Paluke Bangaramayenaa October 18th ఎపిసోడ్ 50: అమ్మ ఈ ఫోటోలు చూసి లెటర్ ను చదివి చెప్పమ్మా అనే స్వర అంటుంది. ఆ ఫోటోలని లెటర్ ని చూసిన స్వర వాళ్ళ అమ్మ కూలిపోతుంది. అమ్మ నీకేమైంది అమ్మ అని స్వర్గం కంగారు పడుతుంది. స్వర నన్ను క్షమించమ్మా ఆ విశాల్ ఇంత రాక్షసుడు అని నేను తెలుసుకోకుండా నిన్ను కొట్టాను తిట్టాను అని స్వర వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ నువ్వే కాదమ్మా వాడి నటన చూసి మన ఇంట్లో వాళ్ళు నేను కూడా మోసపోయాము అని స్వర అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు స్వరా అని వాళ్ళ అమ్మ అంటుంది.

వాడి గురించి పూర్తి వివరాలు మనకు తెలిసినంతవరకు వెయిట్ చేద్దాం అలాగే ఈ ఫోటోలని నీ దగ్గరే ఎవరికీ అనుమానం రాకుండా దొరకకుండా దాచి పెట్టమ్మా వాడే ఇoదుని చంపాడు అనే సాక్ష్యం బలంగా దొరకాలి అమ్మ త్వరలోనే దొరుకుతుందని నమ్మకం నాకుంది అని స్వర అంటుంది. ఆ దుర్మార్గుడికి నీ మీద అనుమానం రాకుండా చూసుకో స్వరా జాగ్రత్త అని వాళ్ళ అమ్మ అంటుంది. అలాగే అమ్మ అని స్వర అంటుంది. సుగుణ నీ మాటల్లో పెట్టి ఏం మాట్లాడుకున్నారు అని అడగాలి అని జయంతి అనుకుంటుంది. కట్ చేస్తే ఇంకెన్ని చోట్లకు తిప్పుతారు లాయర్ మేడం అని అభిషేక్ అంటాడు.

తినడం కోసం ఎన్ని చోట్ల కైనా తిరగాలి సార్ అని ఝాన్సీ అంటుంది. మీరు తినడం కోసమే బ్రతుకుతారు మేము బ్రతకడం కోసం తింటాము అని అభిషేక్ అంటాడు. నచ్చిన వాళ్లతో లాంగ్ ట్రిప్పు వెళితే చాలా హ్యాపీ కదా అని ఝాన్సీ అంటుంది. నువ్వు చాలా ముదిరిపోయావు అని అభిషేక్ అంటాడు. అలా ఉన్నా సరే మీ అబ్బాయిలు వదిలిపెట్టడం లేదు కదా అని ఝాన్సీ అంటుంది.విశ్వం మందు తాగేసి ఇంటికి వెళుతూ ఉండగా రోడ్డు మీద ఎవరితోనో గొడవ పడుతూ ఝాన్సీ కి కనబడతాడు. కారు పక్కకు ఆపి వచ్చి ఏంటి బాబాయ్ ఇలా తాగేసి రోడ్డు మీద తిరుగుతున్నావు అనే ఝాన్సీ అంటుంది. అమ్మ ఝాన్సీ నన్ను క్షమించమ్మా నువ్వు ఈ ఊరు నుండి వెళ్ళిపో అమ్మ లేకుంటే రాక్షసుడు నిన్ను చంపేస్తాడు అనే విశ్వం అంటాడు.

ఏం మాట్లాడుతున్నావ్ బాబాయ్ ఎవరు నన్ను చంపేస్తారు అని ఝాన్సీ అంటుంది. తాగిన మైకంలో వాడికి నీ పేరు చెప్పేశానమ్మా నిను వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాడు అయ్యో అయ్యో అని తల బద్దలు కొట్టుకుంటూ ఏడుస్తాడు విశ్వం. నన్ను ఎవరు ఏమీ చేయలేరు బాబాయ్ నువ్వు ఏం భయపడకు నేను చూసుకుంటాను అభి బాబాయ్ ని వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేద్దాం అని ఝాన్సీ అంటుంది. మా ఇల్లు పక్కనే అమ్మ నేను వెళ్తాను నువ్వు ఇంటికి వెళ్ళిపో అని విశ్వ నడుచుకుంటూ వెళ్లిపోతాడు. నాయుడు వాళ్ళ ఇంటికి రంగారాజూ వస్తాడు. రండి గారు ఏంటి పని ఇలా వచ్చారు అని జయంతి అంటుంది. నాయుడుని కలుద్దామని వచ్చానమ్మా అని రంగా రాజు అంటాడు. బావ ఇంట్లో లేడండి ఫోన్ చేసి రావాల్సింది అని జయంతి అంటుంది. సరే అమ్మ నేను సాయంత్రం వస్తాను అనే రంగరాజు వెళ్ళిపోతూ ఉండగా ఆగండి రంగరాజు గారు ఆ పని ఏంటో నాకు చెప్పండి బావ రాగానే చెప్తాను అని జయంతి అంటుంది. నాయుడు కంపెనీ పెట్టడానికి ఒక స్థలం చూడమని చెప్పాడు అమ్మ ఆ స్థలం చూశాను కానీ అది విశాల్ ది ఎంత డబ్బు ఇచ్చినా ఆ స్థలాన్ని అమ్మన ని అంటున్నాడు అని రంగరాజు అంటాడు.

అవన్నీ మీరు వదిలేయండి అక్కడ పనులు మొదలు పెట్టండి నేను చూసుకుంటాను అని జయంతి అంటుంది. అది కాదమ్మా అన్ని రంగరాజు అంటాడు.నా బంగారం చూసుకుంటాను అంటే అది ఏదైనా జరిగిపోవాల్సిందే నా కోసం ఏదైనా చేస్తుంది అని నాయుడు అంటాడు. ఇలా మాటలతో పోగొట్టడం కాదు బావ ఆ ఫ్యాక్టరీ నా పేరు మీద పెట్టు దాని బరువు బాధ్యతలు అన్నీ నేనే చూసుకుంటాను అని జయంతి అంటుంది. నీ పేరు మీద ఉంటే ఒకటి నా పేరు మీద ఉంటే ఒకటా రంగరాజు గారు ఆ పంని మొదలు పెట్టండి అని నాయుడు అంటాడు. వినపడిందా రంగరాజు గారు అని జయంతి అంటుంది. వినపడింది అమ్మ ఆ పని మీదే ఉంటాను వెళ్ళొస్తాను నాయుడు అనే రంగరాజు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆఫీస్ కి లేట్ అవుతుంది స్వర త్వరగా రెడీ అవ్వు ఆ విశాల్ ని పట్టుకునే విషయంలో పదినిమిషాలు కూడా వెయిట్ చేయకూడదు అని ఈశ్వర బ్యాగు తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో విశాల్ వస్తాడు. అత్తయ్య గారు నమస్తే స్వర ఏం చేస్తుంది అత్తయ్య అని విశాల్ అంటాడు. ఆఫీస్ కి బయలుదేరుతుంది అని సుగుణ లోపలికి వెళ్ళిపోతుంది.

ఏంటి ఈవిడ అలా వెళ్ళిపోతుంది ఎప్పుడు వచ్చినా ఎవ్వరూ చేయనంత మర్యాద చేసేది ఇప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతుందేంటి అని విశాల్ అనుకుంటాడు. విశాల్ ఎప్పుడు వచ్చావు కూర్చో ఏంటి ఇలా వచ్చావ్ స్వర కోసమా ఆఫీస్ కి వెళ్తుంది కదా తనకు మాట్లాడేOత టైం ఉందో లేదో అని జయంతి అంటుంది. తనని ఆఫీస్ దగ్గర దించడానికి వెళ్తాను కదా ఆ టైం చాలు అత్తయ్య అని విశాల్ అంటాడు.ఏంటి జయంతి ఎప్పుడు విశాల్ ఇంటికి వచ్చిన పట్టించుకునేది కాదు ఇయాల ఎంత బాగా మాట్లాడుతుంది ముందు ఈ విషయం స్వరకి చెప్పాలి అని వెళ్లి స్వర నువ్వు ఆఫీస్ కి వెళ్ళకు ఆ విశాల్ వచ్చాడు అని అంటుంది వాళ్ళ అమ్మ. వచ్చాడా అతనితో మంచిగా ఉండి సాక్షాదారులు సంపాదించాలమ్మా అని స్వర అంటుంది.

ఏమోనే నాకు భయం వేస్తుంది అని వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ ఎందుకు భయపడుతున్నావ్ నేను చూసుకుంటాను పద వెళ్దాం అని స్వర హాల్లోకి వస్తుంది. గుడ్ మార్నింగ్ స్వరా ఆఫీసుకు బయలుదేరావా పద నేను డ్రాప్ చేస్తాను అని విశాల్ అంటాడు. పర్వాలేదు నేను ఆటోలో వెళ్తాను అని స్వరా అంటుంది. విశాల్ నీతో కొద్దిసేపు మాట్లాడదామని వస్తే నువ్వు ఆటోలో వెళ్తానంటే ఏంటి విశాల్ డ్రాప్ చేస్తాడు వెళ్ళు అని జయంతి అంటుంది. సరే పిన్ని అని స్వరా అంటుంది. సరే ఆంటీ వెళ్ళొస్తాము అత్తయ్య అని విశాల్ వాళ్ళు బయలుదేరుతారు. ఆ దుర్మార్గుడు నా కూతురుని ఏం చేస్తాడు అని స్వర వాళ్ళ అమ్మ అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది