya: ప్రస్తుత కాలంలో సినీ సెలెబ్రిటీల కూతుర్లు మరియు కొడుకుల గురించి సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండ్ చేస్తున్నారు ట్రోలర్స్. వారు కాలు అడుగు బయట పెడితే చాలు వారి ఫోటోలను తీస్తూ సంతృప్తి చెందుతున్నారు. అదేవిధంగా వారు తొందర్లోనే ఇండస్ట్రీకి రానున్నారంటూ అనేక ప్రచారాలు చేస్తున్నారు.
ఇక తాజాగా మరో సెలబ్రిటీ కూతురు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె మరెవరో కాదు సూర్య కూతురు. స్టార్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన తమిళ్ స్టార్ హీరో సూర్య మన అందరికీ సుపరిచితమే. తెలుగులో సింగం, బ్రదర్స్, సూర్య వెడ్స్ సూర్య వంటి సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈయన రోలెక్స్ సినిమాతో భారీ గా గుర్తింపు పొందాడు.
ఇక తాజాగా సూర్య మరియు జ్యోతికాల కూతురు ఫొటోస్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. సూర్య కూతురు పేరు దియా. ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు. ఇటీవలే తన తల్లి సోషల్ మీడియా ఖాతాలలో దర్శనమిచ్చిన ఈమె అందాన్ని చూసిన పలువురు షాక్ అవుతున్నారు. ఈమె అందం ముందు బడా హీరోయిన్లు కూడా బలాదూర్ అంటున్నారు. ప్రస్తుతం సూర్య డాటర్ పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.