Paluke Bangaramayenaa November 18 2023 Episode 77: తడట ఆడదామా అని ఆర్య అంటాడు. సరే ఆడదాం అందరికీ ఓకేనా అని అభిషేక్ అంటాడు.అయితే నేను ఝాన్సీ అభి మా ఆయన ఒకవైపు అని చందన అంటుంది. ఏంటి నువ్వు నాతో పెట్టుకుంటావా ఇంకెవరితోటి అయినా పెట్టుకో ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నావే ఈ బామ్మ అని అంటుంది. కట్ చేస్తే, ఇటుపక్క నలుగురు అటుపక్క నలుగురు తాడిపట్టుకుని లాగుతూ ఉంటారు. అభి మనం ఓడిపోకూడదు లాగు గట్టిగా అని ఝాన్సీ అంటుంది. చూడు స్వరా గట్టిగా లాగు మనమే గెలవాలి అని కీర్తి అంటుంది. చూసుకుందామా మీ ప్రతాపం ఎంతో మా ప్రతాపమెంతో అని వాళ్ళ బామ్మ అంటుంది. స్వర ఈ ఆట ఆడుతుంటే చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ బాధపడుతుంది అని అభిషేకం ఆలోచించి తాడును లూజుగా పట్టుకుంటాడు. కీర్తి వాళ్ళు గట్టిగా లాగడంతో అభిషేక్ వెళ్లి స్వర మీద పడతాడు.

అందరూ అలాగే నిలబడి చూస్తూ ఉంటారు. ఝాన్సీ కి కోపం వచ్చి అభి అని రెండు మూడు సార్లు పిలుస్తుంది.సారీ స్వర తాడు గట్టిగా లాగేసరికి వచ్చింది మీద పడ్డాను అని అభిషేక్ అంటాడు. అయ్యో పర్వాలేదండి అని స్వర అంటుంది. రేసు గుర్రాలతో పెట్టుకో ఈ సింహంతో కాదు అని వాళ్ళ బామ్మ అంటుంది. నేను ఎంత పిలిచినా అభికి వినపడట్లేదు ఏంటి రోజు రోజుకి అభి స్వరకి దగ్గర అయిపోతున్నాడా లేకుంటే నేనే నెగటివ్గా ఆలోచిస్తున్నాను అని ఝాన్సీ అనుకుంటుంది. కట్ చేస్తే, ఆర్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఇంకా రాలేదేంటి అని వైజయంతి అంటుంది. నువ్వే చెప్పావు కదా ఆర్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడని వస్తారులే ఎందుకు కంగారు పడతావు అని నాయుడు అంటాడు.

ఏంటి బావ అంత డల్ గా ఉన్నావు అని వైజయంతి అడుగుతుంది. మనసంతా ఏమీ బాగోలేదు అలా బయటికి వెళ్లాలనిపిస్తుంది అని నాయుడు అంటాడు. అంతేనా అయితే వెళ్లి రా బావ నేను ఇల్లు చూసుకుంటానులే అని వైజయంతి అంటుంది. అభిషేకు ఊరుకోడు కదా అని నాయుడు అంటాడు.తను ఎందుకు చూస్తాడు బావ అని కానిస్టేబుల్ ని పిలిచి సార్ ని బయటికి తీసుకువెళ్ళు అని వైజయంతి అంటుంది. అలాగే అని కానిస్టేబుల్ నాయుడుని తీసుకొని బయటికి వెళ్లిపోతాడు. నీతో ఎదిరించి మాట్లాడి గెలవలేనని తెలిసి నన్ను నేను ఇలా మార్చుకుంటున్నాను బావ అని వైజయంతి అనుకుంటుంది. కట్ చేస్తే అభి వాళ్ళ ఇంట్లో అందరూ దీపాలు వెలిగించి టపాసులు పేలుస్తూ ఉంటారు.ఏంటి ఝాన్సీ కొయ్యల్లాగా ముగ్గురు అక్కడే నిలబడి పోయారు రండి వచ్చి టపాసులు పేల్చండి అని వాళ్ళ బామ్మ అంటుంది.ఆ మాటకి ఝాన్సీ చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది. ఏంటికి స్వర అక్కడే నిలబడ్డావ్ రా బాంబులు కలుద్దామని కీర్తి అంటుంది. ఏం పర్వాలేదు స్వర వెళ్లి కాల్చు అని అభిషేక్ అంటాడు. కీర్తి స్వర చేత ఒక టపాసు పేలుస్తుంది.

ఆ శబ్దానికి భయపడిపోయి స్వర అభిషేక్ ని గట్టిగా పట్టుకుంటుంది. అంత పిరికితనం అయితే ఎలాగమ్మా ఝాన్సీ లాగా ఉండాలి ధైర్యంగా అని బామ్మ అంటుంది.స్వర కూడా ధైర్యంగానే ఉంటుంది చూడండి అని కీర్తి అంటుంది. ఇందాక నేను కీర్తి ఎంత అన్నా కానీ స్వర టపాసులు కాల్చడానికి రాలేదు అభిషేక్ చెప్పగానే వెళ్లి కాలుస్తుంది ఏంటి ఇదంతా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అభి నాకు దూరమైపోతాడా అని ఝాన్సీ అనుకుంటుంది. ఏంటి ఝాన్సీ ఇప్పటిదాకా బాగానే ఉంది ఇప్పుడు డల్ గా ఉంది ఏదో జరుగుతుంది అని చందన అనుకుంటుంది. వాళ్లందరూ దీపాలు వెలిగించి టపాసులు పేల్చుకుంటూ ఆనందంగా ఉంటే, విశాల్ పక్కనుంచి వాళ్ళని వీడియో తీస్తాడు. కట్ చేస్తే, విశాల్ కోపంగా తన రెండు చేతుల్ని గోడకేసి గుద్దుతూ ఉంటాడు.

రేయ్ విశాల్ నీకు పిచ్చి పట్టిందా రా అని కళ్యాణి అంటుంది. లేదమ్మా నేను మంచిగా ఉందాo అనుకున్న ఆ స్వర నన్ను ఉండనివ్వట్లేదు చూడు అని విశాల్ వీడియో చూపెడతాడు.వీడియో చూసినా కళ్యాణి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ రా అని అంటుంది. అభిషేక్ కంటే ముందు ఆ స్వరని చంపేస్తాను అమ్మ అని విశాల్ అంటాడు.స్వరని చంపేయడం ఏంట్రా అని కళ్యాణి అంటుంది. చంపేయనమ్మ దాన్ని పెళ్లి చేసుకున్న తరువాత టార్చర్ ఉంటుంది దానికి అని చిటికలు వేస్తూ కోపంగా అంటాడు విశాల్.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది