NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Asaduddin Owaisi: కాంగ్రెస్ అసంతృప్తులకు ఎంఐఎం అధినేత ఓవైసీ బంపర్ ఆఫర్

Asaduddin Owaisi: తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులకు మజ్లస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు మజ్లిస్ పార్టీలోకి రావాలని ఆయన సూచించారు. మజ్లిస్ పార్టీలోకి వచ్చిన వారికి సముచిత గౌరవం లభిస్తుందని తెలిపారు.

దారుల్ సలాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. మజ్లిస్ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి అని ఆయన ఆరోపించారు. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఒవైసీ ప్రశంసించారు.

పేదలకు మేలు చేసేదిగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని అన్నారు ఒవైసీ. తెలంగాణలో కేసిఆర్ మూడో సారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఖాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు టికెట్లు రాకపోవడంతో పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలువురు వేరే పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. మరో పక్క బీఆర్ఎస్ లోని అసంతృప్తి నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్ లు ఎక్కువ అయ్యాయి. ఒవైసీ పిలుపునకు ఎంత మంది కాంగ్రెస్ అసంతృప్తులు సానుకూలంగా స్పందించి ఎంఐఎంలో చేరతారో వేచి చూడాలి.

T Congress: అలూలేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అంటే ఇదేనేమో.. సీఎం పదవిపై సీనియర్‌ల ఆశలు

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju