OTT releases: ఒక వీకెండ్ వెళ్లినట్లు తెలియకుండానే మరో వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ లో బ్యాచిలర్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ తప్పక చేసే పని సినిమాలు చూడడం. వీకెండ్ అంటేనే ఒక రిలాక్సేషన్ లాగా. వీకెండ్ వచ్చిందంటే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం వేసవికాలం కావడంతో సినిమాలని చూసేందుకు పెద్దగా బయటకి కూడా వెళ్ళరు. ఓటీటీలపై ఆధారపడతారు. ఒకవైపు థియేటర్లో టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు సంచలనం సృష్టించడానికి వస్తుంటే మరోవైపు ఓటీటీల హవా కూడా పెరిగిపోయింది. అందులో కూడా పదికి పైగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. దీంతో సినీ ప్రియులకి పండగ అని చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్ లో టాలీవుడ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి తో పాటు అభినవ్, గోమటం నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ రెండిటిపై ప్రేక్షకులలో భారీ హైబ్స్ నెలకొన్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ హాలీవుడ్ నుంచి పలు ఆసక్తికర సినిమాలు సైతం స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. అలా ఈ వీకెండ్ లో ఒక్కరోజులోనే 10 సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి వాటి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వీకెండ్ ఓటీటీ లిస్ట్
అమెజాన్ ప్రైమ్:
• ఇన్స్పెక్టర్ రిషి (వెబ్ సిరీస్) – మార్చ్ 29న స్ట్రీమింగ్
• మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా (టాలీవుడ్ మూవీ) – మార్చ్ 29
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
• పట్నా శుక్లా (హిందీ మూవీ) – మార్చ్ 29
• మధు ( డాక్యుమెంట్) – మార్చ్ 29
• ద బ్యూటిఫుల్ గేమ్ – మార్చ్ 29
నెట్ఫ్లిక్స్:
• ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) – మార్చ్ 29
• హార్ట్ ఆఫ్ ది హంటర్ ( హాలీవుడ్ మూవీ ) – మార్చ్ 29
• ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ( హిందీ) – మార్చ్ 30
బుక్ మై షో:
• ది హోల్డోవర్స్ (హాలీవుడ్ మూవీ) – మార్చ్ 29
జియో సినిమా:
• ఎ జెంటిల్ మాన్ ఇన్ మాస్క్ (వెబ్ సిరీస్) – మార్చ్ 29
ఇలా ఈ పది సినిమాలు నేడు అనగా వీకెండ్ రోజున స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. ఇక వీటిలో మీకు నచ్చిన సినిమా మరియు సిరీస్ లను వీక్షిస్తూ సంతృప్తి చెందండి. ఈ ఎండల్లో బయటికి వెళ్లే పని లేకుండా ఇంచగ్గా సంప్రదించి ఈ సినిమాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేయండి. ఇక ప్రస్తుతానికి అయితే థియేటర్లో పెద్దగా సినిమాలేమీ ఆడడం లేదు. నేడు టిల్లు స్క్వేర్ రిలీజ్ అయింది తప్ప కనుమ స్టార్ హీరోల సినిమాలు ఏవి ఆడడం లేదు. ఇందుకు కారణం ఎగ్జామ్స్. థియేటర్ల దగ్గర హడావిడి చేసే యువత ఎగ్జామ్స్ లో బిజీగా ఉంటే తమ సినిమాలని ఆదరించేది ఎవరు అనే సందేహంతోనే స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ చేసేందుకు వెనక్కి తగ్గుతున్నారు. ఈ క్రమంలోని ఓటీటీలు తమ సత్తా నిరూపిస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!