NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 15 2024 Episode 177: స్వర వంటరిగా ఉందని రవీంద్ర బబ్లు ఏం చేయనున్నారు..

Paluke Bangaramayenaa Today Episode March 15 2024 Episode  177 highlights

Paluke Bangaramayenaa March 15 2024 Episode 177: స్వర ని అభిషేక్ ఇంటికి తీసుకువస్తాడు. స్వర నీకేమైనా కావాలా అని అభిషేక్ అంటాడు. ఏమీ వద్దు సార్ అని స్వర అంటుంది. స్వర నీకోసం సెక్యూరిటీగా కానిస్టేబుల్ ని పెట్టన అని అభిషేక్ అంటాడు. పర్వాలేదు సార్ అని స్వర అంటుంది. ముందుకు వెళ్లిన అభిషేక్ స్వర నీకోసం ఏమైనా ఫుడ్ తెప్పించమంటావా అని అభిషేక్ అంటాడు. ఉంది సార్ అని స్వర చెబుతుంది. లేదంటే బయటకి తీసుకు వెళ్దాం అనుకున్నాను అని అభిషేక్ అనుకుంటాడు. ఏంటది సార్ అని స్వర అంటుంది. స్వర లైట్లు బంద్ చేయకుండా పడుకో ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్ అని అభిషేక్ పరి పరి విధాల తనకి జాగ్రత్తలు చెప్పి కారులో వెళ్లి కూర్చుంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 15 2024 Episode  177 highlights
Paluke Bangaramayenaa Today Episode March 15 2024 Episode  177 highlights

స్వర నిన్ను వదిలిపెట్టి వెళ్లాలని లేదు కానీ వెళ్ళక తప్పడం లేదు కాసేపు ఏదైనా మాట్లాడొచ్చు కదా స్వర నీ మాటలు కవ్విస్తూ  అర్థం కానట్టు ప్రేమగా మాట్లాడొచ్చు కదా అని అభిషేక్ అనుకుంటాడు. నాకు తెలుసు సార్ మీకు ఇకనుంచి వెళ్లాలనిపించడం లేదని కానీ ఏం చేయను మీరు బయటపడరు నేను చెప్పలేను ఇలా దోబూచులటలో మన0 ఇద్దరం మౌనంగా ఉండి పోతున్నాం మీ రాక కోసం మళ్లీ ఎదురు చూస్తూ ఉంటాను అని స్వర అనుకుంటుంది. అభిషేక్ స్వరని విడిచి వెళ్లలేక ఉండలేక ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, స్వర ఏం చేస్తున్నావ్ ఈ చందమామ లాగా మబ్బుల చాటున దాగి నన్ను కవ్విస్తూ ఉన్నావ్ అని అభిషేక్ ఆలోచిస్తూ ఉంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 15 2024 Episode  177 highlights
Paluke Bangaramayenaa Today Episode March 15 2024 Episode  177 highlights

నాకు తెలుసు అభి సార్ అని స్వర అంటుంది. ధైర్యంగా ఉంటానని మాట ఇచ్చావు ఏ అవసరమైన కాల్ చేస్తానని మాట ఇచ్చావు నువ్వు ధైర్యంగా ఉండు అని అభిషేక్ అనుకుంటాడు. మనం ఇలాంటివి ఎన్ని దాటాలో ఊహించుకుంటూనే భయం వేస్తుంది కానీ అభి సార్ ఈ భయాలు అన్నింటిని పటా పంచలు చేసింది మీరే మీ మనసులో ఉన్నది నా చెవిలో వేయడం మీరు నన్ను ప్రేమిస్తున్నారని ధైర్యంగా చెప్పండి అభి సార్ అని స్వర నవ్వుకుంటుంది. ఒకసారి స్వరకి ఫోన్ చేస్తే వద్దులే తను నిద్రపోయి ఉంటుంది ఒకవేళ నిద్రపోతే డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది వాళ్ళ నాన్న మీద బెంగతో ఉంటుంది ప్రశాంతంగా నువ్వైనా నిద్రపో స్వర నాకెలాగూ నిద్ర పట్టదు అని అభిషేక్ అనుకుంటాడు. కట్ చేస్తే, రవీంద్ర బబ్లు కి ఫోన్ చేసి స్వర ఒక్కతే ఇంట్లో ఉందని చెప్పు మ అన్నయ్య పడుకోగానే వాడికి కూడా స్పాట్ పెట్టేద్దాం అని చందన అంటుంది. రవీంద్ర ఫోన్ చేసి బబ్లు కి స్వర ఒక్కతే ఇంట్లో ఉంది వెళ్లి పట్టుకో అని చెబుతాడు. రవీంద్ర నువ్వు మా గ్యాంగ్ లో చేరిపో అని బబ్లు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 15 2024 Episode  177 highlights
Paluke Bangaramayenaa Today Episode March 15 2024 Episode  177 highlights

ఇక్కడ అభికి స్పాట్ పెట్టాం అని రవీంద్ర అంటాడు. అభి ప్రాణాలు స్వరలో ఉన్నాయి ముందు స్వరని పట్టుకోవాలి వచ్చే రవీంద్ర అని బబ్లు చెబుతాడు. సరే అని రవీంద్ర వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అమ్మ చాలా బాధగా ఉంది ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఏదైనా నీకే చెప్పుకునేదాన్ని కదా నాన్న కూడా ప్రకృతి నేలయానికి వెళ్ళిపోయాడు నాన్నకు దూరంగా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు అమ్మ అభి సార్ నన్ను చాలా బాగా పట్టించుకుంటారు అని స్వర అనుకుంటూ ఉంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 15 2024 Episode  177 highlights
Paluke Bangaramayenaa Today Episode March 15 2024 Episode  177 highlights

ఇంతలో కళ్యాణి మనుషుల్ని తీసుకొని  స్వర వాళ్ళ ఇంటికి వస్తుంది. అమ్మ అభి సార్ కూడా నన్ను ప్రేమిస్తున్నారు కానీ మొండోడు బయటపడడం లేదు అని స్వర అనుకుంటుది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. అభి సార్ వచ్చినట్టున్నాడు అని స్వర వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. స్వర డోర్ ఓపెన్ చేయగానే కళ్యాణి కనిపిస్తుంది. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివే ఉన్నావా ఇకమీదట నుంచి నీకు అవసరం లేదులే అమ్మ ఎందుకంటే ఈ ఇల్లు వైజయంతి గారి దంట కదా నేను వెళ్లిపొమ్మంది అని కళ్యాణి చెబుతుంది.

Paluke Bangaramayenaa Today Episode March 15 2024 Episode  177 highlights
Paluke Bangaramayenaa Today Episode March 15 2024 Episode  177 highlights

ఈ ఇల్లు వైజయంతికి మా నాన్న ఒకప్పుడు రాసిచ్చాడు కానీ ఇది మా తమ్ముడికి చెందుతుంది వాడికి చట్ట పరంగా వాడికి  సొంతం చేస్తాను అని స్వర అంటుంది. నీకు లా గురించి బాగా తెలుసు కదా నువ్వు లా చదువుతున్నావ్ కదా కానీ నీకు వైజయంతికి ఏ సంబంధం ఉందని వాళ్ళ ఇంట్లో ఉంటావమ్మా తను నీకు సవతి తల్లి నువ్వు నాశనం అయిపోవాలని కోరుకుంటుంది కానీ తన ఇంట్లో ఉండాలనుకోవట్లేదు అందుకే మమ్మల్ని ఈ ఇంటికి గార్డెన్ గా పెట్టింది ఒక గంట టైం ఇస్తున్నాను నీ లాయర్ తెలివితేటలు చూపించకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోని సామాన్లని సర్దుకొని అని కళ్యాణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri