NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Supreme Court: సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు మరో సారి చుక్కెదురు

Share

Supreme Court: సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు మరో సారి చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఏదైనా వ్యతిరేకంగా తీర్పు వస్తే, ఆ తీర్పు ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించడం, అక్కడ కూడా హైకోర్టు తీర్పునే సమర్ధిస్తూ ఉత్తర్వులు రావడం పరిపాటిగా మారింది. తాజాగా ఇద్దరు నిందితులకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. జగత్ జనని చిట్ ఫండ్ కంపెనీ అక్రమాల ఆరోపణలతో టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను ఏపీ సీఐడీ గతంలో అరెస్టు చేసింది.

Supreme Court

అయితే వారు హైకోర్టును ఆశ్రయించగా.. ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఏపీ సీఐడీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. బుధవారం ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీఐడీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. విచారణకు సహకరించాలని అదిరెడ్డి అప్పారావుకు సుప్రీం కోర్టు సూచించింది. విచారణకు సహకరిస్తారని సిద్ధార్థ లూథ్రా హామీ ఇచ్చారు. దీంతో ఆదిరెడ్డి అప్పారావు బ యిల్ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

కొద్ది రోజుల క్రితమే ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేరువేరు పిటిషన్లను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. అంగళ్లు ఘటన కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి లకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఆ బెయిల్స్ రద్దు చేయాలని ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినందున తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు మరో సారి ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు బెయిల్ అంశంలోనూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయ్యింది.

Asaduddin Owaisi: కాంగ్రెస్ అసంతృప్తులకు ఎంఐఎం అధినేత ఓవైసీ బంపర్ ఆఫర్


Share

Related posts

ఆ టాప్ హీరోయిన్ గుట్టు మొత్తం రోడ్డు మీద పెట్టిన ఆమె డ్రైవర్ !!

GRK

స్వీట్ కార్న్ పకోడీ ఇలా చేసుకుని తింటే ఆ కిక్కే వేరు..!

bharani jella

నిసాన్ కార్లు – సియట్ టైర్లు అదిరిపోయే ఒప్పందం.., ఆధునిక టైర్లుతో కార్లు..!!

bharani jella