NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa November 23 2023 Episode 81: పదవి కోసం భర్తని బెదిరిస్తున్న వైజయంతి..

Paluke Bangaramayenaa Today Episode November 23 2023 Episode 81 Highlights

Paluke Bangaramayenaa November 23 2023 Episode 81:  విన్నావు కదా బావ నువ్వు ఎక్కువ ఆలోచించకు ఎక్కువగా ఆలోచిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని డాక్టర్లు చెప్పారు అని వైజయంతి అంటుంది. ఇక ఎమ్మెల్యే సీటు గురించి అంటావా ఎమ్మెల్యేగా నిలబడి నీకు మినిస్టర్ పదవిని కూడా తెస్తాను బావ నిన్ను ఈ కేసు నుంచి ఎలాగైనా బయట పడేస్తాను అని వైజయంతి అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి మీరు అతని జాగ్రత్తగా చూసుకుంటాను అంటే నాలుగు గంటలు అబ్జర్వేషన్ లో ఉంచి ఇంటికి పంపించేస్తాం అని అంటాడు. నేను చూసుకుంటాను డాక్టర్ గారు అని వైజయంతి అంటుంది. డాక్టర్ మెడిసిన్ రాసిచ్చి ఇవి తీసుకురండి అని అంటాడు స్వర అవి తీసుకురావడానికి వెళ్ళిపోతుంది. నన్ను క్షమించు స్వర మీ అమ్మ నీకు దూరమైంది నేనేమో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఎమ్మెల్యేగా నా స్థానంలో నిన్ను నిలబెట్టి గౌరవం ఇద్దాం అనుకుంటే ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను నీకు పెళ్లి అయితే సంతోషంగా అన్నా ఉంటావు అని నాయుడు అనుకుంటాడు.

Paluke Bangaramayenaa Today Episode November 23 2023 Episode 81 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 23 2023 Episode 81 Highlights

కట్ చేస్తే,స్వర అలా బయటికి వెళ్లి ఏదైనా జ్యూస్ తాగొద్దాం పద అని అభిషేకం అంటాడు. నాకేమీ వద్దు సార్ మీరు వెళ్లి తాగి రండి అని స్వర అంటుంది నువ్వు ఇలా ఏమీ తినకుండా తాగకుండా ఉంటే మీ నాన్నగారిని ఎవరు చూస్తారు చెప్పు అని ఝాన్సీ అంటుంది. అమ్మ దశదిశకర్మ అయిపోయిందో లేదో నాన్నకు ఈ పరిస్థితి వచ్చింది, నాన్న కోపంలోనైనా నా పేరు పలికేవాడు ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది అని స్వర అంటుంది. టైం కు మందులిచ్చి బాగా చూసుకో నాకు నమ్మకం ఉంది మీ నాన్నగారు త్వరగా బాగా అవుతాడు ఎందుకంటే తను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి కాబట్టి అభిషేక్ అంటాడు. మా నాన్న బాగవుతాడని మీకు నమ్మకం ఉందా సార్ అని స్వర అంటుంది. నువ్వు ముందు ఏడవకుండా కళ్ళు తుడుచుకో అలా వెళ్లి జ్యూస్ తాగి వచ్చి మీ నాన్నని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ని అడుగుదాం అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే ఏం ఆలోచిస్తున్నావ్ యశోద అని వాళ్ళ అత్తయ్య అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode November 23 2023 Episode 81 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 23 2023 Episode 81 Highlights

స్వర గురించే ఆలోచిస్తున్నా అత్తయ్య గారు వాళ్ళ అమ్మ కర్మ అయిపోయిందో లేదో వల నాన్నకు  ఇలా అయ్యింది తను ఒంటరి అయిపోయింది అని యశోద అంటుంది. అమ్మ స్వర ఒంటరిగా అయిపోయింది కాబట్టి తనని మన ఇంటికి తీసుకొద్దాం అమ్మ అని కీర్తి అంటుంది. పూర్తిగా అర్థం చేసుకో కీర్తి ఒక అమ్మాయి వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే చుట్టుపక్కల వాళ్ళు సూటి పోటీ మాటలతో గుచ్చుతారు అందులో మన ఇంట్లో పెళ్లి కావలసిన మీ అన్నయ్య ఉన్నాడు అప్పుడు జనాలు ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటారు అని యశోద అంటుంది ఎవరో ఏదో అనుకుంటారని స్వరని ఒంటరిగా వదిలేద్దామా అని కీర్తి అంటుంది. కీర్తి స్వరా పెద్దింటి అమ్మాయి మనం పంపించమని అడిగినంత మాత్రాన వాళ్ళు పంపించరు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండే సౌకర్యాలు మన ఇంట్లో ఉండవు కదా అని వాళ్ళ బామ్మ అంటుంది. కట్ చేస్తే, ఝాన్సీ ఆలోచిస్తూ ఉంటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 23 2023 Episode 81 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 23 2023 Episode 81 Highlights

నన్ను నమ్ము అని స్వరకూ ధైర్యం చెప్తున్నావు, కానీ నిన్ను ఎన్నో రోజులుగా ప్రేమిస్తున్నా నను మాత్రం పట్టించుకోవట్లేదు అసలు నీ మనసులో నేను ఉన్నానా లేనా అని అని పిస్తుంది అభి ఒక మంచి రోజు చూసి నా మనసులో ఉన్న మాట చెప్తాను అభి ఆ తరువాత నువ్వు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అని ఝాన్సీ తన ఫోన్లో అభిషేక్ ఫోటో చూస్తూ అంటుంది. నువ్వు ఈ మధ్య కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నావ్ ఝాన్సీ ఎవరైనా ప్రేమిస్తున్నావా నాకు చెప్పకపోయినా పర్వాలేదు నువ్వు ప్రేమించే అబ్బాయికి చెప్పు లేదంటే అతని వేరే అమ్మాయిని ఇష్టపడతాడు, ఏదైనా ఒక మంచి రోజు చూసి ఆ అబ్బాయికి చెప్పు నీ మనసులో అతని మీద ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోవాలి కదా అని చందన అంటుంది. కట్ చేస్తే, నాకు బావ మీద ఏమాత్రం కోపం లేదు రంగరాజు గారు కానీ కోపంలో అలా జరిగిపోయింది ఏం చేస్తాం చెప్పండి కానీ మీకు పంపించాల్సిన మూడు కోట్లు పంపించేశాను కానీ రెండు రోజుల్లో ఎమ్మెల్యే నేనే అని కన్ఫర్మేషన్ రావాలి అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 23 2023 Episode 81 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 23 2023 Episode 81 Highlights

నాయుడు దగ్గరికి వచ్చి దొంగ ఏడుపు ఏడుస్తూ ఏంటి బావ ఇలా చేసావు నీకు తాగాలనిపిస్తే ఇంట్లోనే కూర్చొని తాగొచ్చు కదా ఎక్కడికో వెళ్లి తాగుతూ మెట్ల కింద పడిపోయావు ఇప్పుడు చూడు నడవలేని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి అని ఏడుస్తుంది. అన్ని మెట్లు ఎక్కగలిగిన నేను ఆ చివరి మెట్టు మాత్రం ఎందుకు ఎక్కలేకపోయాను వైజయంతి పొరపాటున నీ కాలు తగిలికి  లేదంటే కావాలని నువ్వే పడేసావా అని డౌట్ నాకు ఉంది

Paluke Bangaramayenaa Today Episode November 23 2023 Episode 81 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 23 2023 Episode 81 Highlights

అని నాయుడు అనుకుంటాడు తన మనసులో. నువ్వు ఆవేశంలో ఏం చేస్తున్నావ్ నీకే తెలియట్లేదు బావ తన వయసు ఎంత అనుకొని రాజకీయాల్లో నిలబెడదాం అనుకుంటున్నావు బావ రాజకీయం ఎలా ఉంటుందో అసోసియేషన్ వాళ్లు ఎలా నీచంగా మాట్లాడుతారో నీకు తెలియనిది కాదు కదా బావ నేను నిలబడితే నీకు వచ్చే నష్టం ఏంటి బావ నువ్వు వేరు నేను వేరు కాదని చెప్తున్నాను కదా నిర్ణయాలు తీసుకునే అధికారం నీదే కదా బావ సరే బావ నేను నిలబడను దివ్యవాణి గారికి ఫోన్ చేసి మా అమ్మాయి స్వరకూ అ టికెట్ ఇవ్వమని చెప్పేస్తాను అని వైజయంతి అంటుంది. నాయుడు తన వంక కోపంగా అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి బావ అలా చూస్తున్నావ్ నన్ను నమ్మట్లేదు కదా నీ ప్రేమ కంటే నాకు ఏది ఎక్కువ కాదు బావా, దీనికంటే చావే మేలు అని వైజయంతి ఉరేసుకుంటుంది. నేను ఇప్పుడు ఉరేసుకుంటే అందరికీ లేనిపోని అనుమానాలు వచ్చి నిన్ను ఎంక్వయిరీలు చేస్తారు బావ అందుకే వాళ్లకు క్లారిటీ ఇస్తాను అని వైజయంతి ఫోన్లో వీడియో చేస్తుం, ప్రకాష్ నగర్ కాలనీ ప్రజలందరికీ నా అభివందనాలు దయచేసి మా అమ్మాయి స్వరని మీరు గెలిపించండి అని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N